BSF Recruitment: పదితోనే 2788 కానిస్టేబుల్ కొలువు.. ఎంపిక ప్రక్రియ ఇలా..
పదోతరగతి, ఐటీఐ పూర్తిచేసి కేంద్ర రక్షణ దళాల్లో పనిచేయాలని కోరుకునే వారి కోసం బీఎస్‌ఎఫ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. దీని ద్వారా మొత్తం 2788 ఉద్యోగాలను భర్తీచేయనున్నారు. భారత ప్రభుత్వ హోంమంత్రిత్వ శాఖకు
చెందిన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ డైరెక్టరేట్ జనరల్ 2021–22 సంవత్సరానికి ఈ పోస్టులను భర్తీ చేయనుంది. పీఈటీ, ట్రేడ్ టెస్ట్, రాత పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆసక్తి గల పురుష, మహిళ అభ్యర్థు«లు మార్చి 01 తేదీలోగా
ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
బీఎస్‌ఎఫ్
భారత ప్రభుత్వానికి సంబంధించిన సాయుధ దళాల్లో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్‌ఎఫ్) ఒకటి. ఎయిర్, మెరైన్, అర్టిలరీ రెజిమెంటల్ తదితర బెటాలియన్లు దీనిలో భాగంగా ఉన్నాయి. 192 బెటాలియన్లతో విస్తృత పరిధి కలిగిన ఈ సంస్థ దేశ సరిహద్దు
భద్రతనే కాకుండా.. అవసరమైన ఇతర కార్యకలాపాల్లో కూడా పాలుపంచుకుంటుంది.
- మొత్తం పోస్టుల సంఖ్య: 2788 (పురుషులు–2651, మహిళలు–137)
- పోస్టుల వివరాలు: కానిస్టేబుల్(ట్రేడ్ మెన్)
- ట్రేడుల వారీగా ఖాళీలు: కాబ్లర్–91, టైలర్–49, కుక్–944, డబ్ల్యూ/సీ–537, డబ్ల్యూ/ఎం–356, బార్బర్–130, స్వీపర్–637, కార్పెంటర్–13, పెయింటర్–03, ఎలక్ట్రీషియన్–04, డ్రాఫ్ట్స్‌మెన్–01, వెయిటర్–06, మాలి–04.
అర్హతలు
- పదోతరగతి ఉత్తీర్ణతతోపాటు సంబంధిత విభాగంలో ఐటీఐ డిప్లొమా లేదా రెండేళ్ల పని అనుభవం కలిగి ఉండాలి.
- వయసు: 2021 ఆగస్టు నాటికి 18–23 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది.
- పీఈటీ: 167 సెం.మీ ఎత్తు ఉండాలి. అలాగే ఎత్తుకు తగిన బరువు ఉండాలి. ఛాతీ 78–83 సెం.మీ ఉండాలి. మహిళలు 157 సెం.మీ ఎత్తు, తగిన బరువు కలిగి ఉండాలి.
- వేతనాలు: లెవల్ 3 ఉద్యోగులకు రూ.21,700–69,100 వేతనంగా అందుతుంది. అలాగే ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఇతర అలవెన్సులు సైతం లభిస్తాయి.
ఎంపిక ప్రక్రియ
- ఈ ఉద్యోగాలకు సంబంధించి ఎంపిక ప్రక్రియ మూడు దశల్లో నిర్వహిస్తారు.
- మొదటి దశ: ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్(పీఎస్‌టీ), ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్(పీఈటీ)లను నిర్వహిస్తారు. ఈ రెండింటిలో అర్హత సాధించిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్, ట్రేడ్ టెస్టులు నిర్వహిస్తారు. ఇందులోనూ అర్హత సాధిస్తే రెండో దశలో రాత పరీక్ష ఉంటుంది.
రాత పరీక్ష
ఈ పరీక్ష మొత్తం 100 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. ఈ పరీక్షలో జనరల్ అవేర్‌నెస్/జీకే(25 ప్రశ్నలు–25మార్కులు), ఎలిమెంటరీ మ్యాథ్స్(25 ప్రశ్నలు–25 మార్కులు), అనలిటికల్ ఆప్టిట్యూడ్ అండ్ ఎబిలిటీ టు అబ్జర్వ్ ది
డిస్టిగ్విష్‌డ్ ప్యాట్రన్స్(25 ప్రశ్నలు–25 మార్కులు), ఇంగ్లిష్/హిందీ భాషపై(25 ప్రశ్నలు–25 మార్కుల) పరీక్ష ఉంటుంది.
మెడికల్ టెస్ట్: ఫిజికల్ టెస్టులు, రాత పరీక్షల్లో అర్హత సాధించిన వారికి మూడో దశలో మెడికల్ టెస్టులను నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
ముఖ్యమైన సమాచారం
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
- దరఖాస్తులకు చివరి తేదీ: 01.03.2022
- వెబ్‌సైట్: https://rectt.bsf.gov.in
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 10TH |
Last Date | March 01,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |