ICHR Recruitment 2022: ఐసీహెచ్‌ఆర్‌లో 80 జేఆర్‌ఎఫ్ పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
న్యూఢిల్లీలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్(ఐసీహెచ్‌ఆర్).. 2022–23 సంవత్సరానికి సంబంధించి జేఆర్‌ఎఫ్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీల సంఖ్య: 80
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్శిటీలో హిస్టారికల్ స్టడీస్ సబ్జెక్టులో పీహెచ్‌డీ చదవడానికి రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు ఈ ఫెలోషిప్ ప్రోగ్రామ్ దరఖాస్తుకు అర్హులు.
ఫెలోషిప్ మొత్తం: ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.17,600 చెల్లిస్తారు. అదనంగా కంటిన్‌జెన్సీ గ్రాంట్ కింద ఏడాదికి రూ.16,500 అందజేస్తారు.
ఎంపిక విధానం: దీని ఎంపిక ప్రక్రియ రెండు దశల్లో ఉంటుంది. మొదటి దశలో 100 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో రాతపరీక్ష నిర్వహిస్తారు. దీనిలో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా అభ్యర్థుల్ని రెండో దశకు ఎంపికచేస్తారు. రెండో దశలో ప్రజంటేషన్, ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును మెంబర్ సెక్రటరీ, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రీసెర్చ్(ఐసీహెచ్‌ఆర్), 35 ఫెరోజెషాన్ రోడ్, న్యూఢిల్లీ–110001 చిరునామకు పంపించాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 06.05.2022
స్టేజ్1 ప్రవేశపరీక్ష తేది: 08.06.2022
ప్రజంటేషన్, ఇంటర్వ్యూ(స్టేజ్2) తేదీలు: 2022 జూన్ 27 నుంచి జూలై 06 వరకు.
వెబ్‌సైట్: http://www.ichr.ac.in/
చదవండి: DRDO Recruitment 2022: డీఆర్‌డీవో–డీఎంఎస్‌ఆర్‌డీఈ, కాన్పూర్‌లో జేఆర్‌ఎఫ్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | PhD |
Last Date | May 06,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |