Technician/Technical Assistant Jobs: సీఎస్‌ఐఆర్–సీజీసీఆర్‌ఐ, కోల్‌కతాలో 70 ఉద్యోగాలు.. ఎంపిక విధానం ఇలా..
కోల్‌కతాలోని సీఎస్‌ఐఆర్–సెంట్రల్ గ్లాస్ అండ్ సిరామిక్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్(సీజీసీఆర్‌ఐ) ఉద్యోగాలు భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 70
పోస్టుల వివరాలు: టెక్నీషియన్లు–32, టెక్నికల్ అసిస్టెంట్లు–38.
టెక్నీషియన్లు:
అర్హత: పదో తరగతి/తత్సమాన ఉత్తీర్ణతతో పాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: 28 ఏళ్లు మించకుండా ఉండాలి.
జీతం: నెలకు రూ.19,900 నుంచి రూ.63,200 వరకు చెల్లిస్తారు.
టెక్నికల్ అసిస్టెంట్లు:
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో కనీసం 60 శాతం మార్కులతో ఇంజనీరింగ్ డిప్లొమా, బీఎస్సీ/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: 28 ఏళ్లు మించకుండా ఉండాలి.
జీతం: నెలకు రూ.35,400 నుంచి రూ.1,12,400 వరకు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ట్రేడ్ టెస్ట్, ఓఎంఆర్ బేస్డ్/కంప్యూటర్ బేస్డ్ ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ ఛాయిస్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది కంట్రోలర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, సీఎస్‌ఐఆర్–సీజీసీఆర్‌ఐ, కోల్‌కతా–700032 చిరునామకు పంపించాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 31.05.2022
దరఖాస్తు హార్డ్‌కాపీలను పంపడానికి చివరితేది: 15.06.2022
వెబ్‌సైట్: https://www.cgcri.res.in
చదవండి: Junior Research Fellow Jobs: సీఎస్‌ఐఆర్–ఎన్‌ఎంఎల్‌లో జేఆర్‌ఎఫ్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | DIPLOMA |
Last Date | May 31,2022 |
Experience | 2 year |
For more details, | Click here |