Skip to main content

HAL Recruitment: హాల్, కోరాపుట్‌లో మెడికల్‌ స్టాఫ్‌ పోస్టులు.. నెలకు రూ.1.80 ల‌క్షల‌ వ‌ర‌కు వేతనం..

HAL Koraput Recruitment

కోరాపుట్‌(ఒడిశా)లోని హిందూస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హాల్‌).. ఒప్పంద ప్రాతి పదికన మెడికల్‌ స్టాఫ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 15
పోస్టుల వివరాలు: మెడికల్‌ సూపరింటెండెంట్, సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్, జనరల్‌ డ్యూటీ మెడికల్‌ ఆఫీసర్‌.
విభాగాలు: జనరల్‌ మెడిసిన్, ఆప్తమాలజీ, ఆర్థోపెడిక్, అనస్తీషియా, పీడియాట్రిక్స్, రేడియాలజీ.
అర్హత: పోస్టుల్ని అనుసరించి ఎంబీబీఎస్, సంబంధిత స్పెషలైజేషన్‌లో పోస్టు గ్రాడ్యుయేషన్‌ డిగ్రీ/డిప్లొమా, డీఎన్‌బీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: 31.01.2022 నాటికి 35 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: నెలకు రూ.40,000 నుంచి రూ.1,80,000 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది చీఫ్‌ మేనేజర్‌(హెచ్‌ఆర్‌), రిక్రూట్‌మెంట్‌ సెల్, కోరాపుట్‌ డివిజన్, సునాబేడా–763002, కోరాపుట్‌ జిల్లా, ఒడిశా చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 10.04.2022

వెబ్‌సైట్‌: https://www.hal-india.co.in
 

చ‌ద‌వండి: AIIMS Recruitment 2022: ఎయిమ్స్, మంగళగిరిలో ట్యూటర్‌ పోస్టులు.. నెలకు రూ.1.77 ల‌క్షల‌ వ‌ర‌కు వేతనం..
​​​​​​​
లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date April 10,2022
Experience 4 year
For more details, Click here

Photo Stories