Skip to main content

ECHS Recruitment 2022: ఈసీహెచ్‌ఎస్, సికింద్రాబాద్‌లో 103 పోస్టులు... దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

ECHS Secunderabad

సికింద్రాబాద్‌లోని ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ కంట్రిబ్యూటరీ హెల్త్‌ స్కీమ్‌(ఈసీహెచ్‌ఎస్‌) స్టేషన్‌ హెడ్‌క్వార్టర్స్‌–సికింద్రాబాద్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని వివిధ ప్రాంతాల్లో ఒప్పంద ప్రాతిపదికన పనిచేసేందుకు మెడికల్, పారా–మెడికల్, నాన్‌–మెడికల్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీల సంఖ్య: 103
పోస్టుల వివరాలు: మెడికల్‌ స్పెషలిస్ట్, మెడికల్‌ ఆఫీసర్, డెంటల్‌ ఆఫీసర్, నర్సింగ్‌ అసిస్టెంట్, ఫిజియోథెరపిస్ట్, ల్యాబ్‌ టెక్నీషియన్,ఫార్మసిస్ట్, ప్యూన్, డ్రైవర్, క్లర్క్, డీఈవో తదితరాలు.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో ఎనిమిదో తరగతి/జీడీ ట్రేడ్,డిప్లొమా, బీఎస్సీ ఎంఎల్‌టీ, జీఎన్‌ఎం,గ్రాడ్యుయేషన్,బీఫార్మసీ, బీడీఎస్,ఎంబీబీఎస్,ఎండీ/ఎంఎస్‌ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
జీతం: నెలకు రూ.16,800 నుంచి రూ.1,00,000 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

ఇంటర్వ్యూ తేదీలు: పోస్టుల్ని అనుసరించి 2022 మార్చి 09, 10, 11, 12, 14, 15, 16, 17, 19, 21 తేదీల్లో నిర్వహిస్తారు.
వేదిక: హెడ్‌ క్వార్టర్స్‌ తెలంగాణ– ఆంధ్రా సబ్‌ ఏరియా, సికింద్రాబాద్‌.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును స్టేషన్‌ హెడ్‌ క్వార్టర్స్‌ సెల్,సీ/ఓ బైసన్‌ యూఆర్‌సీ కాంప్లెక్స్, నాగ్‌ మందిర్‌ రోడ్,త్రిముల్గర్రీ పోస్ట్, సికింద్రాబాద్‌–500015, తెలంగాణ చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేది: 21.02.2022

వెబ్‌సైట్‌: https://www.echs.gov.in/


చ‌ద‌వండి: NIMS Recruitment 2022: నిమ్స్, హైదరాబాద్‌లో ప్రొఫెసర్‌ పోస్టులు.. దరఖాస్తు విధానం ఇలా..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 10TH
Last Date February 21,2022
Experience 1 year
For more details, Click here

Photo Stories