Skip to main content

Telangana Govt Jobs: కేజీబీవీల్లో 1241 పోస్టులు.. పరీక్ష స్వరూపం, ప్రిపరేషన్‌ తదితర వివరాలు ఇవే..

కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయా(కేజీవీబీ)లు, అర్బన్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌(యూఆర్‌ఎస్‌)ల్లో 1241 పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన భర్తీ చేసే ఈ పోస్టులకు ఆన్‌లైన్‌ రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. జూన్‌ 26 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో పోస్టుల సంఖ్య, అర్హతలు, ఎంపిక విధానం, పరీక్ష స్వరూపం, ప్రిపరేషన్‌ తదితర వివరాలు..
kgbv 1241 teacher jobs notification and preparation tips

పోస్టుల వివరాలు
కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయా(కేజీవీబీ)ల్లో.. స్పెషల్‌ ఆఫీసర్స్‌(ఎస్‌వో), పోస్టు గ్రాడ్యుయేట్‌ కాంట్రాక్ట్‌ రెసిడెంట్‌ టీచర్స్‌(పీజీ సీఆర్‌టీ), కాంట్రాక్ట్‌ రెసిడెంట్‌ టీచర్స్‌(సీఆర్‌టీ), ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్స్‌(పీఈటీ) పోస్టులు; అర్బన్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌(యూఆర్‌ఎస్‌)ల్లో.. స్పెషల్‌ ఆఫీసర్స్‌(ఎస్‌వో), కాంట్రాక్ట్‌ రెసిడెంట్‌ టీచర్స్‌(సీఆర్‌టీ) పోస్టులు భర్తీ చేయనున్నారు. 

మొత్తం పోస్టుల సంఖ్య: 1241

  • కేజీవీబీ-పోస్టులు 1218: స్పెషల్‌ ఆఫీసర్‌-38, పీజీ సీఆర్‌టీ(ఇంగ్లిష్‌)-110, పీజీ సీఆర్‌టీ(మ్యాథమేటిక్స్‌)-60, పీజీ సీఆర్‌టీ(నర్సింగ్‌)-160, పీజీ సీఆర్‌టీ(తెలుగు)-104, పీజీ సీఆర్‌టీ(ఉర్దూ)-2, పీజీ సీఆర్‌టీ(బోటనీ)-55, పీజీ సీఆర్‌టీ(కెమిస్ట్రీ)-69,పీజీ సీఆర్‌టీ(సివిక్స్‌)-55, పీజీ సీఆర్‌టీ(కామర్స్‌)-70, పీజీ సీఆర్‌టీ(ఎకనామిక్స్‌)-54, పీజీ సీఆర్‌టీ(ఫిజిక్స్‌)-56, పీజీ సీఆర్‌టీ(జువాలజీ)-54, సీఆర్‌టీ(బయో సైన్స్‌)-25, సీఆర్‌టీ(ఇంగ్లిష్‌)-52, సీఆర్‌టీ(హిందీ)-37, సీఆర్‌టీ(మ్యాథమెటిక్స్‌)-45,సీఆర్‌టీ(ఫిజికల్‌ సైన్స్‌)-42, సీఆర్‌టీ(సోషల్‌ స్టడీస్‌)-26, సీఆర్‌టీ(తెలుగు)-27, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌-77.
  • యూఆర్‌ఎస్‌-మొత్తం పోస్టులు-23: స్పెషల్‌ ఆఫీసర్‌-4,సీఆర్‌టీ(తెలుగు)-5, సీఆర్‌టీ(ఇంగ్లిష్‌)- 5,సీఆర్‌టీ(సైన్స్‌)-6,సీఆర్‌టీ(సోషల్‌ స్టడీస్‌)-3

చ‌ద‌వండి: TS KGBV Recruitment 2023: తెలంగాణ కేజీబీవీల్లో 1241 అధ్యాపక పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల.. ఎవరు అర్హులంటే..

విద్యార్హతలు

  • పీజీసీఆర్‌టీ: 50 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టులో పోస్టు గ్రాడ్యుయేషన్‌ తోపాటు బీఈడీ పూర్తి చేసి ఉండాలి. 
  • స్పెషల్‌ ఆఫీసర్‌: కనీసం 50 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టులో పోస్టు గ్రాడ్యుయేషన్‌తోపాటు బీఈడీ పూర్తి చేసి ఉండాలి. తెలంగాణ స్టేట్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (టీఎస్‌ టెట్‌)/ఆంధ్రప్రదేశ్‌ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (2014.06.02 కంటే ముందు నిర్వహించిన ఏపీ టెట్‌)/సెంట్రల్‌ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌(సీటెట్‌) పేపర్‌ 2లో ఉత్తీర్ణత సాధించాలి.
  • సీఆర్‌టీ: 50 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్‌/పోస్టు గ్రాడ్యుయేషన్‌తోపాటు బీఈడీ పూర్తి చేయాలి. తెలంగాణ స్టేట్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (టీఎస్‌ టెట్‌)/ఆంధ్రప్రదేశ్‌ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (2014.06.02 కంటే ముందు నిర్వహించిన ఏపీ టెట్‌)/సెంట్రల్‌ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (సీటెట్‌) పేపర్‌ 2లో ఉత్తీర్ణతఉండాలి.
  • పీఈటీ: కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్‌తోపాటు ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌లో సర్టిఫికెట్‌/డిప్లొమా ఉండాలి. లేదా బ్యాచిలర్‌ డిగ్రీతోపాటు కనీసం ఏడాది వ్యవధి ఉన్న బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌(బీపీఈడీ)లో ఉత్తీర్ణత సాధించాలి. 
  • కస్తూర్బా గాంధీ బాలికా పాఠశాలల్లో స్పెషల్‌ ఆఫీసర్, సీఆర్‌టీ, పీఈటీ, పీజీసీఆర్‌టీ పోస్టులకు మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులు. ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌ పోస్టులకు దివ్యాంగులు అనర్హులు. 

వయసు
2023 జూలై 1 నాటికి అభ్యర్థుల వయసు 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/బీసీ/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు ఐదేళ్లు, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు మూడేళ్లు, దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల సడలింపు ఉంటుంది. 

ఎంపిక విధానం
రాత పరీక్షలో అర్హులైన అభ్యర్థుల ప్రతిభ, టెట్‌ స్కోరు, అనుభవం ఆధారంగా తుది ఎంపిక చేస్తా­రు. అన్ని పోస్టులకు రాత పరీక్షలో అర్హత సాధించాలంటే.. ఓసీ అభ్యర్థులు 40 శాతం మార్కులు, బీసీ అభ్యర్థులు 35 శాతం మార్కులు; ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులు 30 శాతం మార్కులు సాధించాలి. పీఈటీ పోస్టులకు రాతపరీక్షలో మార్కుల(100 శాతం వెయిటేజీ) ఆధారంగా ఎంపిక చేస్తారు. 

రాత పరీక్ష స్వరూపం

  • పీజీసీఆర్‌టీ: మొత్తం 100 ప్రశ్నలు ఇస్తారు. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు. పరీక్ష కాలవ్యవధి 120 నిమిషాలు. జనరల్‌ స్టడీస్, బేసిక్‌ ప్రొఫిషీయెన్సీ ఇన్‌ ఇంగ్లిష్, పర్‌స్పెక్టివ్స్‌ ఇన్‌ ఎడ్యుకేషన్, సబ్జెక్టు కంటెంట్, పెడగాజీ విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. 
  • స్పెషల్‌ ఆఫీసర్‌: మొత్తం 100 ప్రశ్నలు ఇస్తారు. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు. పరీక్ష కాలవ్యవధి 120 నిమిషాలు. జనరల్‌ నాలెడ్జ్, కరెంట్‌ అఫైర్స్, బేసిక్‌ ప్రొఫిషీయెన్సీ ఇన్‌ ఇంగ్లిష్, పర్‌స్పెక్టివ్స్‌ ఇన్‌ ఎడ్యుకేషన్, పెడగాజీ, చైల్డ్‌ డెవలప్‌మెంట్, స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ అడ్మినిస్ట్రేషన్‌ విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. 
  • సీఆర్‌టీ: ఇందులో కూడా మొత్తం 100 ప్రశ్నలు ఇస్తారు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు. పరీక్ష కాలవ్యవధి 120 నిమిషాలు. జనరల్‌ స్టడీస్, బేసిక్‌ ప్రొఫిషీయెన్సీ ఇన్‌ ఇంగ్లిష్, పర్‌స్పెక్టివ్స్‌ ఇన్‌ ఎడ్యుకేషన్, సబ్జెక్టు కంటెంట్, పెడగాజీ విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. 
  • పీఈటీ: మొత్తం 100 ప్రశ్నలు ఇస్తారు. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు. పరీక్ష కాలవ్యవధి 120 నిమిషాలు. జనరల్‌ స్టడీస్, జనరల్‌ ఇంగ్లిష్‌తోపాటు ఫిజియాలజీ, ఫిజికల్‌ ఎడ్యుకేషన్, స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్, శిక్షణ తదితర అంశాలపై ప్రశ్నలు అడుగుతారు. 

ముఖ్య సమాచారం

  • దరఖాస్తు విధానం: https://schooledu.telangana.gov.in/ వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 
  • ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: జూలై 5, 2023
  • రాత పరీక్ష తేది: జూలై 2023 
  • వెబ్‌సైట్‌: https://schooledu.telangana.gov.in/

 

చ‌ద‌వండి: 1.78 Lakh Government Teachers Jobs 2023 : బ్రేకింగ్ న్యూస్‌.. 178,000 ప్ర‌భుత్వ టీచ‌ర్ ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల‌.. ఈ రాష్ట్రంలోనే.. పూర్తి వివ‌రాలు ఇవే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date July 05,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories