AFCAT 2023 Notification: వాయుసేనలో 258 ఆఫీసర్ కొలువులు.. సిలబస్ అంశాలివే
- 258 పోస్టులకు ప్రకటన విడుదల
- ఎంపికైతే శిక్షణ సమయంలో నెలకు రూ.56,100 స్టైపెండ్
ఏఎఫ్‌క్యాట్ ద్వారా గెజిటెడ్ ఆఫీసర్స్ హోదా కలిగిన ఫ్లయింగ్, గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్, నాన్ టెక్నికల్) విభాగాల్లో రెండు రకాల పోస్టులను భర్తీ చేస్తారు. ఇందులో ఒకటి పీసీ(పర్మనెంట్ కమిషన్), రెండోది షార్ట్ సర్వీస్ కమిషన్(ఎస్‌ఎస్‌సీ) పరిధిలోకి వస్తాయి. పీసీ విభాగంలో ఎంపికైన వారు పదవీ విరమణ వయసు వరకు ఉద్యోగంలో కొనసాగవచ్చు. ఎస్‌ఎస్‌సీ అభ్యర్థులు మాత్రం గరిష్టంగా 14ఏళ్ల పాటు కొలువులో కొనసాగి పదవి నుంచి వైదొలుగుతారు.
- మొత్తం పోస్టుల సంఖ్య: 258
- బ్రాంచీల వారీగా ఖాళీలు: ఫ్లయింగ్: 10(పురుషులు 05, మహిళలు-05); గ్రౌండ్ డ్యూటీ(టెక్నికల్):130(పురుషులు-117,మహిళలు-13).
- ఏరోనాటికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్: గ్రౌండ్ డ్యూటీ (నాన్ టెక్నికల్)-118 (పురుషులు-103, మహిళలు-15); బ్రాంచ్: వెపన్ సిస్టమ్, అడ్మినిస్ట్రేషన్, ఎల్‌జీఎస్, అకౌంట్స్, ఎడ్యుకేషన్, మెటియోరాలజీ.
అర్హతలు
- ఫ్లయింగ్ బ్రాంచ్: ఈ విభాగానికి దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఇంటర్మీడియట్ లేదా తత్సమాన(10+2)లో మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టులుగా చదివినవారై గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ పూర్తిచేసుండాలి. లేదా 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్ ఉత్తీర్ణత సాధించాలి. డిగ్రీ లేదా బీటెక్/బీఈ చివరి సంవత్సరం చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు: జనవరి 01,2024 నాటికి 20 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.
- గ్రౌండ్ డ్యూటీ(టెక్నికల్ బ్రాంచ్): కనీసం 60 శాతం మార్కులతో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రానిక్స్ లేదా కమ్యూనికేషన్స్ లేదా కంప్యూటర్ సైన్స్ తదితర విభాగాల్లో బీఈ/బీటెక్ పూర్తిచేసిన వారు అర్హులు. ఇంటర్మీడియట్ లేదా తత్సమాన విద్యార్హత(10+2)లో ఫిజిక్స్, మ్యాథ్స్ సబ్జెక్టులో 60 శాతం మార్కులు వచ్చి ఉండాలి.
- వయసు: జనవరి 01,2024 నాటికి 20-26 ఏళ్ల మధ్య ఉండాలి.
- గ్రౌండ్ డ్యూటీ(నాన్ టెక్నికల్): నాన్ టెక్నికల్‌కు సంబంధించి అడ్మినిస్ట్రేషన్, లాజిస్టిక్స్, అకౌంట్స్ విభాగాలున్నాయి. అడ్మినిస్ట్రేషన్, లాజిస్టిక్స్ విభాగాలకు కనీసం 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ పూర్తి చేసుండాలి. అకౌంట్స్ విభాగానికి సంబంధించి 60 శాతం మార్కులతో బీకాం డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. ఫైనల్ ఇయర్ చదువుతున్నవారు కూడా దరఖాస్తుకు అర్హులే. వయసు: 20-26 ఏళ్ల మధ్యలో ఉండాలి.
- మెటియోరాలజీ: ఈ విభాగానికి సంబంధించి మ్యాథ్స్/స్టాటిస్టిక్స్/జాగ్రఫీ/ కంప్యూటర్ అప్లికేషన్స్/ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, అప్లయిడ్ ఫిజిక్స్/ఓషనోగ్రఫీ/ మెటియోరాలజీ/అగ్రికల్చరల్ మెటియోరాలజీ/ఎకాలజీ అండ్ ఎన్విరాన్‌మెంట్/ జియోఫిజిక్స్/ఎన్విరాన్‌మెంటల్ బయాలజీలో 50 శాతం మార్కులతో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ఉండాలి. అలాగే డిగ్రీ స్థాయిలో మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టులను 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
చదవండి: Government Jobs after B.Tech: బీటెక్‌తో త్రివిధ దళాల్లో కొలువులు
ఎంపిక విధానం
- ఏఎఫ్‌క్యాట్‌కు సంబంధించి రాత పరీక్ష (కామన్ ఎంట్రన్స్ టెస్ట్),ఇంజనీరింగ్ నాలెడ్జ్ టెస్ట్,పైలెట్ అప్టిట్యూడ్ బ్యాటరీ టెస్ట్(పీఏబీటీ),మెడికల్ టెస్టుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఏ పోస్టుకు దరఖాస్తు చేసుకున్నా.. రాత పరీక్ష ఉమ్మడిగానే ఉంటుంది. టెక్నికల్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఇంజనీరింగ్ నాలెడ్జ్ టెస్ట్(ఈకేటీ) అదనంగా రాయాలి. ఈ పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు స్టేజ్-1, స్టేజ్-2 రెండు పరీక్షలు నిర్వహిస్తారు. ప్లయింగ్ బ్రాంచ్‌కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఇంటర్వ్యూ అనంతరం కంప్యూటరైజ్డ్ పైలెట్ సెలక్షన్ సిస్టం(సీపీఎస్‌ఎస్) పరీక్ష ఉంటుంది. వీటన్నింటిలో అర్హత సాధించిన వారికి మెడికల్ టెస్టులు నిర్వహించి శిక్షణలోకి తీసుకుంటారు.
చదవండి: Government Jobs after B.Tech: బీటెక్‌తో.. సర్కారీ కొలువుల బాట!
ఏఎఫ్ క్యాట్ 300 మార్కులకు
- సీబీటీ(కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) విధానంలో నిర్వహించే ఈ పరీక్ష మొత్తం 300 మార్కులకు ఉంటుంది. ప్రతి ప్రశ్నకు మూడు మార్కుల చొప్పున 100 ప్రశ్నలుంటాయి. ప్రతి ప్రశ్నకు నాలుగు ఆప్షన్లు ఉంటాయి. పరీక్ష వ్యవధి రెండు గంటలు. దీనిలో నెగిటివ్ మార్కులు కూడా ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్కు చొప్పున కోత విధిస్తారు.
- ఇంజనీరింగ్ నాలెడ్జ్ టెస్ట్(ఈకేటీ): టెక్నికల్ బ్రాంచ్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న వారు ఇంజనీరింగ్ నాలñ డ్జ్ టెస్ట్(ఈకేటీ) అదనంగా రాయాలి. ఇందులో 50 ప్రశ్నలుంటాయి. ప్రతి ప్రశ్నకు 3 మార్కుల చొప్పున మొత్తం 150 మార్కులకు పరీక్ష జరుగుతుంది. పరీక్ష వ్యవధి 45 నిమిషాలు.
స్టేజ్ 1, 2 ఇలా
రాత పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారిని స్టేజ్ 1, 2 పరీక్షలకు పిలుస్తారు. వీటిని ఎయిర్ ఫోర్స్ సెలక్షన్ బోర్డు(ఏఎఫ్‌ఎస్‌బీ) నిర్వహిస్తుంది. ఫిజికల్ ఫిట్‌నెస్ విభాగంలో అభ్యర్థులు 1.6 కిలోమీటర్ల దూరాన్ని 10 నిమిషాల్లో చేరుకోవాలి. అలాగే 10 పుష్ అప్స్, 3 చిన్ అప్స్ తీయగలగాలి. ఇక స్టేజ్ 1 స్క్రీనింగ్ టెస్టులో చిన్న అసైన్‌మెంట్స్, పజిల్స్ లాంటి వాటి ద్వారా అభ్యర్థి మేధోశక్తిని పరిశీలిస్తారు. ఏదైనా చిత్రాన్ని చూపించి దాన్ని విశ్లేషించమంటారు. ఇందులో అర్హత సాధించిన వారు స్టేజ్-2కి వెళ్తారు. స్టేజ్-2లో సైకాలజిస్టు ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహిస్తారు. అనంతరం ఇన్‌డోర్, అవుట్ డోర్ ఇంటరాక్టివ్ గ్రూపు టెస్టులుంటాయి. వీటిలో మానసిక, శారీరక పనులు మిళితమై ఉంటాయి. ఆ తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ జరుగుతుంది. ఈ దశలన్నీ విజయవంతంగా పూర్తిచేసుకున్న వారికి మెడికల్ టెస్టులు నిర్వహిస్తారు. అందులోనూ అర్హత సాధించిన వారితో మెరిట్ లిస్ట్ తయారు చేసి శిక్షణకు ఎంపిక చేస్తారు.
చదవండి: NDA for Women: దీటుగా రాణించి.. ధీర వనితలుగా నిలిచే ఆస్కారం
వేతనాలు
శిక్షణకు ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ సమయంలో నెలకు రూ.56,100 స్టైపెండ్‌గా చెల్లిస్తారు. శిక్షణ అనంతరం విధుల్లో చేరిన వారికి రూ.56.100 మూలవేతనం లభిస్తుంది. అలాగే డీఏ, హెచ్‌ఆర్‌ఎ సహా ఇతర అలవెన్సులు ప్రోత్సాహకాలు అదనం. మిలటరీ సర్వీస్ పే(ఎంఎస్పీ)లో భాగంగా ప్రతి నెలా రూ.15,500 చెల్లిస్తారు. పోస్టింగ్ పొందిన ప్రాంతాన్ని బట్టి రూ.83 వేల నుంచి రూ.96 వేల వరకు నెల వేతనం(సీటీసీ) పొందవచ్చు.
శిక్షణ ఇలా
ఏఎఫ్‌క్యాట్‌కు ఎంపికైన ఫ్లయింగ్, టెక్నికల్ బ్రాంచ్ అభ్యర్థులకు 74 వారాల పాటు.. గ్రౌండ్ డ్యూటీకి ఎంపికైన వారికి 52 వారాల పాటు ఎయిర్‌ఫోర్స్ ట్రైనింగ్ ఇస్తారు. ఫ్లయింగ్ బ్రాంచ్‌కు ఎంపికైన అభ్యర్థులకు దుండిగల్, హకీంపేట్, బీదర్, ఎలహంకల్లో ఆరు నెలలపాటు ప్రాథమిక శిక్షణ ఉంటుంది. అనంతరం అభ్యర్థులు చూపిన ప్రతిభ ఆధారంగా ఫైటర్ పైలట్, ట్రాన్స్‌పోర్ట్ పైలట్, హెలికాప్టర్ పైలట్‌గా వేర్వేరుగా ఆయా విభాగాల్లో అంతర్గత శిక్షణ ఇస్తారు.
చదవండి: టీఎస్‌పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ
సిలబస్ అంశాలివే
ఆన్‌లైన్ విధానంలో నిర్వహించే రాత పరీక్షలో జనరల్ అవేర్‌నెస్, వెర్బల్ ఎబిలిటీ, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్, మిలటరీ ఆప్టిట్యూడ్ విభాగాల నుంచి ప్రశ్నలుంటాయి.
- జనరల్ అవేర్‌నెస్: ఈ విభాగానికి సంబంధించి హిస్టరీ, సివిక్స్, పాలిటిక్స్, కరెంట్ అఫైర్స్, జాగ్రఫీ, ఎన్విరాన్‌మెంట్, కల్చర్, డిఫెన్స్, స్పోర్ట్స్ సహా వివిధ అంశాల నుంచి ప్రశ్నలుంటాయి.
- వెర్బల్ ఎబిలిటీ: ఈ విభాగానికి సంబంధించి కాంప్రహెన్షన్, ఎర్రర్ డిటెక్షన్, సెంటన్స్ కంప్లీషన్, సినానిమ్స్, యాంటనిమ్స్, వొకాబ్యులరీ, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ నుంచి ప్రశ్నలుంటాయి.
- న్యూమరికల్ ఎబిలిటీ: ఈ విభాగంలో ప్రశ్నలు పదోతరగతి స్థాయిలో ఉంటాయి. మిగిలిన విభాగాల్లోని ప్రశ్నలు మాత్రం డిగ్రీ స్థాయిలో అడుగుతారు. ఇందులో ముఖ్యంగా డెసిమల్ ఫ్రాక్షన్, టైమ్ అండ్ వర్క్, యావరేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, పర్సెంటేజెస్, రేషియో అండ్ ప్రపోర్షన్, సింపుల్ ఇంట్రస్ట్, టైమ్ అండ్ డిస్టెన్స్ (ట్రెయిన్స్/బోట్స్ అండ్ స్ట్రీమ్స్).
- రీజనింగ్ అండ్ మిలటరీ ఆప్టిట్యూడ్: వెర్బల్ స్కిల్స్, స్పేషియల్ ఎబిలిటీ(మెంటల్ ఎబిలిటీ) నుంచి ప్రశ్నలు వస్తాయి.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు
హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి, రాజమహేంద్రవరం.
ముఖ్యసమాచారం
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
- దరఖాస్తులకు చివరి తేదీ: డిసెంబర్ 30, 2022
- వెబ్‌సైట్: https://afcat.cdac.in/AFCAT
చదవండి: Indian Air Force Recruitment 2022: ఐఏఎఫ్ లో 108 అప్రెంటిస్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 12TH |
Last Date | December 30,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |