Skip to main content

AFCAT 2023 Notification: ఎయిర్‌ఫోర్స్‌ కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌-2023 నోటిఫికేషన్‌ విడుదల.. ఎవరు అర్హులంటే..

వాయుసేనలో ఉన్నత స్థాయి ఉద్యోగాలు అందించే.. ఎయిర్‌ఫోర్స్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (ఎఎఫ్‌క్యాట్‌)-2023 నోటిఫికేషన్‌ విడుదలైంది. దీనిద్వారా మొత్తం 258 పోస్టులు భర్తీ చేయనున్నారు.
AFCAT 2023 Notification

అర్హతలు

  • ఫ్లైయింగ్‌ బ్రాంచ్‌ పోస్టులకు ఏదైనా డిగ్రీ లేదా బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణులు అర్హులు. ఇంటర్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్‌ తప్పనిసరి. 
  • గ్రౌండ్‌ డ్యూటీ టెక్నికల్‌ పోస్టులకు ఏరోనాటికల్‌ ఇంజనీరింగ్‌ (ఎలక్ట్రానిక్స్‌ /మెకానికల్‌) విభాగాల్లో లేదా అనుబంధ బ్రాంచ్‌ల్లో బీఈ/బీటెక్‌ పూర్తి చేసి ఉండాలి. ఇంటర్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్‌ ఉత్తీర్ణత తప్పనిసరి. 
  • గ్రౌండ్‌ డ్యూటీ(నాన్‌ టెక్నికల్‌) పోస్టుల్లో వివిధ విభాగాలను అనుసరించి ఇంటర్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్‌ ఉత్తీర్ణత; ఏదైనా డిగ్రీ లేదా బీఈ/బీటెక్‌ లేదా బీకామ్‌/బీఎస్సీ/బీబీఏ/సీఏ/సీఎంఏ/సీఎస్‌/సీఎఫ్‌ఏ, పీజీ ఉత్తీర్ణత ఉండాలి. 

వయసు: ఆయా పోస్టులను అనుసరించి 20-26ఏళ్ల మధ్య ఉండాలి. అవివాహిత పురుషులు, మహిళలు అర్హులు. 

ఎంపిక విధానం: పోస్టును అనుసరించి ఆన్‌లైన్‌ పరీక్ష, స్టేజ్‌1, స్టేజ్‌2 పరీక్షలు,ఇంటర్వ్యూ, కంప్యూటరైజ్డ్‌ పైలెట్‌ సెలక్షన్‌ టెస్ట్, వైద్య పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన తదితరాలను నిర్వహించి శిక్షణకు ఎంపిక చేస్తారు. 

ముఖ్య సమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ విధానం ద్వారా. 
  • దరఖాస్తు తేదీలు: 01.12.2022 నుంచి 30.12.2022 వరకూ
  • వెబ్‌సైట్‌: https://afcat.cdac.in

 

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date December 30,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories