Skip to main content

AAI Posts: ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాలో 400 జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు

400 junior executive posts in Airports Authority of India

ప్రభుత్వ రంగ సంస్థ ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఏఏఐ).. జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 
పోస్టులు: జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌(ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్‌)
మొత్తం పోస్టుల సంఖ్య: 400
అర్హత: ఫిజిక్స్, మ్యాథమెటిక్స్‌ సబ్జెక్టులతో మూడేళ్ల బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత/బ్యాచిలర్స్‌ డిగ్రీ ఇన్‌ ఇంజనీరింగ్‌(ఏదైనా సెమిస్టర్‌లో ఫిజిక్స్‌/మ్యాథమెటిక్స్‌ చదివి ఉండాలి) ఉత్తీర్ణులవ్వాలి. ఇంగ్లిష్‌లో రాయడం, మాట్లాడటంలో కనీసం నైపుణ్యం ఉండాలి.
వయసు: 14.07.2022 నాటికి 27ఏళ్లు మించకుండా ఉండాలి. 
ఎంపిక విధానం: దరఖాస్తుల ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్‌ చేసి.. ఆన్‌లైన్‌ రాత పరీక్ష నిర్వహిస్తారు. రాత పరీక్షలో అర్హత సాధించిన వారికి డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌/వాయిస్‌ టెస్ట్, బ్యాక్‌ గ్రౌండ్‌ వెరిఫికేషన్, మెడికల్‌ టెస్ట్‌ ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది. 

Also read: Railway Jobs: వెస్టర్న్‌ రైల్వేలో 3612 ట్రేడ్‌ అప్రెంటిస్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

ముఖ్య సమాచారం
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ విధానంలో.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 15.06.2022
దరఖాస్తులకు చివరి తేది: 14.07.2022
వెబ్‌సైట్‌: https://www.aai.aero

Also read: Bank Jobs: 8 వేలకు పైగా పోస్టుల భర్తీకి ఐబీపీఎస్‌ నోటిఫికేషన్‌ విడుదల.. పూర్తి వివ‌రాలు ఇవే..

Qualification GRADUATE
Last Date July 14,2022
Experience Fresher job

Photo Stories