Bank Jobs: పంజాబ్ నేషనల్ బ్యాంక్, న్యూఢిల్లీలో 145 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు.. పరీక్షా విధానం ఇలా..
న్యూఢిల్లీలో ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ).. స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 145
పోస్టుల వివరాలు: మేనేజర్లు(రిస్క్)–40, మేనేజర్లు(క్రెడిట్)–100, సీనియర్ మేనేజర్లు(ట్రెజరీ)–05.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సీఏ/సీఎంఏ లేదా కనీసం 60 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణతతోపాటు ఎంబీఏ(ఫైనాన్స్)/తత్సమాన పీజీ డిగ్రీ(ఫైనాన్స్) ఉత్తీర్ణులవ్వాలి. పని అనుభవం ఉండాలి.
వయసు: 25 నుంచి 37ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
పరీక్షా విధానం: ఈ పరీక్షను మొత్తం 220 మార్కులకు నిర్వహిస్తారు. దీనిలో పార్ట్–1, పార్ట్–2 విభాగాలు ఉంటాయి. పరీక్షా సమయం రెండు గంటలు.
పార్ట్–1, పార్ట్–2లో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా అభ్యర్థుల్ని పర్సనల్ ఇంటర్వ్యూకి ఎంపిక చేస్తారు. పర్సనల్ ఇంటర్వ్యూ 25 మార్కులకు ఉంటుంది. రాతపరీక్ష, ఇంటర్వ్యూలో సాధించిన మెరిట్ మార్కుల ఆ«ధారంగా తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది:07.05.2022
పరీక్ష తేది: 12.06.2022
వెబ్‌సైట్: https://www.pnbindia.in
చదవండి: Bank Jobs: బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 696 పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | May 07,2022 |
Experience | Fresher job |
For more details, | Click here |