Skip to main content

600 Posts in IDBI Bank: నైపుణ్య శిక్షణతో పాటు ఉద్యోగం.. వార్షిక వేతనం రూ.6.5 లక్షలు

ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా.. ఐడీబీఐ. పర్సనల్‌ నుంచి కార్పొరేట్‌ కంపెనీల వరకు..బ్యాంకింగ్‌ సేవలు అందిస్తున్న సంస్థ! ఈ బ్యాంక్‌.. బ్యాంకింగ్‌ రంగానికి అవసరమైన నైపుణ్యాలు అందించేలా పీజీడీబీఎఫ్‌ పేరుతో ప్రత్యేక కోర్సును నిర్వహిస్తోంది. ఈ కోర్సులో ప్రవేశం పొంది శిక్షణ పూర్తి చేసుకున్న వారికి బ్యాంకులో కొలువు ఖరారు చేస్తోంది. తాజాగా ఐడీబీఐ 600 జూనియర్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్ట్‌ల కోసం నోటిఫికేషన్‌ విడుదల చేసింది! ఈ నేపథ్యంలో.. ఐడీబీఐ పీజీడీబీఎఫ్‌ ప్రత్యేకత, ఎంపిక విధానం, కోర్సు–శిక్షణ, కెరీర్‌ స్కోప్‌ తదితర వివరాలు..
IDBI Banking Course Details, Banking Training,600 Junior Assistant Manager Posts,idbi bank notification 2023, pgdbf course specialties,Career Opportunities in IDBI
  • 600 జూనియర్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్ట్‌ల భర్తీకి ఐడీబీఐ ప్రకటన
  • పీజీడీబీఎఫ్‌ ప్రోగ్రామ్‌ విధానంలో ఎంపిక ప్రక్రియ
  • రాత పరీక్ష, ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా ఎంపిక
  • ఏడాది వ్యవధిలో క్లాస్‌రూమ్‌ బోధన, ఆన్‌ జాబ్‌ శిక్షణ

ఐడీబీఐ ఏడాది వ్యవధిలోని పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌(పీజీడీబీఎఫ్‌) కోర్సును అందిస్తోంది. దీనిద్వారా అభ్యర్థులకు బ్యాంకింగ్‌ రంగ నైపుణ్యాలపై ఆరు నెలల పాటు క్లాస్‌ రూమ్‌ శిక్షణ, రెండు నెలల ఇంటర్న్‌షిప్, మరో నాలుగు నెలలు ఐడీబీఐ శాఖల్లో ఆన్‌ జాబ్‌ ట్రైనింగ్‌ ఉంటుంది. ఈ కోర్సు పూర్తి చేసుకున్న తర్వాత అభ్యర్థులకు ఐడీబీఐ శాఖల్లో జూనియర్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌ గ్రేడ్‌–ఓ స్థాయిలో నియామకం ఖరారవుతుంది.

చదవండి: IDBI Bank Recruitment 2023: 600 అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

అర్హత
ఆగస్ట్‌ 31, 2023 నాటికి ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.

వయసు
ఆగస్ట్‌ 31, 2023 నాటికి 20 నుంచి 25 ఏళ్ల మ­ధ్యలో ఉండాలి. ఎస్‌సీ/ఎస్‌టీ అభ్యర్థులకు అయిదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు చొప్పున గరిష్ట వయో పరిమితిలో సడలింపు లభిస్తుంది. 

స్టయిఫండ్‌
ఐడీబీఐ పీజీడీబీఎఫ్‌ కోర్సులో ప్రవేశం పొందిన విద్యార్థులకు స్టయిఫండ్‌ పేరిట ఆర్థిక ప్రోత్సాహకాన్ని అందిస్తోంది. ఆరు నెలల క్లాస్‌ రూం లెర్నింగ్‌ వ్యవధిలో నెలకు రూ.5వేలు; రెండు నెలల ఇంటర్న్‌షిప్‌ సమయంలో నెలకు రూ.15 వేలు చొప్పున స్టయిఫండ్‌ అందిస్తారు.

చదవండి: RBI Notification 2023: డిగ్రీ అర్హతతో కేంద్ర బ్యాంక్‌లో కొలువులు.. ప్రాక్టీస్‌తోనే సక్సెస్‌

వార్షిక వేతనం రూ.6.5 లక్షలు
పీజీడీబీఎఫ్‌ కోర్సును విజయవంతంగా పూర్తి చేసుకుని.. జూనియర్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌ గ్రేడ్‌–ఓ హోదాలో కొలువు ఖరారు చేసుకున్న వారికి ప్రారంభ వార్షిక వేతనం రూ.6.14 లక్షల నుంచి రూ. 6.5 లక్షల వరకు లభిస్తుంది. ఈ హోదాలో మూడేళ్లు పని చేశాక బ్యాంకు నిబంధనలకు అనుగుణంగా గ్రేడ్‌–ఎ ఆఫీసర్లుగా పదోన్నతికి అర్హత లభిస్తుంది.

ప్రొబేషన్‌.. సర్వీస్‌ బాండ్‌
జూనియర్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌ గ్రేడ్‌–ఓ హోదా­లో నియమితులైన వారికి ఏడాది పాటు ప్రొబేషనరీ పిరియడ్‌ విధానం అమలవుతోంది. నియామకం ఖరారు చేసుకున్న వారు బ్యాంకులో కనీసం మూడేళ్ల పాటు విధులు నిర్వర్తిస్తామని రూ.2 లక్షల సర్వీస్‌ బాండ్‌ ఇవ్వాల్సి ఉంటుంది.

రెండు దశల్లో ఎంపిక
ఐడీబీఐ బ్యాంకులో జూనియర్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌ గ్రేడ్‌–ఓ పోస్ట్‌లకు మార్గం వేసే పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌ కో­ర్సులో ప్రవేశానికి ఎంపిక ప్రక్రియ రెండు దశల్లో నిర్వహిస్తారు. అవి..రాత పరీక్ష, పర్సనల్‌ ఇంటర్వ్యూ.

రాత పరీక్ష..  200 మార్కులు
ఐడీబీఐ పీజీడీబీఎఫ్‌ కోర్సులో ప్రవేశానికి నిర్వహించే రాత పరీక్ష.. రెండు వందల మార్కులకు ఉంటుంది. ఇందులో లాజికల్‌ రీజనింగ్, డేటా అనాలిసిస్‌ అండ్‌ డేటా ఇంటర్‌ప్రిటేషన్‌ 60 ప్రశ్నలు–60 మార్కులు, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ 40 ప్రశ్నలు–40 మార్కులు, క్వాంటిటేటివ్‌ అప్టిట్యూడ్‌ 40 ప్రశ్నలు–40 మార్కులు, జనరల్‌ /ఎకానమీ/బ్యాంకింగ్‌ అవేర్‌నెస్‌/కంప్యూటర్‌/ఐటీ 60 ప్రశ్నలు–60 మార్కులకు.. ఇలా మొత్తం 200 ప్రశ్నలు–200 మార్కులకు పరీక్ష ఉంటుంది. పరీక్ష ఆన్‌లైన్‌ టెస్ట్‌ విధానంలో ఆబ్జెక్టివ్‌ పద్ధతిలో జరుగుతుంది. పరీక్షకు కేటాయించిన సమయం 2:30 గంటలు. నెగెటివ్‌ మార్కింగ్‌ నిబంధన ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 1/4 మార్కు తగ్గిస్తారు.

పర్సనల్‌ ఇంటర్వ్యూ
రాత పరీక్ష తర్వాత.. చివరగా 100 మార్కులకు పర్సనల్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. నిర్దేశిత కటాఫ్‌లను పేర్కొని..ఆ జాబితాలో నిలిచిన వారిని పర్సనల్‌ ఇంటర్వ్యూకు పిలుస్తారు. పీజీడీబీఎఫ్‌ కోర్సు­కు నిర్దేశించిన సీట్లకు మూడు రెట్లకు సమానమైన సంఖ్యలో అభ్యర్థులను ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు.

చదవండి: 2000 PO Jobs in SBI: ఎస్‌బీఐలో పీఓ కొలువులు.. సిలబస్‌పై విశ్లేషణ

100 మార్కులు సాధించేలా

  • ఐడీబీఐ పీజీడీబీఎఫ్‌ ప్రోగ్రామ్‌ అభ్యర్థులు రాత పరీక్షలో 100 మార్కులు సాధించేలా కృషి చేయాలి. 2022 కటాఫ్‌లను పరిశీలిస్తే..జనరల్‌ కేటగిరీలో 74.75 మార్కులు; ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీలో 74.25 మార్కులు; ఓబీసీ కేటగిరీలో 74.75 మార్కులు; ఎస్‌సీ కేటగిరీలో 62.65 మార్కులు; ఎస్టీ కేటగిరీలో 59.5 మార్కులు ఫైనల్‌ కటాఫ్‌ మార్కులుగా నమోదయ్యాయి. ఈ కటాఫ్‌ శ్రేణిలో నిలిచిన వారికి పర్సనల్‌ ఇంటర్వ్యూలను నిర్వహించారు.
  • పర్సనల్‌ ఇంటర్వ్యూ తర్వాత ఫైనల్‌ కటాఫ్‌ జనర్‌ కేటగిరీలో 80.88 మార్కులు; ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీలో 75.94; ఓబీసీ కేటగిరీలో 74.94; ఎస్‌సీ కేటగిరీలో 64.38; ఎస్‌టీ కేటగిరీలో 59.13గా నమోదైంది.

వెయిటేజీ విధానం
తుది జాబితా రూపకల్ప, పీజీడీబీఎఫ్‌ కోర్సుకు అభ్యర్థులను ఎంపిక చేసే క్రమంలో వెయిటేజీ విధానాన్ని అమలు చేస్తారు. రాత పరీక్షకు 75 మా­ర్కులు; పర్సనల్‌ ఇంటర్వ్యూకు 25 మార్కులు చొ­ప్పున వెయిటేజీని నిర్ధారించారు. అభ్యర్థులు పొందిన మార్కులను ఈ వెయిటేజీలకు అనుగుణంగా క్రోడీకరించి.. తుది జాబితా విడుదల చేస్తారు.

అసిస్టెంట్‌ మేనేజర్‌ నుంచి ఈడీ వరకు
పీజీడీబీఎఫ్‌ పూర్తి చేసుకుని ఐడీబీఐలో జూనియ అసిస్టెంట్‌ మేనేజర్‌ గ్రేడ్‌–ఓ హోదాలో నియమితులైన వారు భవిష్యత్తులో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ స్థాయి వరకు చేరుకునే అవకాశముంది. తొలుత అసిస్టెంట్‌ మేనేజర్‌ గ్రేడ్‌–ఎగా పదోన్నతి లభిస్తుంది. తర్వాత మేనేజర్‌ (గ్రేడ్‌–బి)గా పదోన్నతి పొందొచ్చు. అనంతరం నిర్ణీత కాల వ్యవధి ఆధారంగా.. ఏజీఎం(గ్రేడ్‌–సి), ఏజీఎం(గ్రేడ్‌–డి), డీజీఎం(గ్రేడ్‌–డి), జనరల్‌ మేనేజర్‌(గ్రేడ్‌–ఇ), చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ (గ్రేడ్‌–ఎఫ్‌), ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ వంటి పదోన్నతులు లభిస్తాయి.

ప్రిపరేషన్‌ ఇలా

  • లాజికల్‌ రీజనింగ్, డేటా అనాలిసిస్‌ అండ్‌ డేటా ఇంటర్‌ప్రిటేషన్‌కు సంబంధించి డైరక్షన్స్, డిస్టెన్స్, అనాలజీ, బ్లడ్‌ రిలేషన్స్, సిరీస్, డబుల్‌ లైనప్, డయాగ్రమ్స్, ఫ్లో చార్స్‌లను ప్రాక్టీస్‌ చేయాలి.
  • ఇంగ్లిష్‌కు సంబంధించి గ్రామర్‌ అంశాలపై పూర్తి అవగాహన పెంచుకోవాలి. ముఖ్యంగా వొకాబ్యులరీ, కాంప్రహెన్షన్‌లపై పట్టు సాధించాలి. అదే విధంగా సింపుల్, కాంప్లెక్స్, కాంపౌండ్‌ సెంటెన్స్‌లను ప్రాక్టీస్‌ చేయాలి.
  • క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌కు సంబంధించి మ్యాథమెటిక్స్‌లోని కోర్‌ అంశాలతోపాటు అర్థమెటిక్‌ అంశాల(నిష్పత్తులు, శాతాలు, టైం అండ్‌ డిస్టెన్స్, టైం అండ్‌ వర్క్, యావరేజెస్, స్క్వేర్‌ రూట్స్, క్యూబ్‌ రూట్స్, కూడికలు, హెచ్చవేతలు తదితర)పై దృష్టి పెట్టాలి.
  • నాలుగో విభాగంలోని జనరల్‌ అవేర్‌నెస్‌కు సంబంధించి కరెంట్‌ అఫైర్స్‌పై పట్టు సాధించాలి. ఎకానమీలో ఇటీవల కాలంలో ఆర్థిక రంగంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు తెలుసుకోవాలి. బ్యాంకింగ్‌ అవేర్‌నెస్‌లో బ్యాంకింగ్‌ వ్యవ­స్థ స్వరూపం తోపాటు తాజా పరిణామాలు, బ్యాంకింగ్‌ టెర్మినాలజీపై అవగాహన ఏర్పరచుకోవాలి. కంప్యూటర్‌/ఐటీ అవేర్‌నెస్‌లో కంప్యూటర్‌ ఆపరేషన్‌ టూల్స్‌పై పట్టు సాధించాలి.

ముఖ్య సమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
  • ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: సెప్టెంబర్‌ 30, 2023
  • ఆన్‌లైన్‌ టెస్ట్‌ తేదీ: అక్టోబర్‌ 20, 2023
  • పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://www.idbibank.in/idbibankcareerscurrentopenings.aspx
Qualification GRADUATE
Last Date September 30,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories