Skip to main content

IBPS Specialist Officer Notification: సర్కారీ బ్యాంకులో 1402 స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌పోస్టులు.. ఎంపిక ప్రక్రియ, పరీక్ష విధానం..

ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్, లా తదితర ప్రొఫెషనల్‌ కోర్సులు పూర్తి చేసుకున్న అభ్యర్థులకు చక్కటి అవకాశం.. ఐబీపీఎస్‌ స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌(ఎస్‌వో) నోటిఫికేషన్‌. వివిధ విభాగాల్లో మొత్తం 1402 ఎస్‌వో పోస్టుల భర్తీకి ప్రకటన వెలువడింది. మూడంచెల్లో ఎంపిక ప్రక్రియ జరుగనుంది. ఎంపికైతే బ్యాంకింగ్‌ రంగంలో ఉజ్వల కెరీర్‌ ఖాయం. ఈ నేపథ్యంలో.. ఐబీపీఎస్‌ ఎస్‌వో పోస్టుల వివరాలు, ఎంపిక ప్రక్రియ, పరీక్ష విధానం తదితర వివరాలు..
ibps specialist officer notification and exam pattern and preparation tips
  • స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్ట్‌ల భర్తీకి ఐబీపీఎస్‌ నోటిఫికేషన్‌
  • ఆరు విభాగాల్లో మొత్తం 1,402 పోస్ట్‌లు
  • మూడంచెల్లో ఎంపిక ప్రక్రియ

మొత్తం 1,402 పోస్ట్‌లు
ఐబీపీఎస్‌ తాజా నోటిఫికేషన్‌ ద్వారా దేశంలోని వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో.. ఆరు విభాగాల్లో.. 1,402పోస్ట్‌ల భర్తీకి సన్నాహకాలు ప్రారంభించింది. 

అగ్రికల్చరల్‌ ఫీల్డ్‌ ఆఫీసర్‌ (స్కేల్‌–1): 500 పోస్ట్‌లు

  • అర్హత: అగ్రికల్చర్‌/హార్టికల్చర్‌/యానిమల్‌ హజ్బెండరీ/వెటరినరీ సైన్స్‌/డైరీ సైన్స్‌ /ఫిషరీ సైన్స్‌/ఫిషికల్చర్‌/అగ్రి మార్కెటింగ్‌ అండ్‌ కోఆపరేషన్‌/కోఆపరేషన్‌ అండ్‌ బ్యాంకింగ్‌/ఆగ్రో ఫారెస్ట్రీ/ఫారెస్ట్రీ/అగ్రికల్చరల్‌ బయో టెక్నాలజీ/ఫుడ్‌ సైన్స్‌/ అగ్రికల్చర్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌/ఫుడ్‌ టెక్నాలజీ/డెయిరీ టెక్నాలజీ/అగ్రికల్చరల్‌ ఇంజనీరింగ్‌/సెరి కల్చర్‌ సబ్జెక్ట్‌లలో నాలుగేళ్ల బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.

హెచ్‌ఆర్‌/పర్సనల్‌ ఆఫీసర్‌(స్కేల్‌–1): 31 పోస్ట్‌లు

  • అర్హత: పర్సనల్‌ మేనేజ్‌మెంట్‌/ఇండస్ట్రియల్‌ రిలేషన్స్‌/హెచ్‌ఆర్‌/హెచ్‌ఆర్‌డీ/ సోషల్‌ వర్క్‌/లేబర్‌ లా స్పెషలైజేషన్లతో రెండేళ్ల వ్యవధిలోని పీజీ లేదా పీజీ డిప్లొమా ఉత్తీర్ణత సాధించాలి.

ఐటీ ఆఫీసర్‌ (స్కేల్‌–1): 120 పోస్ట్‌లు

  • అర్హత: సీఎస్‌ఈ/కంప్యూటర్‌ అప్లికేషన్స్‌/ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ/ఎలక్ట్రానిక్స్‌/ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలి కమ్యూనికేషన్స్‌/ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌/ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ బ్రాంచ్‌లతో బీటెక్‌ ఉత్తీర్ణత లేదా ఈ సబ్జెక్ట్‌ స్పెషలైజేషన్లలో పీజీ ఉత్తీర్ణత ఉండాలి (లేదా) డీఓఈఏసీఈ (బి) లెవల్‌ పాసవ్వాలి. 

లా ఆఫీసర్‌ (స్కేల్‌–1): 10 పోస్ట్‌లు

  • అర్హత: ఎల్‌ఎల్‌బీ ఉత్తీర్ణతతోపాటు బార్‌ కౌన్సిల్‌లో అడ్వొకేట్‌గా నమోదు చేసుకుని ఉండాలి.

మార్కెటింగ్‌ ఆఫీసర్‌ (స్కేల్‌–1): 700 పోస్ట్‌లు

  • అర్హత: మాస్టర్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌ లేదా మార్కెటింగ్‌ స్పెషలైజేషన్‌తో ఎంబీఏ లేదా రెండేళ్ల వ్యవధిలోని పీజీడీబీఏ/పీజీడీబీఎం/పీజీపీఎం/పీజీడీఎంలతో మార్కెటింగ్‌ స్పెషలైజేషన్‌తో ఉత్తీర్ణత సాధించాలి.

రాజ్‌భాష అధికారి (స్కేల్‌–1): 41 పోస్ట్‌లు

  • అర్హత: హిందీ స్పెషలైజేషన్‌తో పీజీ ఉత్తీర్ణత(బ్యాచిలర్‌ డిగ్రీ స్థాయిలో ఇంగ్లిష్‌ ఒక సబ్జెక్ట్‌గా చదివుండాలి) లేదా సంస్కృతం స్పెషలైజేషన్‌తో పీజీ(బ్యాచిలర్‌ డిగ్రీ స్థాయిలో ఇంగ్లిష్, హిందీ సబ్జెక్ట్‌లు చదివుండాలి) పాసవ్వాలి.

చ‌ద‌వండి: Study Material

వయసు

  • అన్ని పోస్ట్‌లకు ఆగస్ట్‌ 1, 2023 నాటికి 20 నుంచి 30 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి అయిదేళ్లు, ఓబీసీ (నాన్‌–క్రీమీ లేయర్‌ ) వర్గాల వారికి గరిష్ట వయోపరిమితిలో మూడేళ్ల సడలింపు లభిస్తుంది.

మూడంచెల ఎంపిక ప్రక్రియ
ఐబీపీఎస్‌ స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్ట్‌లకు సంబంధించి నియామక ప్రక్రియను.. మూడు దశల్లో నిర్వహిస్తారు. అవి.. ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్‌ ఎగ్జామినేషన్, పర్సనల్‌ ఇంటర్వ్యూ.

ప్రిలిమినరీ ఎగ్జామినేషన్‌

  • ఎంపిక ప్రక్రియలో తొలి దశ ప్రిలిమినరీ పరీక్ష లా ఆఫీసర్,రాజ్‌ భాష అధికారి పోస్ట్‌లకు, ఇతర పోస్ట్‌లకు వేర్వేరు విధానాల్లో ఉంటుంది. పరీక్షలు పూర్తిగా ఆబ్జెక్టివ్‌ విధానంలో జరుగుతాయి. ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ మినహా మిగతా విభాగాలకు ఇంగ్లిష్‌ లేదా హిందీ మీడియంలలో హాజరుకావచ్చు. 
  • లా ఆఫీసర్, రాజ్‌ భాష అధికారి ప్రిలిమినరీ: ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ 50ప్రశ్నలు–25 మార్కులు, రీజనింగ్‌ 50 ప్రశ్నలు–50 మార్కులు, జనరల్‌ అవేర్‌నెస్‌ విత్‌ స్పెషల్‌ రిఫరెన్స్‌ టు బ్యాంకింగ్‌ ఇండస్ట్రీ 50 ప్రశ్నలు–50 మార్కులు.. ఇలా మొత్తం 150 ప్రశ్నలు–125 మార్కులకు పరీక్ష జరుగుతుంది. పరీక్ష సమయం 120 నిమిషాలు.     
  • ఇతర పోస్ట్‌లకు ప్రిలిమినరీ ఎగ్జామ్‌: ఐటీ ఆఫీసర్, అగ్రికల్చర్‌ ఫీల్డ్‌ ఆఫీసర్, హెచ్‌ఆర్‌/పర్సనల్‌ ఆఫీసర్, మార్కెటింగ్‌ ఆఫీసర్‌ పోస్ట్‌లకు నిర్వహించే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్‌ వివరాలు..ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ 50 ప్రశ్నలు–25 మార్కులు, రీజనింగ్‌ 50 ప్రశ్నలు–50 మార్కులు, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ 50 ప్రశ్నలు 50 మార్కులు.. ఇలా మొత్తం 150 ప్రశ్నలు–125 మార్కులకు పరీక్ష జరుగుతుంది. పరీక్ష సమయం 120 నిమిషాలు.

చ‌ద‌వండి: Bitbank

మెయిన్‌ ఎగ్జామినేషన్‌

  • ప్రిలిమినరీ పరీక్షలో ప్రతిభ చూపి, నిర్దేశిత మెరిట్‌ జాబితాలో నిలిచిన వారికి రెండో దశలో మెయిన్‌ ఎగ్జామినేషన్‌ను నిర్వహిస్తారు. రాజ్‌ బాష అధికారి పోస్ట్‌కు, ఇతర పోస్ట్‌లకు వేర్వేరు విధానాల్లో రాత పరీక్ష ఉంటుంది. వివరాలు..
  • రాజ్‌ భాష అధికారి మెయిన్‌: ఇందులో ప్రొఫెషనల్‌ నాలెడ్జ్‌ 45 ప్రశ్నలు–పరీక్ష సమయం 30 నిమిషాలు. అదేవిధంగా ప్రొఫెషనల్‌ నాలెడ్జ్‌(డిస్క్రిప్టివ్‌ పరీక్ష)లో 2 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం 30 నిమిషాలు. రెండు విభాగాలకు సంబంధించి మొత్తం 60 మార్కులకు పరీక్ష ఉంటుంది. డిస్క్రిప్టివ్‌ విభాగానికి సంబంధించి అభ్యర్థులు ఇంగ్లిష్‌ లేదా హిందీ మీడియంలో ఒక ఎస్సే రైటింగ్, ఒక లెటర్‌ రైటింగ్‌ రాయాల్సి ఉంటుంది.
  • ఇతర పోస్ట్‌లకు మెయిన్‌ ఎగ్జామ్‌ ఇలా: ఐటీ ఆఫీసర్, లా ఆఫీసర్, అగ్రికల్చర్‌ ఫీల్డ్‌ ఆఫీసర్, హెచ్‌ఆర్‌/పర్సనల్‌ ఆఫీసర్, మార్కెటింగ్‌ ఆఫీసర్‌ పోస్ట్‌లకు నిర్వహించే మెయిన్‌ ఎగ్జామినేషన్‌లో ప్రొఫెషనల్‌ నాలెడ్జ్‌ పరీక్ష 60 ప్రశ్నలు–60 మార్కులకు ఉంటుంది. పరీక్ష సమయం 45 నిమిషాలు. ప్రిలిమ్స్, మెయిన్స్‌ రెండు పరీక్షల్లోనూ నెగెటివ్‌ మార్కింగ్‌ నిబంధన అమలు చేస్తున్నారు. ప్రతి తప్పు సమాధానానికి 0.25 కోత విధిస్తారు.

పర్సనల్‌ ఇంటర్వ్యూ
ప్రిలిమినరీ, మెయిన్‌ పరీక్షల్లో పొందిన మార్కు­ల ఆధారంగా మెరిట్‌ జాబితా రూపొందిస్తారు. ఈ జాబితాలో నిలిచిన వారికి చివరగా 100 మార్కులకు పర్సనల్‌ ఇంటర్వ్యూ ఉంటుంది. ఇందులో అ­భ్యర్థులకు బ్యాంకింగ్‌ రంగంపై ఉన్న ఆసక్తి, ఈ రంగంలో తాజా పరిణామాలపై అవగాహన, వ్యక్తిగత దృక్పథం, వైఖరి వంటి అంశాలను పరిశీలిస్తారు.

వెయిటేజీ విధానం
మెయిన్‌ ఎగ్జామినేషన్, పర్సనల్‌ ఇంటర్వ్యూలలో పొందిన మార్కులకు 80:20 నిష్పత్తిలో వెయిటేజీ విధానాన్ని అనుసరించి విజేతలను ఖరారు చేస్తారు.

ప్రిపరేషన్‌ పక్కాగా
స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్ట్‌లకు సంబంధించి ఇంగ్లిష్‌ లాంగ్వేజ్,రీజనింగ్, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌లలోకి ముఖ్య అంశాలను ప్రాక్టీస్‌ చేయాలి. ఆ­యా అంశాల కాన్సెప్ట్‌లతోపాటు ప్రీవియస్‌ పేప­ర్స్, మోడల్‌ పేపర్లను సాధన చేయడం మేలు చేస్తుంది. 

ప్రొఫెషనల్‌ నాలెడ్జ్‌
ప్రొఫెషనల్‌ నాలెడ్జ్‌ విభాగంలో రాణించేందుకు అభ్యర్థులు తాము దరఖాస్తు చేసుకున్న స్పెషలైజేషన్‌ దానికి సంబంధించి.. బ్యాచిలర్, పీజీ స్థాయి పుస్తకాలను అధ్యయనం చేయాలి. ముఖ్యమైన కాన్సెప్ట్‌లను అప్లికేషన్‌ అప్రోచ్‌తో అధ్యయనం చేస్తూ అడుగులు వేయాలి.

ముఖ్య సమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి
  • ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: 21.08.2023 
  • ప్రిలిమినరీ ఎగ్జామినేషన్‌ తేదీ: డిసెంబర్‌ 30, 31 తేదీల్లో
  • ఆన్‌లైన్‌ మెయిన్‌ ఎగ్జామ్‌ తేదీ: జనవరి 28, 2024
  • పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://www.ibps.in/

 

చ‌ద‌వండి: Bank Exam Preparation Tips for IBPS PO: 3,049 పోస్ట్‌ల వివరాలు.. పరీక్ష విధానం, సిలబస్, ప్రిపరేషన్‌ గైడెన్స్‌..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date August 21,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories