Skip to main content

Bank Exam Preparation Tips for IBPS PO: 3,049 పోస్ట్‌ల వివరాలు.. పరీక్ష విధానం, సిలబస్, ప్రిపరేషన్‌ గైడెన్స్‌..

బ్యాంకింగ్‌ రంగ ఉద్యోగాల్లో అత్యంత క్రేజీ కొలువు.. పీవో(ప్రొబేషనరీ ఆఫీసర్‌). డిగ్రీ అర్హతతోనే పీవోగా ఉద్యోగంలో చేరి.. సీజీఎం, బ్యాంక్‌ చైర్మన్‌ స్థాయికి కూడా ఎదిగే అవకాశముంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉద్యోగ నియామకాలు చేపట్టే ఐబీపీఎస్‌.. తాజాగా 3,049 పీవో/ఎంటీ(మేనేజ్‌మెంట్‌ ట్రైనీస్‌) పోస్ట్‌ల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో.. ఐబీపీఎస్‌ పీఓ/ఎంటీ పోస్టుల వివరాలు, అర్హతలు, ఎంపిక ప్రక్రియ, పరీక్ష విధానం, సిలబస్, ప్రిపరేషన్‌ గైడెన్స్‌ తదితర వివరాలు..
Bank Exam Preparation Tips for IBPS PO,3049 IBPS jobs.
  • 3,049 పీవో/ఎంటీ పోస్టులకు ఐబీపీఎస్‌ ప్రకటన
  • ఏదైనా డిగ్రీ అర్హతతో దరఖాస్తు చేసుకోవచ్చు
  • ప్రిలిమ్స్, మెయిన్స్,ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక

ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలక్షన్‌.. సంక్షిప్తంగా ఐబీపీఎస్‌. ప్రతి ఏటా.. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌ మొదలు స్పెషలిస్ట్‌ ఆఫీసర్ల వరకూ.. వివిధ ఉద్యోగాలకు నియామక ప్రక్రియ చేపడుతున్న సంస్థ. తాజాగా.. 2024-25 సంవత్సరంలో ఆయా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్‌/మేనేజ్‌మెంట్‌ ట్రైనీ పోస్ట్‌ల భర్తీకి ప్రక్రియ ప్రారంభించింది.

మొత్తం 3,049 పీఓ పోస్ట్‌లు

ఐబీపీఎస్‌ తాజా నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం అయిదు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 3,049 పీఓ పోస్ట్‌లను భర్తీ చేయనుంది. ఆ వివరాలు.. 

  • బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా-224 పోస్ట్‌లు, కెనరా బ్యాంకు-500 పోస్ట్‌లు, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా-2,000 పోస్ట్‌లు, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు- 200 పోస్ట్‌లు, పంజాబ్‌ అండ్‌ సిం«ద్‌ బ్యాంకు-125 పోస్ట్‌లు. ఇవే కాకుండా..ఎంపిక ప్రక్రియ పూర్తి అయ్యే సమయానికి బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర, ఇండియన్‌ బ్యాంకు, ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంకు, యూకో బ్యాంకు, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలలో కూడా పోస్ట్‌లు ఏర్పడే అవకాశం ఉంది.

అర్హతలు

  • ఆగస్ట్‌ 21, 2023 నాటికి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. 
  • వయసు: ఆగస్ట్‌ 1, 2023 నాటికి 20 నుంచి 30 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ/ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు అయిదేళ్లు, ఓబీసీ(నాన్‌ క్రీమీ లేయర్‌) అభ్యర్థులకు మూడేళ్ల సడలింపు ఉంటుంది.

చ‌ద‌వండి: IBPS SO 2023 Notification: 1402 స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా‌..

మూడు దశల్లో ఎంపిక ప్రక్రియ

ఐబీపీఎస్‌ చేపట్టనున్న పీఓ/ఎంటీ నియామకాలకు సంబంధించి.. ఎంపిక ప్రక్రియ మూడు దశల్లో ఉంటుంది. అవి..ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, మెయిన్‌ పరీక్ష, పర్సనల్‌ ఇంటర్వ్యూ. ప్రిలిమినరీ, మెయిన్‌ ఎగ్జామినేషన్‌లను ఆన్‌లైన్‌ విధానంలో ఆబ్జెక్టివ్‌ టెస్ట్‌గా నిర్వహిస్తారు. ఈ రాత పరీక్షల్లో విజయం సాధించి నిర్దిష్ట కటాఫ్‌ మార్కులు సాధించిన వారికి పర్సనల్‌ ఇంటర్వ్యూ ఉంటుంది. అందులోనూ విజయం సాధించి తుది జాబితాలో నిలిస్తే.. ప్రొవిజనల్‌ అలాట్‌మెంట్‌ లెటర్‌ అందజేస్తారు.

Bank Exam Preparation Tips for IBPS PO
ప్రిలిమినరీ 100 మార్కులు

ఎంపిక ప్రక్రియలో తొలి దశ ప్రిలిమినరీ రాత పరీక్ష మూడు విభాగాల్లో 100 మార్కులకు ఉంటుంది. ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ 30 ప్రశ్నలు-30 మార్కులు, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ 35 ప్రశ్నలు-35 మార్కులు, రీజనింగ్‌ ఎబిలిటీ 35 ప్రశ్నలు-35 మార్కులకు పరీక్ష జరుగుతుంది. పరీక్ష సమయం 60 నిమిషాలు. ప్రిలిమినరీలో పొందిన మార్కులు.. సెక్షన్ల వారీగా నిర్దేశిత కటాఫ్‌లు అనుసరించి.. మెరిట్‌ జాబితా రూపొందిస్తారు. ఆ తర్వాత ఒక్కో పోస్ట్‌కు పది మందిని చొప్పున రెండో దశ మెయిన్స్‌ ఎగ్జామినేషన్‌కు ఎంపిక చేస్తారు. 

200 మార్కులకు మెయిన్స్‌

రెండో దశ మెయిన్‌ పరీక్ష నాలుగు విభాగాల్లో 200 మార్కులకు ఉంటుంది. రీజనింగ్‌ అండ్‌ కంప్యూటర్‌ ఆప్టిట్యూడ్‌ 45 ప్రశ్నలు-60 మార్కులు, జనరల్‌ /ఎకానమీ/బ్యాంకింగ్‌ అవేర్‌నెస్‌ 40 ప్రశ్నలు-40 మార్కులు, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ 35 ప్రశ్నలు-40 మార్కులు, డేటా అనాలిసిస్‌ అండ్‌ ఇంటర్‌ప్రిటేషన్‌ 35 ప్రశ్నలు-60 మార్కులు.. ఇలా మొత్తం 155 ప్రశ్నలు-200 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష సమయం మూడు గంటలు.

చ‌ద‌వండి: IBPS PO/MT 2023 Notification: 3,049 పీవో/మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..

డిస్క్రిప్టివ్‌ టెస్ట్‌ కూడా

మెయిన్‌ పరీక్షలో భాగంగానే ఆబ్జెక్టివ్‌ టెస్ట్‌తోపాటు అదనంగా ఇంగ్లిష్‌ డిస్క్రిప్టివ్‌ టెస్ట్‌ను కూడా నిర్వహిస్తారు. ఇందులో ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌(లెటర్‌ రైటింగ్‌ అండ్‌ ఎస్సే)లో ఒక ఎస్సే, ఒక లెటర్‌ రైటింగ్‌ రాయాల్సి ఉంటుంది. దీనికి కేటాయించిన మార్కులు 25. సమయం 30 నిమిషాలు. మెయిన్‌ పరీక్షతోపాటే అదే రోజు ఈ డిస్క్రిప్టివ్‌ టెస్ట్‌ జరుగుతుంది.

చివరి దశ పర్సనల్‌ ఇంటర్వ్యూ

ఎంపిక ప్రక్రియలో చివరి దశ.. పర్సనల్‌ ఇంటర్వ్యూ. మెయిన్‌లో పొందిన మార్కుల ఆధారంగా.. సెక్షన్‌ వారీ కటాఫ్, ఓవరాల్‌ కటాఫ్‌లను నిర్దేశించి ఆ జాబితాలో నిలిచిన అభ్యర్థులకు చివరగా ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇంటర్వ్యూకు కేటాయించిన మార్కులు 100. ఇందులో జనరల్‌ కేటగిరీ అభ్యర్థులు కనీసం 40 శాతం మార్కులు పొందాల్సి ఉంటుంది. రిజర్వ్‌డ్‌ కేటగిరీ అభ్యర్థులు 35 శాతం మార్కులు సాధించాలి.

వెయిటేజీ విధానం

మెయిన్‌ పరీక్షలో మార్కులకు 80 శాతం వెయిటేజీ, పర్సనల్‌ ఇంటర్వ్యూ మార్కులకు 20 శాతం వెయిటేజీని నిర్దేశించారు. ఇలా మొత్తం వంద మార్కులకు గాను మెయిన్, ఇంటర్వ్యూలో సాధించిన మార్కులను క్రోడీకరించి తుది విజేతలకు నియామకాలు ఖరారు చేస్తారు. 

చ‌ద‌వండి: Bank Note Press Recruitment 2023: బ్యాంక్‌ నోట్‌ ప్రెస్, దివాస్‌లో 111 పోస్టులు.. ఎవరు అర్హులంటే..

ముఖ్య సమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవాలి.
  • ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: 21.08.2023
  • ప్రిలిమినరీ ఎగ్జామినేషన్‌(ఆన్‌లైన్‌) తేదీలు: సెప్టెంబర్‌/అక్టోబర్‌లో.
  • మెయిన్‌ ఆన్‌లైన్‌ ఎగ్జామినేషన్‌ తేదీ: నవంబర్‌లో
  • పర్సనల్‌ ఇంటర్వ్యూలు: 2024 జనవరి/ఫిబ్రవరి నెలల్లో
  • వెబ్‌సైట్‌: https://www.ibps.in/


Bank Exam Preparation Tips for IBPS PO
ప్రిపరేషన్‌ ఇలా

రీజనింగ్‌

ప్రిలిమ్స్, మెయిన్స్‌లో కీలకంగా నిలిచే రీజనింగ్‌పై అభ్యర్థులు పట్టు సాధించాలి. సిరీస్, అనాలజీ, కోడింగ్‌-డీ కోడింగ్, డైరెక్షన్స్, బ్లడ్‌ రిలేషన్స్, ర్యాంకింగ్స్, సీటింగ్‌ అరేంజ్‌మెంట్స్, సిలాజిజమ్స్‌పై పట్టు సాధించాలి.

చ‌ద‌వండి: Bank Note Press Recruitment 2023: బ్యాంక్‌ నోట్‌ ప్రెస్, దివాస్‌లో 111 పోస్టులు.. ఎవరు అర్హులంటే..

క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌

అర్థమెటిక్‌పై పట్టుతో ఈ విభాగంలో రాణించొచ్చు. స్క్వేర్‌ రూట్స్, క్యూబ్‌ రూట్స్, పర్సంటేజెస్, టైం అండ్‌ డిస్టెన్స్, టైం అండ్‌ వర్క్, ప్రాఫిట్‌ అండ్‌ లాస్, రేషియోస్‌ సంబంధిత ప్రశ్నలను బాగా ప్రాక్టీస్‌ చేయాలి. వీటితోపాటు నంబర్‌ సిరీస్, డేటా అనాలిసిస్‌ విభాగాలను కూడా సాధన చేయాలి. తద్వారా ప్రిలిమ్స్, మెయిన్స్‌ రెండింటిలోనూ మంచి మార్కులు పొందొచ్చు.

డేటా అనాలిసిస్‌ అండ్‌ ఇంటర్‌ప్రిటేషన్‌

డేటా అనాలిసిస్‌ అండ్‌ ఇంటర్‌ప్రిటేషన్‌లో రాణించేందుకు కాలిక్యులేషన్‌ స్కిల్స్‌ను పెంచుకోవాలి. టేబుల్స్, డయాగ్రమ్స్, నంబర్‌ డేటా, లైన్‌ గ్రాఫ్, బార్‌ గ్రాఫ్‌ తదితర గ్రాఫ్‌ ఆధారిత డేటాలలోని సమాధానాన్ని క్రోడీకరించే విధంగా సాధన చేయాలి.

చ‌ద‌వండి: Study Material

జనరల్‌/ఎకానమీ/బ్యాంకింగ్‌ అవేర్‌నెస్‌

ఇటీవల కాలంలో జాతీయ ఆర్థిక రంగంలో మార్పులు, బ్యాంకుల విధి విధానాల్లో మార్పులు, అవి కొత్తగా ప్రకటిస్తున్న పథకాల గురించి తెలుసుకోవాలి. బ్యాంకింగ్, ఆర్థిక రంగంలో వినియోగించే పదజాలంపై పట్టు సాధించాలి.

ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌

బేసిక్‌ గ్రామర్‌తో మొదలుపెట్టి వొకాబ్యులరీ పెంచుకోవడం వరకు గట్టిగా కృషి చేయాలి. రీడింగ్‌ కాంప్రహెన్షన్, కరెక్షన్‌ ఆఫ్‌ సెంటెన్సెస్, జంబుల్డ్‌ సెంటెన్సెస్, ప్రిపోజిషన్స్, ఆర్టికల్స్‌ వంటి వాటిపై ప్రత్యేక దృష్టి సారించాలి. డిస్క్రిప్టివ్‌ విధానంలో ఉండే ఇంగ్లిష్‌ ఎస్సే రైటింగ్, లెటర్‌ రైటింగ్‌ కోసం ఇంగ్లిష్‌ న్యూస్‌ పేపర్లు చదవడం, ఎడిటోరియల్‌ లెటర్స్‌ చదవడం మేలు చేస్తుంది.

చ‌ద‌వండిBitbank

Qualification GRADUATE
Last Date August 21,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories