Skip to main content

IBPS Recruitment 2022: ఏదైనా డిగ్రీతో 6035 క్లర్క్‌ పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

IBPS Recruitment 2022 For 6035 Clerk Jobs

ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలక్షన్‌(ఐబీపీఎస్‌).. 2023–2024 సంవత్సరానికి సంబంధించి కామన్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాసెస్‌(సీఆర్‌పీ)–గీఐఐ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీనిద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో క్లర్క్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 6035
తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు: ఆంధ్రప్రదేశ్‌–209, తెలంగాణ–99.
ఉద్యోగాలు కల్పిస్తున్న బ్యాంకులు: బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, కెనరా బ్యాంక్, ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్, యూకో బ్యాంక్, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర, ఇండియన్‌ బ్యాంక్‌ తదితరాలు.
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. కంప్యూటర్‌ నాలెడ్జ్‌ ఉండాలి.
వయసు: 01.07.2022 నాటికి 20–28 ఏళ్ల మధ్య ఉండాలి.
వయసు సడలింపు: ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు వయసులో సడలింపు ఉంటుంది.


Bank Exam Preparation Tips: వేయికి పైగా ఎగ్జిక్యూటివ్‌ పోస్ట్‌లు.. ప్రిపరేషన్‌తోపాటు కెరీర్‌ స్కోప్‌ గురించి తెలుసుకుందాం..

ఎంపిక విధానం: ప్రిలిమినరీ, మెయిన్‌ ఎగ్జామ్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ప్రిలిమినరీ పరీక్ష 100 మార్కులకు ఉంటుంది. ఇంగ్లిష్, న్యూమరికల్‌ ఎబిలిటీ, రీజనింగ్‌లో ప్రశ్నలు అడుగుతారు. ప్రిలిమ్స్‌ పరీక్ష సమయం 60 నిమిషాలు. మెయిన్స్‌ పరీక్ష 200 మార్కులకు ఉంటుంది. జనరల్‌ అవేర్‌నెస్, జనరల్‌ ఇంగ్లిష్, రీజనింగ్, కంప్యూటర్‌ ఆప్టిట్యూడ్, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ నుంచి ప్రశ్నలు వస్తాయి. మెయిన్స్‌ పరీక్ష సమయం 160 నిమిషాలు. ప్రిలిమ్స్, మెయిన్స్‌ పరీక్షల్లో  నెగిటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 21.07.2022
ప్రిలిమినరీ పరీక్ష: ఆగస్టు 2022
మెయిన్స్‌ పరీక్ష: అక్టోబర్‌ 2022

వెబ్‌సైట్‌: https://www.ibps.in/

చ‌ద‌వండి: Bank Jobs: బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో 325 పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date July 21,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories