CBI Recruitment 2022: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సీనియర్ మేనేజర్ పోస్టులు.. పరీక్షా విధానం ఇలా..
ముంబై ప్రధాన కేంద్రంగా ఉన్న సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. సీనియర్ మేనేజర్(ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 19
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. అవసరమైన టెక్నాలజీలో సర్టిఫికేట్ కోర్సులతోపాటు సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: 35 ఏళ్లు మించకుండా ఉండాలి.
జీతం: నెలకి రూ.63,480 నుంచి రూ.78,230 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ రాతపరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
పరీక్షా విధానం: ఈ పరీక్షని ఆన్‌లైన్ పద్ధతిలో మొత్తం 100 మార్కులకు నిర్వహిస్తారు. పరీక్షా సమయం 60 నిమిషాలు. నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కు చొప్పున కోత విధిస్తారు. పరీక్షని ఇంగ్లీష్, హిందీ మాధ్యమాల్లో నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 02.03.2022
పరీక్ష తేది: 27.03.2022
వెబ్‌సైట్: https://www.centralbankofindia.co.in/
చదవండి: SBI Recruitment 2022: ఎస్‌బీఐ బ్యాంక్‌లో 48 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు.. నెలకు రూ.64వేల వరకు జీతం
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | March 02,2022 |
Experience | 5 year |
For more details, | Click here |