Skip to main content

400 Jobs in Bank of Maharashtra: ఈ టిప్స్ ఫాలో అవ్వండి... బ్యాంక్ జాబ్ కొట్టండి .. 150 మార్కులకు రాత పరీక్ష

బ్యాంకు ఉద్యోగాల అభ్యర్థులకు మరో ప్రభుత్వ రంగ బ్యాంకు.. ఆహ్వానం పలుకుతోంది! బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర.. స్కేల్‌-2, స్కేల్‌-3 ఆఫీసర్స్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఎంపికైతే ప్రారంభంలోనే నెలకు రూ.50 వేలకు పైగా వేతనం అందుకోవచ్చు!! ఈ నేపథ్యంలో.. బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర ఆఫీసర్‌ పోస్ట్‌ల వివరాలు, దరఖాస్తుకు అర్హతలు, ఎంపిక విధానం తదితర వివరాలు.. 
bank exam pattern and syllabus preparation tips in telugu
  • బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్రలో ఆఫీసర్స్‌ పోస్టులు
  • మొత్తం 400 ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల
  • రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక
  • రూ.50వేలకు పైగా వేతనం

బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర తాజా నోటిఫికేషన్‌ ద్వారాస్కేల్‌-2, స్కేల్‌-3 ఆఫీసర్స్‌ హోదాలో మొత్తం నాలుగు వందల పోస్ట్‌లను భర్తీ చేయనుంది. వీటిల్లో స్కేల్‌-3 ఆఫీసర్‌(ఎంఎంజీఎస్‌-3)-100 పోస్ట్‌లు; స్కేల్‌-2 ఆఫీసర్‌ (ఎంఎంజీఎస్‌-2)-300 పోస్ట్‌లు ఉన్నాయి.

అర్హతలు

  • 60 శాతం మార్కులతో బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. లేదా సీఏ, సీఎంఏ, సీఎఫ్‌ఏ వంటి కోర్సులు ఉత్తీర్ణులవ్వాలి. జేఏఐఐబీ, సీఏఐఐబీ ఉత్తీర్ణులకు ప్రాధాన్యం ఉంటుంది. నిర్దేశిత విద్యార్హతలతోపాటు అభ్యర్థులకు పని అనుభవం కూడా తప్పనిసరి. స్కేల్‌ -2 ఆఫీసర్‌ పోస్ట్‌లకు బ్యాంకుల్లో కనీసం మూడేళ్లు, స్కేల్‌-3 ఆఫీసర్‌ పోస్ట్‌లకు బ్యాంకుల్లో కనీసం అయిదేళ్ల అనుభవం తప్పనిసరి. 
  • వయసు: స్కేల్‌-3 ఆఫీసర్‌ పోస్ట్‌లకు 25-38 ఏళ్లు; స్కేల్‌-2 ఆఫీసర్‌ పోస్ట్‌లకు 25-38 ఏళ్లు ఉండాలి. ఎస్సీ, ఎస్‌టీలకు అయిదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు చొప్పున గరిష్ట వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ

స్కేల్‌-3, స్కేల్‌-2 ఆఫీసర్‌ పోస్ట్‌లకు సంబంధించి రెండు దశల్లో ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. ముందుగా రాత పరీక్ష నిర్వహిస్తారు. ఆ తర్వాత పర్సనల్‌ ఇంటర్వ్యూ/గ్రూ­ప్‌ డిస్క షన్‌ దశలు ఉంటాయి. ఈ రెండిటిలోనూ ప్రతిభ చూపిన వారితో మెరిట్‌ జాబి­తా రూపొందించి కొలువులు ఖరారు చేస్తారు.

చ‌ద‌వండి: Previous Question Papers: పరీక్ష ఏదైనా ప్రీవియస్‌పేపెర్లే ‌.. ప్రిపరేషన్‌ కింగ్‌

150 మార్కులకు రాత పరీక్ష

ఎంపిక ప్రక్రియలో తొలి దశ రాత పరీక్షను నాలుగు విభాగాల్లో 150 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో.. ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ 20 ప్రశ్నలు, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ 20 ప్రశ్నలు, రీజనింగ్‌ ఎబిలిటీ 20 ప్రశ్నలు, ప్రొఫెషనల్‌ నాలెడ్జ్‌ 90 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం రెండు గంటలు. పరీక్ష పూర్తిగా ఆన్‌లైన్‌ విధానంలో ఉంటుంది. ప్రశ్నలు ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటాయి.

తదుపరి దశ ఇంటర్వ్యూ

రాత పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా.. నిర్దేశిత కటాఫ్‌ను అనుసరించి ఒక్కో పోస్ట్‌కు నలుగురిని (1:4 నిష్పత్తి) చొప్పున పర్సనల్‌ ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. 100 మార్కులకు ఈ ఇంటర్వ్యూ ఉంటుంది. ఇందులో అభ్యర్థులకు బ్యాంకింగ్‌ రంగంపై ఉన్న అవగాహన, అదే విధంగా ఇప్పటి వరకు తాము పని చేసిన విభాగాలు, నిర్వర్తించిన విధులు వంటి వాటిపై ప్రశ్నలు అడుగుతారు.

గ్రూప్‌ డిస్కషన్‌

గ్రూప్‌ డిస్కషన్‌ కూడా నిర్వహించే అవకాశం ఉంది. పర్సనల్‌ ఇంటర్వ్యూకు అభ్యర్థులను ఎంపిక చేసే క్రమంలో గ్రూప్‌ డిస్కషన్‌ నిర్వహించే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ గ్రూప్‌ డిస్కషన్‌లో అభ్యర్థులను సమకాలీన అంశాలపై చర్చించి.. తమ అభిప్రాయాలు చెప్పాలని సూచిస్తారు.

వెయిటేజీ విధానం

తుది జాబితాను రూపొందించే క్రమంలో రెండు దశల్లోనూ చూపిన ప్రతిభను పరిగణనలోకి తీసుకుంటారు. ఇందుకోసం వెయిటేజీ విధానాన్ని అమలు చేస్తారు. రాత పరీక్షలో మార్కులకు 75 శాతం; పర్సనల్‌ ఇంటర్వ్యూ మార్కులకు 25 శాతం చొప్పున వెయిటేజీ ఉంటుంది. ఈ రెండు దశల్లో సాధించిన మార్కులను 100 మార్కులకు క్రోడీకరించి వెయిటేజీ ప్రకారం.. తుది విజేతలను ఖరారు చేస్తారు. 

ప్రొబేషన్, సర్వీస్‌ బాండ్‌

తుది విజేతలుగా నిలిచి.. కొలువులు ఖరారు చేసుకున్న అభ్యర్థులకు ప్రొబేషన్‌ పిరియడ్‌ విధానం, అదే విధంగా సర్వీస్‌ బాండ్‌ నిబంధన అమలు చేస్తున్నారు. ఆరు నెలల ప్రొబేషన్‌ పిరియడ్‌తోపాటు, రెండేళ్ల పాటు బ్యాంకులో పని చేస్తామని రూ.రెండు లక్షలకు సమానమైన సర్వీస్‌ బాండ్‌ను ఇవ్వాల్సి ఉంటుంది.

ఆకర్షణీయ వేతనం

  • స్కేల్‌-3, స్కేల్‌-2 ఆఫీసర్లుగా ఎంపికైన వారికి ప్రారంభంలోనే ఆకర్షణీయ వేతనాలు లభిస్తాయి
  • స్కేల్‌-3 ఆఫీసర్లకు రూ.63,840 - రూ.78,230 వేతన శ్రేణి ఉంటుంది.
  • స్కేల్‌-2 ఆఫీసర్లకు రూ.48,170 - రూ.69,810 వేతన శ్రేణి ఉంటుంది.

స్కేల్‌-7 వరకు పదోన్నతులు

భవిష్యత్తు పదోన్నతులను పరిగణనలోకి తీసుకుంటే స్కేల్‌-2, స్కేల్‌-3 హోదాలో అడుగు పెట్టిన వారు స్కేల్‌-7 హోదాకు చేరుకునే అవకాశం ఉంటుంది. ఆయా హోదాల్లో కనీసం మూడేళ్ల సీనియారిటీ ప్రాతిపదికగా పదోన్నతులు లభిస్తాయి. బ్యాంకు అంతర్గతంగా నిర్వహించే పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తే.. మరింత వేగంగా పదోన్నతులు అందుకునే అవకాశం ఉంటుంది.

చ‌ద‌వండి: Bank Exam Preparation Tips: ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 4,545 క్లర్క్‌ పోస్ట్‌లు.. ఈ టిప్స్‌ ఫాలో అయితే ఒక ఉద్యోగం మీకే

రాత పరీక్షలో విజయానికి ఇలా
ఇంగ్లిష్‌

ఈ విభాగంలో రాణించేందుకు అభ్యర్థులు ఇడియమ్స్, సెంటెన్స్‌ కరెక్షన్, వొకాబ్యులరీ, సెంటెన్స్‌ రీ అరేంజ్‌మెంట్, వన్‌ వర్డ్‌ సబ్‌స్టిట్యూట్స్‌పై అవగాహన పెంచుకోవాలి. అదే విధంగా ఇంగ్లిష్‌ వొకాబ్యులరీపై పట్టు సాధించాలి. ఇందుకోసం ఇంగ్లిష్‌ దినపత్రికలు చదవడం, వాటిలో వినియోగిస్తున్న పదజాలం, వాక్య నిర్మాణం వంటి వాటిపై దృష్టి పెట్టాలి.

క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌

  • ఈ విభాగం కోసం అర్థమెటిక్‌ అంశాల(పర్సంటేజెస్, నిష్పత్తులు, లాభ-నష్టాలు, నంబర్‌ సిరీస్, బాడ్‌మాస్‌ నియమాలు)ను ప్రాక్టీస్‌ చేయాలి. వీటితోపాటు గత పరీక్షలు, వెయిటేజీ కోణంలో డేటా ఇంటర్‌ప్రిటేషన్, డేటా అనాలిసిస్‌లపై పట్టు పెంచుకోవాలి. అదే విధంగా... క్వాడ్రాటిక్‌ ఈక్వేషన్స్, డేటా ఇంటర్‌ప్రిటేషన్, సింప్లిఫికేషన్స్, అప్రాక్సిమేషన్స్‌ అంశాలను అధ్యయనం చేయాలి.
  • రీజనింగ్‌ ఎబిలిటీ: ఈ విభాగంలో మార్కుల సాధనకు కోడింగ్‌-డీకోడింగ్, బ్లడ్‌ రిలేషన్స్, డైరెక్షన్, సిలాజిజమ్‌ విభాగాలను బాగా ప్రాక్టీస్‌ చేయాలి.

ప్రొఫెషనల్‌ నాలెడ్జ్‌

బ్యాంకింగ్‌ రంగం పరిణామాలు, విధానాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. బ్యాంకింగ్‌ రంగంలోని అబ్రివేషన్లు, పదజాలం, విధులు, బ్యాంకులకు సంబంధించిన కొత్త విధానాలు, కోర్‌ బ్యాంకింగ్‌కు సంబంధించి చట్టాలు, విధానాలు, రిజర్వ్‌ బ్యాంకు విధులు వంటి వాటిపై పూర్తిగా అవగాహన ఏర్పరచుకోవాలి.
జనరల్‌ అవేర్‌నెస్‌లో కరెంట్‌ అఫైర్స్, స్టాక్‌ జనరల్‌ నాలెడ్జ్‌ కోణంలోనూ ఆర్థిక సంబంధ వ్యవహారాలు (ఎకానమీ, ప్రభుత్వ పథకాలు)కు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి.


ముఖ్య సమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 
  • ఆన్‌లైన్‌ ధరఖాస్తు చివరి తేదీ: జూలై 25, 2023
  • తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌
  • వివరాలకు వెబ్‌సైట్‌: https://bankofmaharashtra.in/current-openings
  • ఆన్‌లైన్‌ దరఖాస్తు వెబ్‌సైట్‌: https://ibpsonline.ibps.in/bmcgomay23/

చ‌ద‌వండి: BOM Recruitment 2023: బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్రలో 400 ఆఫీసర్‌ పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date July 25,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories