Skip to main content

Bank of Baroda Recruitment 2022: బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో 220 పోస్టులు.. ఎంపిక ప్రక్రియ ఇలా..

Bank of Baroda Recruitment

ముంబై ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న ప్రభుత్వరంగ బ్యాంక్‌.. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా పలు విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. వీటిలో సేల్స్‌ మేనేజర్, అసిస్టెంట్‌ వైస్‌ ప్రెసిడెంట్, సీనియర్‌ మేనేజర్‌ వంటి పోస్టులున్నాయి. డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు దరఖాస్తుకు అర్హులు. షార్ట్‌లిస్ట్, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆసక్తి గల వారు ఫిబ్రవరి 14 తేదీలోగా ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. 

  • మొత్తం పోస్టుల సంఖ్య: 220

విద్యార్హతలు
కనీస విద్యార్హతగా డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. దీంతోపాటు ప్రాధాన్యత విద్యార్హతగా.. గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా విద్యాసంస్థ నుంచి ఏదైనా పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ డిగ్రీ/డిప్లొమా మేనేజ్‌మెంట్‌ ఇన్‌ బ్యాంకింగ్‌/సేల్స్‌/మార్కెటింగ్‌/క్రెడిట్‌/ఫైనాన్స్‌ ఉత్తీర్ణులై ఉండాలి.

పోస్టుల వారీగా అదనపు అర్హతలు

  • జోనల్‌ సేల్స్‌ మేనేజర్‌: ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు 32–48 ఏళ్ల మధ్య వయసు వారై ఉండాలి. అలాగే సంబంధిత విభాగంలో 12 ఏళ్ల పాటు పనిచేసిన అనుభవం తప్పనిసరి. 
  • రీజినల్‌ సేల్స్‌ మేనేజర్‌: ఈ పోస్టుల దరఖాస్తుదారులు 28–45 ఏళ్ల మధ్య ఉండాలి. అలాగే వీరికి సంబంధిత విభాగంలో 8 ఏళ్ల పని అనుభవం ఉండాలి.
  • అసిస్టెంట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌: ఈ విభాగంలోని ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారు 28–40 ఏళ్ల మధ్య ఉండాలి. వీరికి సంబంధిత విభాగంలో 8ఏళ్లు పనిచేసిన అనుభవం తప్పనిసరి.
  • సీనియర్‌ మేనేజర్‌: ఈ విభాగంలోని పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే వారు 25–37 ఏళ్ల మధ్య వయసు వారై ఉండాలి. సంబంధిత విభాగంలో 5 ఏళ్ల పని అనుభవం ఉండాలి.

ఎంపిక ప్రక్రియ
వచ్చిన దరఖాస్తులను బట్టి అభ్యర్థులను షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. షార్ట్‌లిస్ట్‌ చేసిన వారికి పర్సనల్‌ ఇంటర్వ్యూ నిర్వహించి.. ఆయా విభాగాల్లో ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. ఇది కాకుండా బ్యాంక్‌ ఇతర ఎంపిక విధానాలను సైతం అనురించవచ్చు. 

వేతనాలు

  • అభ్యర్థుల అర్హతలు, అనుభవం, చివరగా తీసుకున్న జీతం, ప్రొఫెషనల్‌ సామర్థ్యాలను అనుసరించి వేతనాలు అందిస్తారు.
  • ప్రస్తుతం 5ఏళ్ల కాలానికి కాంట్రాక్టు పద్ధతిన అభ్యర్థులను ఆయా ఉద్యోగాలకు తీసుకుంటారు. కాలానుగుణ పనితీరుతో కాంట్రాక్టును పొడిగించే అవకాశం ఉంది.

ముఖ్యమైన సమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
  • దరఖాస్తులకు చివరి తేదీ: 14.02.2022
  • వెబ్‌సైట్‌: https://www.bankofbaroda.in/career.htm


చ‌ద‌వండి: SBI Recruitment 2022: ఎస్‌బీఐ బ్యాంక్‌లో 48 అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టులు.. నెలకు రూ.64వేల వరకు జీతం

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date February 14,2022
Experience Fresher job
For more details, Click here

Photo Stories