D.EL.Ed: పరీక్ష ఫలితాలు వెల్లడి.. రీకౌంటింగ్‌కు ఇలా...
2019–21 విద్యాసంవత్సరం బ్యాచ్‌కు చెందిన అభ్యర్థులు గతేడాది ఆగస్టు 23 నుంచి 26వ తేదీ వరకు నాలుగో సెమిస్టర్ పరీక్షలను రాశారు. రాష్ట్రవ్యాప్తంగా 4,771 మంది ఛాత్రోపాధ్యాయులు హాజరు కాగా, వీరిలో 4,726 మంది ఉత్తీర్ణత సాధించారు. కాగా, ఛాత్రోపాధ్యాయులు తమ డమ్మీ మార్కుల లిస్టులను https://www.bse.ap.gov.in/ వెబ్‌సైట్‌కు లాగిన్ అయి డౌన్‌లోడ్ చేసుకోవాలని అధికారులు పేర్కొన్నారు.
చదవండి:
DSC: డీఎస్సీ–2008 అభ్యర్థులకు ఉద్యోగాలివ్వాలి
Online Traning: టీచర్లకు శిక్షణ
రీకౌంటింగ్‌కు ఇలా...
మార్కుల రీకౌంటింగ్ చేయించుకోవాలనుకునే వారు తమ దరఖాస్తుతో పాటు సదరు డమ్మీ మార్కుల లిస్టు, సెల్ఫ్ అడ్రస్ రాసిన ఎన్వలప్ కవరుతో జతచేసి పంపించాలన్నారు. రీకౌంటింగ్ చేయాల్సిన ఒక్కొక్క సబ్జెక్టుకు రూ.500 ఫీజు చెల్లించాలని తెలిపారు. అయితే డీడీలు చెల్లవని, కేవలం సీఎఫ్‌ఎంఎస్ విధానంతోనే నగదును చెల్లించాలని స్పష్టం చేశారు. రీకౌంటింగ్‌కు చలానాలను చెల్లించేందుకు జూన్ 18వ తేదీతో గడువు ముగుస్తుందన్నారు. రీకౌంటింగ్‌కు పంపించే వారు ‘పి గురుస్వామి, అడిషనల్ జాయింట్ సెక్రటరీ డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్, ఆంధ్ర ఆస్పత్రి ఎదురు, గొల్లపూడి విజయవాడ–521 225’ అడ్రస్‌కు పోస్టు చేయాలని సూచించారు.