Skip to main content

Twin Sisters Got Same Marks in 10th and Inter : విచిత్రం అంటే ఇదే ఏమో.. ఈ కవల అక్కాచెల్లెళ్లు.. ఇంట‌ర్‌లో 620/625 ఒకే మార్కులు.. టెన్త్‌లో కూడా..

ఈ కవల అక్కాచెల్లెళ్లు.. ఒకే క్లాసు.. ఒకే స్కూల్స్‌.. టెన్త్ ప‌బ్లిక్ ప‌రీక్ష‌ల్లో ఒకే మార్కులు.. ఇంట‌ర్ ప‌బ్లిక్ ప‌రీక్ష‌ల్లో కూడా ఆశ్చ‌ర్యంగా ఒకే మార్కులు వ‌చ్చాయి.. ఇద్ద‌రి ల‌క్ష్యాలు ఒక్క‌టే. వీరే కర్ణాటకలోని హాసన్ ప్రాంతానికి చెందిన కవల అక్కాచెల్లెళ్లు. రెండు నిమిషాల తేడాతో పుట్టిన ట్విన్స్‌ చుక్కి, ఇబ్బని. వీరు ఒకే పోలికలతో ఉంటారు. అంతేకాదు పరీక్షా ఫలితాల్లో కూడా ఒకేలా మార్కులు తెచ్చుకోవడం విశేషంగా నిలిచింది.
Chukki and Ibbani  Remarkable achievemen  Academic success

అచ్చం హాలో బ్రదర్ సినిమా మాదిరిగా..
మనం సాధారణంగా కవల పిల్లలు పుట్టారనగానే, పిల్లలను చూడటానికి అందరు ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. పుట్టిన పిల్లలు అచ్చం ఒకేలా ఉంటారు. కొందరు ఒక పిల్లాడు ఏడ్వగానే మరో పిల్లాడు ఏడుస్తుంటారు. ఒకరు పడుకోగానే మరోకరు పడుకుంటారు. మొత్తానికి కొందరిలో ఇది మాత్రం అచ్చం హాలో బ్రదర్ మాదిరిగా ఉంటుంది. కానీ కొందరు ఈవి షయాలను మాత్రం కొట్టి పారేస్తుంటారు. కవలలుగా పుట్టినంత మాత్రన ఓకేలా ప్రవర్తించాలని లేదు. కొందరు ఒకే పొలికలతో పుట్టిన మరికొందరు మాత్రం కాస్తంత డిఫరెంట్ గాను ఉంటారు. ఇక పొలికల విషయం పక్కన పెడితే.. కర్ణాటకలోని హసన్ కు చెందిన ఇద్దరున కవల అక్కా చెల్లెళ్లు మాత్రం అరుదైన ఘనత సాధించారు.

☛ Success Story : 600కు 600 మార్కులు.. ఓ బాలిక రికార్డ్ సృష్టించిందిలా..

కర్ణాటకలో విడుదలైన 12వ తరగతి పరీక్షలలో ఇద్దరికీ సమానంగా మార్కులు వచ్చాయి. ఇంట‌ర్‌ ఇద్దరూ 600/571 మార్కులు సాధించారు. అంతే కాదు గతంలో పదో తరగతి ప‌బ్లిక్‌ పరీక్షా ఫలితాల్లో ఇలాంటి మ్యాజిక్కే జరిగింది. ఇద్దరూ 625 మార్కులకు 620 మార్కులు తెచ్చుకున్నారు. దీంతే భలే అదృష్టం అంటూ నెటిజన్లు కమెంట్‌ చేస్తున్నారు. సాధారణంగా కవలలు ఒకేలాగా ఆలోచించడం, ఒకేసారి శారీరక సమస్యలు రావడం చూస్తాం. కానీ పరీక్షల్లో కూడా ఒకేలా  మార్కులు రావడం అదృష్టం అంటూ వ్యాఖ్యానించారు.

☛➤ 10th Class Student Success Story : అమ్మ లేదు.. నాన్నా ఉన్న రాడు.. ఎన్నో స‌మ‌స్య‌లు ఎదుర్కొని టాప్ మార్కులు కొట్టిందిలా.. కానీ..

తమకూ ఇది..
ఇద్దరికీ 97 శాతం మార్కులొస్తాయని ఆశించాం. కానీ ఇలా జరుగుతుందని అస్సలు ఊహించ లేదని పెద్ద అమ్మాయి అయినా చుక్కి సంతోషం ప్రకటించింది. తమకూ ఇది ఆశ్చర్యకరంగా ఉందని తెలిపింది. రెండేళ్ల క్రితం పదో తరగతిలో కూడా ఇలానే సమాన మార్కులు సాధించా మని చెప్పుకొచ్చింది. 

ల‌క్ష్యం కూడా ఇదే..

Chukki and Ibbani Success Story in telugu


చుక్కి, ఇబ్బని కర్ణాటకలోని హసన్ నగరంలో ఎన్డిఆర్కె పియు కాలేజీలో 12వ తరగతి పూర్తి చేశారు. ప్రస్తుతం నీట్‌కోసం సిద్ధమవుతున్నారు. నీట్‌ పరీక్షలో వచ్చిన ఫలితాన్ని ఇంజనీరింగ్‌, మెడిసిన్ అనేది నిర్ణయించుకుంటారట. మీరిద్దరూ ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారా..? అని ప్రశ్నించగా నా కంటే అక్క ఎక్కువ మార్కులు తెచ్చుకుంటే నేను ఎలా సంతోషిస్తానో అక్క కూడా అంతే.. ఇద్దరికీ పోటీ ఏమీ లేదు అని చెప్పింది. కేవలం చదువులు మాత్రమే కాకుండా సంగీతం, నృత్యం, అలాగే ఆటల్లో కూడా ముందుంటాం అని చెప్పారు.  ఇద్దరిదీ ఒకే ఆశయమట.

చ‌ద‌వండి: After 10th Best Courses: ఇంటర్‌లో.. ఏ ‘గ్రూపు’లో చేరితే మంచి భ‌విష్య‌త్ ఉంటుంది..?

ఇటు తండ్రి వినోద్ మాత్రం..
ఇటు తండ్రి వినోద్ చంద్ర తన బిడ్డలు సాధించిన ఘనతపై ఆశ్చర్యాన్ని ప్రటకించారు.  ఇది తనకు గర్వకారణమని చెప్పారు ఇబ్బానీ తన సోదరి కంటే భాషలలో మెరుగ్గా స్కోర్ చేసిందనీ, సైన్స్, మిగిలిన  సబ్జెక్టులలో ఒకటి నుండి రెండు మార్కులే తేడా అని చెప్పారు. వాళ్ళు కలిసే పనులు చేసుకుంటారు స్నేహంగా ఉంటారు. కలిసే చదువుకుంటారు. ఒకవిధంగా చెప్పాలంటే  ఇద్దరూ పుస్తకాల పురుగులు అని తెలిపారు చంద్ర ఒకింత గర్వంగా. తమ బిడ్డలు ఇద్దరు ప్రతి విషయంలోను పోటీపడి, కష్టపడి చదువుతారంటూ తండ్రి గర్వంగా చెప్పుకున్నారు. ఈ ఘటన మాత్రం ప్రస్తుతం వార్తలలో నిలిచింది.

☛ 10th Class Exam: పుట్టెడు దుఃఖంలోనూ విజేతలుగా నిలిచారు

Published date : 13 Apr 2024 03:28PM

Photo Stories