10th Class Student Success Story : అమ్మ లేదు.. నాన్న ఉన్నా రాడు.. ఎన్నో సమస్యలు ఎదుర్కొని టాప్ మార్కులు కొట్టిందిలా.. కానీ..
ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 2,793 పాఠశాలల్లో వందశాతం ఉత్తీర్ణత నమోదైంది. 25 స్కూళ్లలో సున్నా ఫలితాలు వచ్చాయి. రాష్ట్రంలో నిర్మల్ జిల్లా 99శాతం ఉత్తీర్ణతతో ముందు వరుసలో ఉండగా.. వికారాబాద్ జిల్లా 59.46 శాతంతో చివరన నిలిచినట్టు తెలిపారు.
☛ SSC 2023: కవలలకు 10 జీపీఏ.. ఆడపిల్లలని పుట్టగానే తండ్రి వదిలేశాడు..
ప్రభుత్వ గురుకులాలు 98.25 శాతంతో టాప్‌లో నిలిచాయి. రెసిడెన్షియల్, సోషల్, బీసీ, మైనార్టీ, ట్రైబల్ వెల్ఫేర్, మోడల్ స్కూళ్లు కూడా సగటుకుపైగా ఉత్తీర్ణత శాతాన్ని సాధించాయి. అయితే ఈ ఫలితాల్లో నల్గొండ జిల్లా నిడమనూరు ఆదర్శ పాఠశాల విద్యార్థిని కట్టెబోయిన అలేఖ్య పరీక్షలకు ముందు ఎన్నో ఇబ్బందులకు ఎదుర్కొని.. 9.7 జీపీఏ సాధించింది.
తల్లి.. దండ్రి లేని.. ఈమె..
నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం కొత్తలాపురానికి చెందిన కట్టెబోయిన వెంకటయ్య, లక్షమ్మ దంపతులకు ఏకైక కూతురు అలేఖ్య. తల్లికి అనారోగ్యం అని తెలియడంతో తండ్రి చాలా ఏళ్ల కిందటే వదిలి వెళ్లాడు. దీంతో తల్లి లక్ష్మమ్మ కూతురు అలేఖ్యను తీసుకుని తల్లిగారి ఊరు పెద్దవూర మండలంలోని ముసలమ్మ చెట్టుకు వచ్చి స్థిరపడింది.
☛ 10th Class Exam: పుట్టెడు దుఃఖంలోనూ విజేతలుగా నిలిచారు
అలేఖ్య ఆరో తరగతి నుంచే నిడమనూరులోని వసతి గృహంలో ఉంటూ ఆదర్శ పాఠశాలలో చేరింది. అలేఖ్య తల్లి లక్ష్మమ్మ కూడా తీవ్ర అనారోగ్యంతో ఫిబ్రవరి 11న హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో మృతిచెందింది. ఈ పరిస్థితుల్లో ఏప్రిల్‌లో నిర్వహించిన పదో తరగతి పరీక్షలు రాసి 9.7 జీపీఏ సాధించింది.
వస్త్ర దుకాణంలో పని చేస్తూ..
అలేఖ్య పరిస్థితి తెలుసుకున్న ఆదర్శ పాఠశాల అధ్యాపకులు ఆర్థికంగా కొంత సహయ సహకారాలు అందించారు. పదో తరగతి తర్వాత కూడా అలేఖ్య కూడా చదువుకు అవసరమైన సహకారం అందించడానికి అధ్యాపకులు ఆలోచన చేస్తున్నారు. ప్రస్తుతం అలేఖ్య హైదరాబాద్‌లో వస్త్ర దుకాణంలో పని చేస్తుంది. బైపీసీలో చేరి, నర్సింగ్ చేయాలని లక్ష్యమని తెలిపింది.
☛ 10జీపీఏ విద్యార్థులకు రూ.10వేలు నగదు పురస్కారం
2,793 స్కూళ్లలో 100 శాతం పాస్..
పదో తరగతిలో రాష్ట్రవ్యాప్తంగా 2,793 పాఠశాలల్లో నూటికి నూరు శాతం ఉత్తీర్ణత నమోదైంది. 25 స్కూళ్లలో ఒక్క విద్యార్థి కూడా పాస్ కాలేదు. ఇందులో ప్రైవేటు స్కూళ్లు 13 ఉంటే.. ప్రభుత్వ జిల్లా పరిషత్ స్కూళ్లు 9, ఎయిడెడ్ స్కూళ్లు 3 ఉన్నాయి. జీరో ఉత్తీర్ణత వచ్చిన పాఠశాలల్లో పనితీరుపై సమీక్ష చేపడతామని మంత్రి సబిత తెలిపారు.
ఏ సబ్జెక్టులో ఎంత మంది పాస్?
భాష |
ఉత్తీర్ణుల సంఖ్య |
శాతం |
మొదటి భాష |
4,76,197 |
98.17 |
ద్వితీయ భాష (హిందీ) |
4,81,885 |
99.70 |
తృతీయ భాష (ఆంగ్లం) |
4,75,843 |
98.45 |
గణితం |
4,43,743 |
91.65 |
సామాన్య శాస్త్రం |
4,54,708 |
93.91 |
సాంఘిక శాస్త్రం |
4,78,483 |
98.83 |
చదవండి: Jobs After 10th & Inter: పది, ఇంటర్‌తోనే... కొలువుల దిశగా!
గ్రేడ్ పాయింట్ ఏవరేజ్ (జీపీఏ) వారీగా ఉత్తీర్ణులు
జీపీఏ |
ఉత్తీర్ణుల సంఖ్య |
10 |
6,163 |
9 – 9.8 |
83,597 |
8 – 8.8 |
1,23,665 |
7 – 7.8 |
1,16,673 |
6 – 6.8 |
71,683 |
5 – 5.8 |
17,279 |
4 – 4.8 |
400 |
చదవండి: Best Career Options After 10th: పది తర్వాత.. కెరీర్ ప్లానింగ్!
మేనేజ్‌మెంట్ వారీగా వంద శాతం ఉత్తీర్ణత తీరు
మేనేజ్‌మెంట్ |
మొత్తం స్కూళ్లు |
వంద శాతం ఉత్తీర్ణత |
ఎయిడెడ్ |
162 |
16 |
ఆశ్రమ పాఠశాలలు |
227 |
38 |
బీసీ వెల్ఫేర్ |
255 |
89 |
కేజీబీవీ |
475 |
91 |
మోడల్ స్కూళ్లు |
194 |
38 |
రెసిడెన్షియల్ |
35 |
21 |
రెసిడెన్షియల్ మినీ |
207 |
55 |
సోషల్ వెల్ఫేర్ |
239 |
73 |
ట్రైబల్ వెల్ఫేర్ |
99 |
24 |
ప్రభుత్వ స్కూళ్లు |
491 |
23 |
జిల్లా పరిషత్ |
4,108 |
915 |
ప్రైవేటు స్కూళ్లు |
4,966 |
1,410 |
☛ 2 crore salary package: రెండు కోట్ల ప్యాకేజీతో అదరగొట్టిన హైదరాబాదీ అమ్మాయి
అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ టైం టేబుల్ ఇదీ..
14.6.23 |
మొదటి భాష |
15.6.23 |
రెండో భాష |
16.6.23 |
ఇంగ్లిష్ |
17.6.23 |
మేథమెటిక్స్ |
19.6.23 |
సైన్స్ |
20.6.23 |
సోషల్ స్టడీస్ |
21.6.23 |
ఓఎస్సెస్సీ మెయిన్ లాంగ్వేజ్–1 |
22.6.23 |
ఓఎస్సెస్సీ మెయిన్ లాంగ్వేజ్–2 |
☛ Top 10 Highest paying Govt Jobs: అత్యధిక వేతనం ఇచ్చే ప్రభుత్వ ఉద్యోగాలు ఇవే