10th Class Exam: పుట్టెడు దుఃఖంలోనూ విజేతలుగా నిలిచారు
ఖమ్మం జిల్లా తల్లాడ మండలం లక్ష్మీపురానికి చెందిన ఇనుపనూరి రాంబాబు – దేవమణి దంపతులు ఖమ్మంలో నివసిస్తున్నారు. కండక్టర్‌గా పనిచేసే దేవమణిని ఆమె భర్త అను మానంతో ఏప్రిల్ 2వ తేదీ రాత్రి హత్య చేశాడు. హాస్టల్‌లో ఉంటున్న వీరి కుమారుడు ప్రణవ్‌తేజకు విషయం చెప్పలేదు. మొదటి పరీక్ష రాశాక తల్లి అంత్యక్రియలకు తీసుకొచ్చారు. ఏప్రిల్ 4న బాలుడి తండ్రి రాంబాబు విజయవాడలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇలా వరుస విషాదాల నడుమ పరీక్షలు రాసిన ప్రణవ్ పదో తరగతి ఫలితాల్లో 9.3 జీపీఏతో ఉతీర్ణత సాధించాడు.
చదవండి: పదవ తరగతి తర్వాత....కోర్సులు..అవకాశాలు
తండ్రి చనిపోయినా..: ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం జక్కేపల్లికి చెందిన చట్టు రమేష్ ట్యాంకర్ డ్రైవర్‌గా కేటీపీఎస్ లో పనిచేస్తూ గత నెలలో ప్రమాదంలో మరణించాడు. తండ్రి మృతదేహం ఇంట్లో ఉన్నప్పటికీ పరీక్షలకు హాజరైన మృతుని కుమారుడు శ్రీకాంత్ 9.2 జీపీఏ సాధించాడు.
చదవండి: విదేశీ భాష... అవకాశాల బాట...