SSC 2023: కవలలకు 10 జీపీఏ.. ఆడపిల్లలని పుట్టగానే తండ్రి వదిలేశాడు..
ఆ కవలలిద్దరూ ఎస్సెస్సీలో 10 జీపీఏ సాధించారు. వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కేశవపట్నానికి చెందిన రిటైర్డ్ ఉద్యోగి అల్లెంకి వీరేశంకు కూతురు, కొడుకు ఉన్నారు. కూతురు కవిత పెద్దపల్లి కలెక్టరేట్‌లో ఔట్‌సోర్సింగ్‌లో ఎలక్ట్రానిక్స్ జిల్లా మేనేజర్‌గా పనిచేస్తున్నారు. 16 ఏళ్ల క్రితం కవితకు ఏడో నెల సమయంలో డెలివరీ కోసం భర్త ఆమెను పుట్టింటికి పంపించాడు. కవల కూతుళ్లు పుట్టడంతో ఇక్కడే వదిలేశాడు.
చదవండి: After 10th : పదో తరగతి అర్హతతో డ్రోన్ పైలట్.. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు..
దీంతో అప్పటినుంచి వారి ఆలనపాలనా అమ్మమ్మ వనజ, తాతయ్య వీరేశం చూస్తున్నారు. శర్వాణి, ప్రజ్ఞాని 5వ తరగతి వరకు ప్రయివేటు స్కూల్‌లో, 6వ తరగతి నుంచి మోడల్‌స్కూల్‌లో చదివారు. మే 10న విడుదల చేసిన ఎస్సెస్సీ ఫలితాల్లో ఇద్దరూ 10 జీపీఏ సాధించారు. ‘అమ్మమ్మ, తాతయ్యలు, ప్రిన్సిపాల్ జ్యోతి ప్రోత్సాహంతోనే 10 జీపీఏ సాధించాం’ అని శర్వాణి, ప్రజ్ఞాని చెప్పారు.
చదవండి: భద్రమైన కెరీర్‌ను ఎంచుకోండిలా..!