School Admissions: 5 నుంచి 9వ తరగతి వరకు ప్రవేశాల కోసం దరఖాస్తుల ఆహ్వానం
Sakshi Education
నిజామాబాద్ అర్బన్: జిల్లాలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఈ ఏడాది విద్యా సంవత్సరానికి 5 నుంచి 9వ తరగతి వరకు మిగిలిన సీట్లలో ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకోవాలని సాంఘిక సంక్షేమ గురుకుల ప్రాంతీయ సమన్వయ అధికారిణి అలివేలు జూలై 4న ఒక ప్రకటనలో కోరారు.
ఆన్‌లైన్‌లో రూ.100 రుసుము చెల్లించి జూలై 12వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అలాగే 5 నుండి 9వ తరగతి వరకు గురుకులాల్లో చదివే విద్యార్థులు సీట్ల బదిలీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని, ఇందుకోసం ఆన్‌లైన్‌లో రూ.100 చెల్లించి జూలై 31వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ఏఎన్‌ఎం ఉద్యోగానికి..
కామారెడ్డి అర్బన్: కామారెడ్డి గిరిజన కళాశాల బాలుర వసతి గృహంలో పొరుగు సేవల కింద ఏఎన్‌ఎంగా నెలకు రూ.22,750 గౌరవ వేతనంతో పనిచేయడానికి అర్హులైన గిరిజన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా గిరిజన సంక్షేమాధికారి జూలై 4న ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 8వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని, పూర్తి వివరాల కోసం కలెక్టరేట్‌లోని తమ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.
Published date : 05 Jul 2024 09:30AM
Tags
- 5th Class to 9th Class
- School admissions
- District Social Welfare Residential Schools
- Nizamabad District News
- Telangana News
- SocialWelfareGurukulaSchool
- TelanganaEducation
- NizamabadUrban
- AdmissionAlert
- SocialWelfareProgram
- EducationNews
- Gurus Alivelu
- AcademicYear2024
- latest admissions in 2024
- sakshieducation latest admissions in 2024