విద్యార్థుల్లో నైపుణ్యాలను వెలికితీయాలి.. స్టడీ మెటీరియల్ పరిశీలన
Sakshi Education
రాజోళి: విద్యార్థుల్లో నైపుణ్యాలను వెలికితీసి, వారి ఉజ్వల భవిష్యత్‌కు బాటలు వేయాలని డీఈఓ మహమ్మద్ అబ్దుల్ ఘని ఉపాధ్యాయులకు సూచించారు.
రాజోళి కొత్త ప్లాట్లలోని ప్రాథమిక పాఠశాలలో జనవరి 9న ఎంవీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులు తయారు చేసిన స్టడీ మెటీరియల్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసి ప్రోత్సాహం అందించాలని సూచించారు.
చదవండి: Good news for Anganwadi Job Aspirants: అంగన్‌వాడీల్లో కొలువుల భర్తీ!.. టీచర్లు, హెల్పర్లు..
తద్వారా విద్యార్థులు తమ ఆలోచనలకు పదునుపెట్టి అద్భుతాలు సృష్టించే అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ భగీరథ రెడ్డి, జెడ్పీ మాజీ కోఆప్షన్ సభ్యుడు నిషాక్, ఎంవీ ఫౌండేషన్ మండల ఇన్‌చార్జి హన్మిరెడ్డి, సుధాకర్, మాజీ ఉపసర్పంచ్ దస్తగిరి, రామాంజనేయులు, బుజ్జమ్మ తదితరులు పాల్గొన్నారు.
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |
Published date : 10 Jan 2025 06:23PM