Skip to main content

TS 10th Class Results 2024 Live Updates : తెలంగాణ టెన్త్ ఫ‌లితాలు విడుద‌ల ఏప్రిల్ 30వ తేదీన.. తొలిసారిగా పదో తరగతి మెమోలు ఇలా.. ఒకే క్లిక్‌తో సాక్షిఎడ్యుకేష‌న్‌.కామ్‌లో రిజ‌ల్డ్స్‌..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఇటీవ‌లే ఏపీలో టెన్త్ క్లాసు ఫ‌లితాలు విడుద‌ల చేసిన విష‌యం తెల్సిందే. ఇక తెలంగాణ‌లో కూడా ఏప్రిల్‌ 30వ తేదీన ఉదయం 11 గంటలకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ కార్యాలయంలో విద్యాశాఖ‌ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం చేతుల మీదగా పదో తరగతి ఫలితాలను విడుదల చేయనున్నారు.
TS Tenth Class Results 2024

ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువరించారు. ఈ మేర‌కు అన్ని ఏర్పాట్ల‌ను పూర్తి చేశారు.

సాక్షిలో అత్యంత వేగంగా టెన్త్ ఫ‌లితాలు..
తెలంగాణ‌ పదోతరగతి ఫలితాలు అత్యంత‌ వేగంగా.. ఒకే ఒక్క క్లిక్‌తో తెలుసుకునేందుకు www.sakshieducation.com చూడొచ్చు.

How to check TS 10th Class Results 2024 :

ts 10th class results 2024 updates

☛ Visit https://results.sakshieducation.com/ or sakshieducation.com.

☛ Click on the "TS SSC Results 2024" link available on the home page.

☛ Enter your hall ticket number and click on submit button.

☛ The 10th class marks will be displayed.

☛ Take print and save a copy for further use.

ఈ సారి ఫ‌లితాల కోసం..
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో మార్చి 18వ తేదీ నుంచి ఏప్రిల్‌ 2వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. ఏప్రిల్‌ 20 నాటికి మూల్యాంకన ప్రక్రియ కూడా పూర్తి చేశారు. ఈ వారం రోజుల్లో డీ కోడిండ్‌ ప్రక్రియ కూడా పూర్తి చేసి, ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 5.08 లక్షల మందికి పైగా విద్యార్థులు పదోతరగతి పరీక్షలకు హాజరయ్యారు. ఇందులో 2,57,952 మంది బాలురు ఉన్నారు. అలాగే 2,50,433 ల‌క్ష‌ల మంది బాలిక‌లు ఉన్నారు.

ఈ తొలిసారిగా పదో తరగతి మెమోలపై.. 
తెలంగాణ‌లో తొలిసారిగా పదో తరగతి మెమోలపై పెన్ నెంబర్‌ను ముద్రించే దిశగా విద్యాశాఖ అడుగులు వేస్తోంది. ఓటీఆర్ తరహాలో టెన్త్ విద్యార్థులకు పర్మినెంట్‌ ఎడ్యుకేషన్‌ నంబర్‌ ను అమలు చేయనుంది. ఈ ఏడాది నుంచే ఈ విధానాన్ని అమలు చేయనుంది. ఫలితంగా పదో తరగతి మెమోలపై 11 అంకెలతో కూడిన ‘పెన్’ నంబర్‌ను ముద్రించనుంది. పెన్ నెంబర్‌ సెక్యూరిటీ ఫీచర్లతో కలిగి ఉంటుంది. విద్యార్థికి సంబంధించిన సమాచారంతో పాటు పదో తరగతి ఉత్తీర్ణత వివరాలు ఉంటాయి. ఫలితంగా నకిలీ సర్టిఫికెట్లకు చెక్ పడనుంది. ఈ పెన్‌ నెంబర్ ఆధారంగా ఒరిజినల్ సర్టిఫికెట్లనుగా సింపుల్‌గా గుర్తించే అవకాశం ఉంటుంది.

నూతన జాతీయ విద్యావిధానంలో భాగంగా పర్మినెంట్ ఎడ్యుకేషన్ నంబర్ అనేది భారతదేశంలోని విద్యార్థులందరికీ ప్రత్యేక గుర్తింపు సంఖ్యగా కేటాయిస్తున్నారు. పెన్‌ అనేది ఒకటో తరగతి అడ్మిషన్ సమయంలో ప్రతి విద్యార్థికి కేటాయించనున్న ఒక విశిష్ట సంఖ్య. ఆ సంఖ్య వారి చదువు పూర్తయ్యేంత వరకు కొనసాగుతుంది. విద్యా మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం UDISE+ పోర్టల్ ద్వారా విద్యార్థులందరికీ ఈ PEN (Permanent Education Number) అందిస్తోంది.

ఈ PEN ఎడ్యుకేషన్‌ ప్రారంభ సంవత్సరంలోనే ఇవ్వబడుతుంది. ఇది జీవితాంతం చెల్లుబాటు అవుతుంది. ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్‌ వరకు విద్యార్థులకు యూనిక్‌ ఐడీ తరహాలో PEN నంబర్‌ను కేటాయిస్తారు. ఈ నంబర్‌ ద్వారా విద్యార్థి ఎక్కడ చదివారో.. ఉన్నత చదువులు తర్వాత ఏ స్థాయిలో ఉన్నారనే విషయాన్ని సింపుల్‌గా తెలుసుకోవచ్చు.

Published date : 26 Apr 2024 03:37PM

Photo Stories