Skip to main content

TS 10th Class Results 2024: టెన్త్‌ ఫలితాలు.. ఆ స్కూళ్లలో చదివిన విద్యార్థులు అందరూ ఫెయిల్‌

TS 10th Class Results 2024    Telangana 10th Class Results  Education Department Announcement

తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల అయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 3927 స్కూళ్లలో వంద శాతం ఉత్తీర్ణత నమోదయ్యింది. అయితే 6స్కూళ్లలో మాత్రం విద్యార్థులు అందరూ ఫెయిల్‌ అయ్యారని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. ఇందులో 4 ప్రైవేట్‌ స్కూళ్లు, 2 ఎయిడెడ్‌ స్కూళ్లు ఉన్నాయని తెలిపారు.

TS SSC Supplementary Exam Dates: జూన్‌ 3 నుంచి పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు

 

వాళ్లందరికీ 10/10 జీపీఏ
అయితే జీరో పాస్‌ పర్సంటేజ్‌ స్కూళ్లలో ఒక్క ప్రభుత్వ పాఠశాల కూడా లేకపోవడం విశేషమని వెల్లడించారు. అయితే వంద శాతం ఉత్తీర్ణత నమోదయిన స్కూళ్లలో 1347 ZPHS స్కూళ్లు ఉన్నాయన్నారు. ఈసారి ఫలితాల్లో 8883 మంది విద్యార్థులు 10/10 జీపీఏ సాధించారని తెలిపారు. 

TS SSC 10th Results 2024 Live Updates : టెన్త్‌లో ఈసారి 91.23% ఉత్తీర్ణత.. ఫ‌స్ట్‌.. లాస్ట్ జిల్లాలు ఇవే..

 

Published date : 30 Apr 2024 01:00PM

Photo Stories