TS SSC Supplementary Exam Dates: జూన్ 3 నుంచి పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు
తెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదల అయ్యాయి. ఈసారి మొత్తం 91.23% ఉత్తీర్ణత నమోదయ్యింది. ఎప్పటిలాగే ఈసారి కూడా బాలికలే ఫలితాల్లో పైచేయి సాధించారు. 93.23%తో బాలికలు ఉత్తర్ణత సాధించగా, 89.42%తో బాలురు ఉత్తీర్ణత సాధించారు.
ఇక 3927 స్కూళ్లలో వంద శాతం ఉత్తీర్ణత నమోదయ్యింది. అయితే పదో తరగతి ఫలితాల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలు రాయొచ్చని విద్యా శాఖ కమిషనర్ బుర్రా వెంకటేశం తెలిపారు.
TS SSC 10th Results 2024 Live Updates: పదో తరగతి ఫలితాలపై లైవ్ అప్‌డేట్స్.. ఈసారి 91.23% ఉత్తీర్ణత
సప్లిమెంటరీ పరీక్షలు ఎప్పుడంటే..
ఫలితాల్లో ఫెయిల్ అయినంత మాత్రానా జీవితం అయిపోలేదని, పరీక్షలో తప్పిన విద్యార్థులకు తల్లిదండ్రులు అండగా నిలబడాలని పేర్కొన్నారు. కాగా పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 3 నుంచి 13 వరకు జరగనున్నాయి. ఇందుకోసం మే 16 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని కమిషనర్ అన్నారు.
ఉ. 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల మధ్య సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని అన్నారు. రీకౌంటింగ్‌కు 15 రోజుల వరకు అవకాశం ఉంటుందని తెలిపారు. సబ్జెక్టుకు రూ. 500 చొప్పున చెల్లించాలన్నారు. ఆన్సర్ షీట్ ఫోటో కాపీ కోసం సబ్జెక్టులకు రూ. 1000 చెల్లించాలన్నారు.
పదో ఫలితాల కోసం డైరెక్ట్ లింక్‌ను క్లిక్ చేయండి.. https://results.sakshieducation.com/
Tags
- ts tenth class results 2024
- ts tenth class results 2024 live updates
- ts tenth class results 2024 release news telugu
- ts tenth class results 2024 telugu news
- TS Tenth Class results 2024 on April 30th
- TS Tenth Class results 2024 on April 30th News in Telugu
- ts tenth class results 2024 link
- TS SSC
- Supplementary Examinations
- ts ssc results 2024 link
- Commissioner Burra Venkatesham announcement
- application process
- Telangana 10th Class Results
- Pass percentage
- Supplementary exams schedule
- sakshieducation updates