Skip to main content

Good News For 10th Class Students : ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు గుడ్‌న్యూస్‌.. ఈ ప్రశ్నల‌కు మార్కులు.. ఫ‌లితాల విడుద‌ల తేదీ ఇదే..!

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఎస్ఎస్సీ ప‌దో త‌ర‌గ‌తి ప‌బ్లిక్ ప‌రీక్ష‌లు రాసిన విద్యార్థుల‌కు గుడ్‌న్యూస్ చెప్పింది. ఈసారి జరిగిన పదో తరగతి పరీక్షల్లో జీవశాస్త్రం(బయాలజీ) ప్రశ్నాపత్రంలో తప్పులు దొర్లాయి. ఈ విషయంలో పరీక్షలు రాసిన విద్యార్థులు అయోమయానికి గురయ్యారు. పరీక్షలు ముగిసినప్పిటికీ..తప్పుగా వచ్చిన ప్రశ్నల విషయంలో ఎస్ఎస్సీ క్లారిటీ ఇవ్వ‌క‌పోవ‌డంతో.. విద్యార్థులు గందరగోళానికి గురయ్యారు.
SSC Class 10th Public Exams Announcement  Subject Expert Committee Decision on SSC Board Response   tenth class public exams results 2024 details  Biology Question Paper Error Resolved

అయితే ఎట్ట‌కేల‌కు వీటిపై ఎస్ఎస్సీ బోర్డు స్పందించి.. కీలక నిర్ణయం తీసుకుంది. స‌బ్జెక్ట్‌ నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం.. తప్పుగా వచ్చిన ప్రశ్నలకు మార్కులు కలపాలని నిర్ణయించారు. ఏప్రిల్ 11వ తేదీకి TS SSC Examinations Spot Valuation పూర్తి కానుంది.

దొర్లిన త‌ప్పులు ఇవే..

good news for tenth class students telangana

మార్చి 28వ తేదీన బయోలజీ ఎగ్జామ్ జరిగింది. అయితే ఇందులో 2వ సెక్షన్ లోని ఆరో క్వశ్చన్ విషయంలో తప్పులు దొర్లాయి. ఇంగ్లీష్ మాధ్యామానికి, తెలుగు మాధ్యమంలో వచ్చిన ప్రశ్న విషయంలో తేడా ఉండటంతో విద్యార్థులు స్పష్టతకు రాలేకపోయారు. ఇదే విషయాన్ని పలువురు బోర్డు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై నిపుణుల కమిటీ కూడా చర్చించి.. తప్పుగా దొర్లిన ప్రశ్నల విషయంలో ఓ నివేదికను కూడా బోర్డుకు సమర్పించింది. బ్లూ ప్రింట్ విధానానికి విరుద్ధంగా ప్రశ్న ఇచ్చినట్లు కూడా తేల్చింది. ఫలితంగా ఈ రెండు ప్రశ్నలకు మార్కులు ఇవ్వాలని నిర్ణయించారు. ఫస్ట్ 2 క్వశ్చన్లను అటెంప్ట్ చేసిన విద్యార్థికి 2 మార్కులు ఇవ్వాలని నిర్ణయించారు. ఇక ఇదే రెండో విభాగంలోని.. ఐదో ప్రశ్న విషయంలో అనుబంధ సమాధానాలు రాస్తే మార్కులు ఇవ్వనున్నారు. ఇవే కాకుండా.. ఉర్దూ మీడియానికి సంబంధించి మ్యాథ్స్ పేపర్ లో తలెత్తిన కొన్ని తప్పులపై కూడా బోర్డు అధికారులు.. ఎగ్జామినర్లకు ఆదేశాలు ఇచ్చారు.

☛ TS Schools Annual Exams Time Table 2024 : తెలంగాణ‌లో వేసవి సెలవుల‌పై విద్యాశాఖ కీల‌క ఆదేశాలు.. 1-9వ త‌ర‌గ‌తి వ‌ర‌కు ప‌రీక్ష‌ల తేదీలు ఇవే..

టెన్త్‌ ఫలితాలు..?

టెన్త్‌ ఫలితాలు 2024

తెలంగాణ పదో తరగతి జవాబు మూల్యాంకనం 11 జిల్లాల్లో నిర్వహిస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటలకు సిబ్బంది విధులను నిర్వహిస్తున్నారు. స్పాట్ లో పాల్గొనే సిబ్బంది.. ప్రతిరోజూ ఒక్కరు 40 జవాబు పత్రాలను దిద్దాల్సి ఉంటుంది. ఉదయం షిఫ్ట్ లో 20, సాయంత్రం సెషల్ లో 20 పూర్తి చేస్తారు. ఏప్రిల్ 11వ తేదీతో ఈ స్పాట్ ప్రక్రియ పూర్తి కానుంది. ఆ తర్వాత మార్కుల ఎంట్రీతో పాటు సాంకేతిక అంశాలను పరిశీలన చేసి.. టెన్త్‌ ఫలితాలు ఏప్రిల్ చివ‌రి వారంలో కానీ.. మే 2 లేదా 3వ తేదీలలో విడుద‌ల అయ్యే అవకాశం ఉంది.

Published date : 05 Apr 2024 10:17AM

Photo Stories