Skip to main content

TS Schools Annual Exams Time Table 2024 : తెలంగాణ‌లో వేసవి సెలవుల‌పై విద్యాశాఖ కీల‌క ఆదేశాలు.. 1-9వ త‌ర‌గ‌తి వ‌ర‌కు ప‌రీక్ష‌ల తేదీలు ఇవే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ విద్యాశాఖ మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. 1వ త‌ర‌గ‌తి నుంచి 9వ త‌ర‌గ‌తి వ‌ర‌కు జ‌రిగే వార్షిక ప‌రీక్ష‌ల‌ను వాయిదా వేస్తున్న‌ట్లు విద్యాశాఖ అధికారులు ప్ర‌క‌టించారు.
Telangana Schools Annual Exams Time Table 2024
Telangana Schools Annual Exams Time Table 2024 Pdf

తిరిగి ఈ ప‌రీక్ష‌ల‌ను ఏప్రిల్ 15వ తేదీ నుంచి ఏప్రిల్ 22వ తేదీ వ‌ర‌కు ఎస్ఏ-2 ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హిస్తామ‌ని విద్యాశాఖ అధికారులు తెలిపారు.  అలాగే ఏప్రిల్ 23వ తేదీన ఫ‌లితాలు ప్ర‌క‌టిస్తామ‌న్నారు.  అనంత‌రం ఏప్రిల్ 24వ తేదీ నుంచి అన్ని ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ స్కూళ్ల‌కు వేస‌వి సెల‌వులు ప్ర‌క‌టించ‌నున్నారు. ఏప్రిల్ 24వ తేదీ నుంచి జూన్ 12వ తేదీ వ‌ర‌కు స్కూల్స్‌కు వేస‌వి సెల‌వులు రానున్నాయి. ఈ సారి దాదాపు 50 రోజులు పాటు వేస‌వి సెల‌వులు ఇవ్వ‌నున్నారు.

ప‌రీక్ష‌ల టైమింగ్స్ ఇవే..

ts schools final exam dates 2024

1-7వ త‌ర‌గ‌తి వ‌ర‌కు ఉద‌యం 9 గంట‌ల నుంచి 11:30 గంట‌ల వ‌రకు ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్నారు.  అలాగే 8వ త‌ర‌గ‌తికి ఉద‌యం 9 నుంచి 11:45 గంట‌ల వ‌ర‌కు, 9వ త‌ర‌గ‌తికి ఉద‌యం 9 నుంచి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు నిర్వ‌హించ‌నున్న‌ట్లు అధికారులు పేర్కొన్నారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కూడా 1-9వ త‌ర‌గ‌తి వార్షిక ప‌రీక్ష‌లు ఇలా..

ts students

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 1వ త‌ర‌గ‌తి నుంచి 9వ త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు వార్షిక ప‌రీక్ష‌లను ఏప్రిల్ 6వ తేదీ నుంచి ఏప్రిల్ 19వ తేదీ వ‌ర‌కు నిర్వ‌హించాల‌ని కీల‌క ఆదేశాల‌ను జారీ చేసింది. అలాగే ఈ ప‌రీక్ష‌ల‌కు సంబంధించిన మూల్యాంకనం ఏప్రిల్ 19వ తేదీ నుంచి 21వ తేదీ లోపు జవాబు పత్రాల మూల్యాంకనం చేయాల్సి ఉంటుంది. ఏపిల్ 23వ తేదీన అన‌గా.. చివరి రోజున ప్రోగ్రెస్‌ కార్డులు విద్యార్థులకు అందజేయ‌ల‌న్నారు.

ఏపీ ప‌రీక్షల తేదీలు ఇవే..
ఏపీలో ఏప్రిల్‌ 6వ తేదీన‌ 1–9 తరగతులకు మొదటి లాంగ్వేజ్‌, ఏప్రిల్ 8వ తేదీ 1–5 తరగతులకు ఇంగ్లిష్‌ పార్ట్‌–ఏ, 6వ త‌ర‌గ‌తి నుంచి 9 తరగతులకు సెకండ్‌ లాంగ్వేజ్‌, ఏప్రిల్ 10వ తేదీ 1–5 తరగతులకు ఇంగ్లిష్‌ పార్ట్‌–బీ (టోఫెల్‌), 6 నుంచి 9 తరగతులకు ఇంగ్లిష్‌ పార్ట్‌–ఏ, ఏప్రిల్ 12వ తేదీ 1–5 తరగతులకు గణితం, 6–9 తరగతులకు ఇంగ్లిష్‌ పార్ట్‌–బీ (టోఫెల్‌), 13వ తేదీ 3–5 తరగతులకు ఈవీఎస్‌, 6–9 తరగతులకు గణితం, 15వ తేదీ 3–5 తరగతులకు ఓఎస్‌ఎస్సీ, 6 నుంచి9 తరగతులకు ఫిజికల్‌ సైన్స్‌, 16వ తేదీ 4వ తరగతి విద్యార్థులకు (ఎంపిక చేసిన స్కూళ్లు) స్లాస్‌–2024 పరీక్ష, 6 నుంచి 9 తరగతుల విద్యార్థులకు బయాలజికల్‌ సైన్స్‌, 18న సోషల్‌ పరీక్ష ఉంటుంది. 1–8 తరగతుల విద్యార్థులకు రోజూ ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, 9వ తరగతి విద్యార్థులకు 9 నుంచి 12.15 గంటల వరకు పరీక్ష సమయం కేటాయించారు.

ఏపీలో ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ స్కూళ్లకు సెలవులకు ఏప్రిల్‌ 23వ తేదీన చివ‌రి దినంగా ప్ర‌భుత్వం తెలిపింది. అలాగే ఏప్రిల్ 24వ తేదీ (బుధ‌వారం) నుంచి అన్ని ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ స్కూళ్లకు సెలవులు ఇస్తున్నట్లు ఏపీ విద్యాశాఖ ప్రకటించింది. అన్ని ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ స్కూళ్లకు జూన్ 11వ తేదీ (మంగ‌ళ‌వారం) వరకు వేసవి సెలవులు ఉంటాయి విద్యాశాఖ ప్ర‌క‌టించింది. తిరిగి ఈ స్కూల్స్ జూన్ 12వ తేదీ (బుధ‌వారం)  పున:ప్రారంభం అవుతాయ‌ని ఉత్త‌ర్వుల్లో ప్ర‌భుత్వం పేర్కొంది. ఈ వేర‌కు స్కూళ్ల విభాగం కార్యదర్శి సురేష్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. అంటే స్కూల్స్‌కు దాదాపు 48 రోజులు పాటు సెల‌వులు ఇచ్చారు. ఇప్ప‌టికే టెన్త్ విద్యార్థులకు, ఇంట‌ర్ విద్యార్థుల‌కు వేస‌వి సెల‌వులు ఇచ్చిన విష‌యం తెల్సిందే.

తెలంగాణ‌లో 1-9వ త‌ర‌గ‌తి వ‌ర‌కు ప‌రీక్ష‌ల తేదీ ఇవే..

Published date : 05 Apr 2024 10:31AM
PDF

Photo Stories