Education department: పరీక్షలకు విద్యాశాఖ సన్నద్ధం.. పరీక్ష తేదీలు ఇవే!
మంచిర్యాలఅర్బన్: ఒకటి నుంచి తొమ్మిదో తరగతికి 2023–24 సమ్మెటివ్ అసెస్‌మెంటు(ఎస్‌ఏ)–2 పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ సన్నద్ధమవుతోంది. ఈ నెల 15నుంచి 22వరకు పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఒకటి నుంచి ఏడో తరగతి వరకు ఉదయం 9గంటల నుంచి 11.30గంటల వరకు, ఎనిమిదో తరగతి విద్యార్థులకు ఉదయం 9గంటల నుంచి 11.45గంటల వరకు, రెండు సబ్జెక్టులు ఉన్న రోజు మధ్యాహ్నం 12.30గంటల నుంచి 3.15గంటల వరకు పరీక్షలు ఉంటాయి. తొమ్మిదో తరగతికి ఉదయం 9గంటల నుంచి 12గంటల వరకు, ఈ నెల 20న నిర్వహించే ఫిజికల్ సైన్స్ 9గంటల నుంచి 10.30గంటల వరకు, బయోసైన్స్ 12.30గంటల నుంచి 3.15గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ఒకటి నుంచి ఐదో తరగతి ప్రశ్నపత్రాలు పాఠశాలలకు పంపిణీ చేశారు. ఆరు నుంచి తొమ్మిదో తరగతి ప్రశ్నపత్రాలు మండల పంపిణీ కేంద్రాల్లో అందుబాటులో ఉంచారు. ఎస్‌ఏ–2 టైం టేబుల్‌ను అనుసరించి ఏ రోజు ప్రశ్నపత్రాలు ఆ రోజు సంబంధిత పంపిణీ కేంద్రం నుంచి ఉదయం 8గంటలకు తీసుకెళ్లాలని విద్యాశాఖ అధికారులు సూచించారు. ప్రాథమిక పాఠశాలలకు చెందిన ఒకటి నుంచి ఐదు తరగతుల ప్రశ్నపత్రాలు పాఠశాలల్లో జాగ్రత్తగా భద్రపర్చాలని ఆదేశించారు. ఈ నెల 23న జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తి చేసి విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డులు అందించాల్సి ఉంటుంది.
చదవండి: Intermediate State Topper 2024 S. Nirmala : 2024 ఇంటర్మీడియట్ స్టేట్ టాపర్ S.నిర్మల
పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలి
ప్రశ్నపత్రాల లీకేజీకి పాల్పడినా, మాస్ కాపీయింగ్‌ను ప్రోత్సహించినా ఉపాధ్యాయులు, పాఠశాలల యాజమాన్యాలపై శాఖాపరమైన చర్యలుంటాయి. ప్రైవేట్ పాఠశాలల్లో ప్రశ్నపత్రాల లీకేజీకి పాల్పడితే పాఠశాల గుర్తింపు రద్దు చేస్తాం. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి. అవకతవకలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటాం. పూర్తి సమాచారం కోసం డీసీఈబీ సహాయ కార్యదర్శి 9490092767 నంబరులో సంప్రదించాలి.
– యాదయ్య, డీఈవో
పరీక్షలు ఇలా..
తేదీ | లాంగ్వేజ్ | ||
1నుంచి5 వరకు | 6నుంచి 7వ తరగతి వరకు | 8వ, 9వ తరగతులకు | |
15-04-2024 | తెలుగు, ఉర్దూ | తెలుగు, ఉర్దూ (ఫస్ట్‌లాంగ్వేజ్) ఇతర | తెలుగు లేదా ఉర్దూ ఇతర (ఫస్ట్ లాంగ్వేజ్) |
16-04-2024 | ఇంగ్లిష్ | హిందీ, తెలుగు ఇతర (సెకండ్ లాంగ్వేజ్) | హిందీ, తెలుగు ఇతరత్రా (సెకండర్‌లాంగ్వేజ్) |
18-04-2024 | గణితం | ఇంగ్లిష్ | ఇంగ్లిష్ |
19-04-2024 | ఈవీఎస్ | సోషల్ స్టడీస్ | గణితం |
20-04-2024 | - | జనరల్ సైన్స్ | ఫిజికల్ సైన్స్–బయోసైన్స్ |
22-04-2024 | – | గణితం | సోషల్ స్టడీస్ |