Skip to main content

Tenth Class Public Exams: టెన్త్‌లో వందశాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా ఉపాధ్యాయులు ప్రత్యేక కార్యాచరణ

Tenth Class Public Exams: టెన్త్‌లో వందశాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా ఉపాధ్యాయులు ప్రత్యేక కార్యాచరణ
Tenth Class Public Exams: టెన్త్‌లో వందశాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా ఉపాధ్యాయులు ప్రత్యేక కార్యాచరణ

జనగామ : టెన్త్‌లో వందశాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా ఉపాధ్యాయులు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా అన్నారు. జాతీయ సాధన సర్వేలో జిల్లాకి మంచి ర్యాంక్‌ వచ్చేలా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ ప్రధానోపాధ్యాయులకు జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో ఓరియంటేషన్‌ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. అదనపు కలెక్టర్‌ పింకేష్‌ కుమార్‌తో కలిసి కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా పాల్గొని మాట్లాడుతూ ఈ విద్యాసంవత్సరంలో పదో తరగతి పరీక్ష ఫలితాల్లో జిల్లాలోని అన్ని విద్యాసంస్థల విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించే విధంగా విజయోస్తు కార్యక్రమాన్ని రూపకల్పన చేశామని, దీని ద్వారా ప్రత్యేక ప్రణాళిక ద్వారా ఉపాధ్యాయులు ముందుకు పోవాలన్నారు. ఆ దిశగా హెచ్‌ఎంలు, ఆయా శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. నవంబర్‌ 1వతేదీ నుంచి పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని, డిసెంబర్‌ నెలాఖరు వరకు సిలబస్‌ పూర్తి కావాలన్నారు. వెనకబడిన విద్యార్థులను ఆయా పాఠశాలల్లోని ఉపాధ్యాయులు అడప్షన్‌ తీసుకుని ఏ సబ్జెక్టులో వీక్‌ ఉన్నారో దానిపై ప్రత్యేక తీసుకోవాలన్నారు. జాతీయ సాధన సర్వే పరీక్షలో విద్యార్థులు మంచి ప్రతిభ చూపించే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఈఓ కె.రాము, అసిస్టెంట్‌ కమిషనర్‌ ఫర్‌ గవర్నమెంట్‌ ఎగ్జామ్‌ రవికుమార్‌, జిల్లా ఉమ్మడి పరీక్షల విభాగం సెక్రటరీ జి.చంద్ర భాను, ప్లానింగ్‌ కోఆర్డినేటర్‌ టి.రాజు, బి.శ్రీనివాస్‌, గౌసియా, రామరాజు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:  నిరుద్యోగ యువతక ఉచిత శిక్షణ.. వీళ్లు అర్హులు

సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి

అన్ని సామాజిక వర్గాల విశ్లేషణ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని బీసీ కమిషన్‌ చైర్మన్‌ నిరంజన్‌ తెలిపారు. బుధవారం హైదారాబాద్‌లోని బీసీ కమిషన్‌ కార్యాలయం నుంచి కమిషన్‌ కార్యదర్శి బాలమాయ అధ్యక్షతన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నవంబర్‌ రెండో తేదీన ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని హనుమకొండ కలెక్టరేట్‌లో పార్లమెంట్‌ సభ్యులు, శాసనసభ్యులు పాల్గొనేలా చూడాలని, అందుకు ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలన్నారు. గ్రామాల్లో సామాజిక అర్థిక సర్వే విశ్లేషణపై అవగాహన కల్పించాలన్నారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమాఽధికారి రవీందర్‌, తదితరులు పాల్గొన్నారు.

 

Published date : 24 Oct 2024 03:55PM

Photo Stories