Skip to main content

Teachers Transfers: ఎస్సీ గురుకులాల్లో ‘డిస్‌ లొకేటెడ్‌’ లొల్లి!

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థ (టీజీఎస్‌డబ్ల్యూ ఆర్‌ ఈఐఎస్‌) పరిధిలో జరుగు తున్న ఉద్యోగుల బదిలీలు.. పదోన్నతుల ప్రక్రియ గందర గోళంగా మారింది. ఈ సొసైటీ పరిధిలోని పలు కేడర్‌లలోని ఉద్యోగులకు ఓవైపు పదోన్న తులు కల్పిస్తూనే.. మరోవైపు బదిలీల ప్రక్రియ నిర్వహించేలా సొసైటీ కార్యాచరణ రూ పొందించి అమలుకు ఉపక్రమించింది.
Teachers Transfers

ఈ క్రమంలో బదిలీ లు, పదోన్నతులకు అర్హత పొందిన ఉద్యోగుల జాబి తాను ప్రకటించారు. జీఓ 317 అమలులో భాగంగా పలు వురు ఉద్యోగులను వారు పని చేస్తున్న పరిధిని డిస్‌లొకేట్‌ చేస్తూ కొత్తగా జోన్‌లు, మల్టీజోన్‌లు కేటాయిస్తూ జాబితా విడుదల చేసింది.

డిస్‌లొకేటెడ్‌ జాబితాలో ఉన్న ఉద్యోగులు తక్షణమే బదిలీల కౌన్సెలింగ్‌కు హాజరుకావా లని, లేకుంటే ఖాళీ ల లభ్యతను బట్టి పోస్టింగ్‌ ఇస్తామని స్పష్టం చేసింది. 

చదవండి: Guest Faculty Jobs: గురుకులాల్లో గెస్ట్‌ ఫ్యాకల్టీ ఉద్యోగాలు.. డైరెక్ట్‌ ఇంటర్వ్యూతో నియామకం

దీంతో డిస్‌లొకేటెడ్‌ జాబితాలో ఉన్న ఉద్యోగులు సొసైటీ కార్యాయా నికి చేరుకోవడం.. వారిని డిస్‌లొకేటెడ్‌ జాబితా లోకి తీసుకు రావడంపై ఆందోళనకు దిగడంతో అక్కడ తీవ్ర గందరగోళ వాతావరణం నెలకొంది.

సోమవారం నుంచి మొదలైన ఈ పరిస్థితి జూలై 16న‌ కూడా కొనసాగడంతో డీఎస్‌ఎస్‌ భవన్‌ గురుకుల టీచర్లతో కిక్కిరిసిపోయింది.

చదవండి: Dr VS Alagu Varshini: ప్రతి గురుకులంలో టెలిఫోన్‌!.. విద్యార్థి నేరుగా కార్యదర్శితో మాట్లాడొచ్చు

తారుమారుపై గరంగరం.. 

రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం రాష్ట్రంలో నూతన జోనల్‌ విధా నం అమల్లోకి రావడంతో ఆ దిశగా అన్ని ప్రభుత్వ శాఖలు ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియ చేపట్టాయి. గురుకుల సొసైటీలు కూడా ఆ దిశగా కసరత్తు చేసి 2022 సంవత్సరంలో ఉద్యోగులకు జోన్‌లు, మల్టీ జోన్‌ల కేటాయింపు చేప ట్టాయి.

కానీ విద్యాసంవత్సరం మధ్యలో బోధన, అభ్యసన కార్య క్రమాలకు ఇబ్బందులు తలెత్తు తాయనే భావనతో కేటాయింపుల ప్రక్రియను తాత్కాలికంగా పక్కన పెట్టాయి. 

ప్రస్తుతం గురుకులాలకు కొత్త ఉద్యోగులు వస్తుండడంతో సీనియర్‌ ఉద్యోగులకు బదిలీలు, పదోన్నతులు నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది.

దీంతో ఎస్సీ గురుకుల సొసైటీలో ఉద్యోగుల బదిలీలు, పదోన్నతులు చేపడుతుండగా... జీఓ 317 కింద డిస్‌ లొకేటెడ్‌ అయిన ఉద్యోగులకు కూడా బదిలీలు చేపట్టేందుకు సొసైటీ చర్యలు మొదలు పెట్టింది. 

కానీ డిస్‌లొకేడెట్‌ జాబితాలో ఉన్న ఉద్యోగులు తమకు తీవ్ర అన్యాయం జరిగిందని, ఉద్యోగుల కేటాయింపు సమయంలో తామిచ్చిన ఆప్షన్లకు భిన్నంగా తాజాగా కేటాయింపులు జరిపారని, మరోవైపు సంబంధం లేని జోన్లు ఇవ్వడంతో తమతోపాటు పిల్లల భవిష్యత్‌ తారు మారు అవుతుందని ఆందోళన చేపట్టారు. 

ఈ క్రమంలో కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, వారికి మినహాయింపు ఇచ్చిన సొసైటీ మిగతా ఉద్యోగులకు స్థానచలనం కల్పించింది. ప్రిన్స్‌పాల్, జూనియర్‌ లెక్చరర్, పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్‌ కేటగిరీలో దాదాపు పదోన్నతులు పూర్తి కాగా, ఆయా కేటగిరీల్లో బదిలీలు సైతం దాదాపు పూర్తి చేసినట్టు టీజీఎస్‌ డబ్ల్యూఆర్‌ఈఐఎస్‌ అధికారులు చెబుతున్నారు.

మూడు రోజుల్లో మిగతా కేటగిరీల్లో 

ఎస్సీ గురుకుల సొసైటీ పరిధిలో ప్రిన్సిపాల్, జేఎల్, పీజీటీ కేటగిరీల్లో మెజారిటీ శాతం బది లీలు పూర్తి చేసిన సొసైటీ... టీజీటీ, లైబ్రేరియన్, డిగ్రీ కాలేజీ టీచింగ్‌ స్టాఫ్‌తోపాటు సొసైటీ పరిధిలోని నాన్‌ టీచింగ్‌ ఉద్యోగులకు బదిలీలు, పదోన్నతులు చేపట్టాల్సి ఉంది. బదిలీల ప్రక్రియ ఈనెల 20వ తేదీ నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం డెడ్‌లైన్‌ విధించింది. 

కానీ ఆలోపు అన్ని కేట గిరీల్లో బదిలీల ప్రక్రియ పూర్తవుతుందా అన్న సందేహం అధికారుల్లో నెలకొంది. ఎక్కువ కేటగిరీలు ఉండడంతో రాత్రింబవళ్లు పూర్తి చేసేందుకు సైతం అధికారులు సిద్ధమవుతున్నారు. గతవారం రోజులుగా పగటిపూట మాత్రమే కాకుండా రాత్రి పొద్దు పోయేవరకు కూడా సొసైటీ అధికారులు బదిలీలు, పదోన్నతుల కసరత్తు సాగిస్తుండడం గమనార్హం.

Published date : 17 Jul 2024 12:12PM

Photo Stories