Skip to main content

Telangana: ప్ర‌భుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో బోధన.. ‘‘మన ఊరు – మన బడి’’ ప్రణాళిక కోసం..!

సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన జ‌న‌వ‌రి 17వ తేదీన‌ జరిగిన తెలంగాణ కేబినెట్‌ కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు
తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు

ముఖ్యంగా రాష్ట్రంలోని ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణ, ప్రభుత్వ పాఠశాలల్ని బలోపేతం చేసే దిశగా కొత్త చట్టం తీసుకురావాలని టీ కేబినెట్ నిర్ణయించింది. 

ఇంగ్లీష్ మీడియంలో విద్యా బోధన..
వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం లో విద్యా బోధన, ప్రైవేట్‌ స్కూల్స్‌, జూనియ‌ర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీల్లో ఫీజుల నియంత్రణ.. ఈ రెండు అంశాల పై పూర్తి అధ్యయనం చేసి సంబంధిత విధి విధానాలను రూపొందించేందుకు కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది.  తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన...మంత్రులు కొప్పుల ఈశ్వర్, తలసాని శ్రీనివాస యాదవ్, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, జగదీశ్ రెడ్డి, హరీశ్ రావు, ప్రశాంత్ రెడ్డి , పువ్వాడ అజయ్ కుమార్, ఎర్రబెల్లి దయాకర్ రావు, కేటిఆర్ లు ఈ సబ్ కమిటీలో సభ్యులుగా ఉంటారు.

మన ఊరు – మన బడి..
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలని కేబినెట్ నిర్ణయించింది. పాఠశాలల్లో నాణ్యమైన విద్యాబోధన, పాఠశాలల్లో మెరుగైన మౌలిక వసతుల కల్పన కోసం రూ. 7289 కోట్ల తో ...‘‘మన ఊరు – మన బడి’’ ప్రణాళిక  కోసం కేబినెట్ ఆమోదం తెలిపింది.  రానున్న శాసన సభా సమావేశాల్లో దీనికి సంబంధించిన నూతన చట్టాన్ని తీసుకురావాలని కేసీఆర్‌ సర్కార్‌ భావిస్తోంది.

Breaking News: తెలంగాణలో విద్యాసంస్థల సెలవులు పొడిగింపు.. ఇక ఏపీలో అయితే.. ?

Breaking News: జనవరి 31 వరకు సెలవులు.. తెలుగు రాష్ట్రాల్లో..?

Omicron & Covid effect: కల్లోలం..జనవరి 31వ తేదీ వ‌ర‌కు పాఠశాలలు సెల‌వులు

Holidays: జూనియ‌ర్ కాలేజీల‌కు సెల‌వులు

Telangana: జ‌న‌వ‌రి 8 నుంచి 16 వరకు విద్యాసంస్థలకు సెలవులు

విద్యాసంస్థలకు మళ్లీ రెండు వారాలు సెలవులు ఇచ్చే అవ‌కాశం..ఎందుకంటే..?

Omicron Effect: రేప‌టి నుంచి స్కూల్స్‌, కాలేజీలకు సెల‌వులు..కార‌ణం ఇదే..

Omicron Breaking News : ఇప్పట్లో స్కూళ్లు తెరిచేదే లే..!

Holidays: స్కూళ్లకు సెలవులు

Covid-19 Effect: జనవరి 26 వరకు స్కూళ్లు, కాలేజీలు బంద్‌

Audimulapu Suresh: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో విద్యాసంస్థలకు సెలవులు పొడిగించ‌డం లేదు..కార‌ణం ఇదే..

Published date : 17 Jan 2022 07:00PM

Photo Stories