ఎచ్చెర్ల క్యాంపస్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో 99 ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు రిజిస్ట్రార్ సీహెచ్‌ఏ ఎ.రాజేంద్ర ప్రసాద్ తెలిపారు.
99 పోస్టులకు త్వరలో నోటిఫికేషన్
వర్సిటీ పరిపాలన కార్యాలయంలో అక్టోబర్ 17న వివరాలు వెల్లడించారు. ఉన్నత విద్యాశాఖ, ఉన్నత విద్యామండలి ఆదేశాల మేరకు పాలక మండలి, అకడమిక్ సెనేట్, బోర్డ్ ఆఫ్ స్టడీస్‌ల్లో చర్చించి అనంతరం నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు చెప్పారు. నియామక ప్రక్రియలో రిజర్వేషన్ రోస్టర్ పక్కాగా అమలు ఉంటుందని తెలిపారు. నోటిఫికేషన్ విడుదలకు సంబంధించి కసరత్తు చివరి దశకు చేరిందని వివరించారు.