Skip to main content

APPSC Group 2 Exam : ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 ప‌రీక్ష‌ల వాయిదాపై హైకోర్టు వ్యాఖ్య‌లు..

High court judgement on appsc group 2 postpone

సాక్షి, అమరావతి: గ్రూప్-2 పరీక్షలు నిలుపుదల సాధ్యం కాదని హైకోర్టు తెలిపింది. హరిజాంటల్ రిజర్వేషన్‌పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ తదుపరి చర్యలు నిలుపుదల చేయాలని దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు.. గురువారం విచారణ జరిపింది. పరీక్ష జరగకుండా ఉంటే అర్హులైన అభ్యర్థుల ప్రయోజనాలు ప్రమాదంలో పడతాయన్న కోర్టు.. ప్రధాన పరీక్షకి 92,250 మంది అర్హత సాధించారని పేర్కొంది.

Women Of The Year: 'ఉమెన్ ఆఫ్‌ ది ఇయర్‌' జాబితాలో భారతీయ మహిళకు చోటు..!

వీరిలో హారిజాంటల్ రిజర్వేషన్ అభ్యంతరంపై ఇద్దరు మాత్రమే కోర్టుకు వచ్చారన్న న్యాయస్థానం.. పరీక్ష నిలుపుదల చేయటం కుదరదని స్పష్టం చేసింది. పూర్తి వివరాలతో 10 రోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ మార్చి 11కి వాయిదా వేసింది.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 22 Feb 2025 10:35AM

Photo Stories