Women Of The Year: 'ఉమెన్ ఆఫ్ ది ఇయర్' జాబితాలో భారతీయ మహిళకు చోటు..!

ఫిబ్రవరి 20వ తేదీ విడుదల చేసిన ఈ జాబితాలో భారతీయ జీవశాస్త్రవేత్త, వన్యప్రాణులు సంరక్షణాధికారి 45 ఏళ్ల పూర్ణిమా దేవి బర్మాన్ నిలిచింది.
అసోంలోని బ్రహ్మపుత్ర నది ఒడ్డున పెరిగిన పూర్ణిమా, పక్షులంటే చాలా ఇష్టం ఉండే వ్యక్తి. చిన్నప్పటి నుంచి పక్షుల గమనాలను పరిశీలిస్తూ, ఆమె జంతుశాస్త్రంలో పీహెచ్‌డీ చేసిన తర్వాత, గ్రేటర్ ఆజిటెంట్ జాతి కొంగలు పెరుగుతున్న ప్రమాదాన్ని చూసి వాటి సంరక్షణకు కృషి చేసింది.
Gyanesh Kumar: సీఈసీగా బాధ్యతలు స్వీకరించిన జ్ఞానేశ్ కుమార్
హర్గిల ఆర్మీని ఏర్పరచి, గ్రామీణ మహిళలతో కలిసి కొంగల సంరక్షణ కార్యక్రమాలను చేపట్టింది. గ్రామాల్లో పక్షుల విలువ గురించి ప్రజలకు అవగాహన కల్పించి, పక్షుల గూళ్లు నిర్మించడం, వారి నివాసానికి అనువైన వాతావరణం ఏర్పరచడం, అలాగే పక్షుల సంరక్షణ కార్యక్రమాలను ప్రారంభించింది. ‘హర్గిల ఆర్మీ’ ద్వారా పక్షులను కాపాడడమే కాకుండా, గ్రామీణ మహిళలకు జీవనోపాధి కూడా కల్పించింది.
ఈ కృషి, పక్షుల సంరక్షణలో ఆమె చేసిన వ్యవస్థీకృత అవగాహన, పర్యావరణ మార్పులపై ప్రభావం చూపడాన్ని గుర్తించి టైమ్స్ ఈ ఏడాది ఉమెన్ ఆఫ్ ది ఇయర్ జాబితాలో ఆమెను చేర్చింది. పూర్ణిమా బర్మాన్ భారతదేశంలో పర్యావరణం, పక్షుల సంరక్షణకు చేసిన కృషి వల్ల ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది.
Neelakanta Bhanu: ఫోర్బ్స్ అండర్ 30 జాబితాలో భాంజు వ్యవస్థాపకుడు