Etikoppaka Tableau: ఏటికొప్పాక బొమ్మల శకటానికి జ్యూరీ అవార్డు
Sakshi Education
భారతదేశ రాజధాని ఢిల్లీలో జరిగిన 76వ రిపబ్లిక్ డే పరేడ్‌లో భాగంగా ప్రదర్శించిన శకటాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ శకటానికి కేంద్ర ప్రభుత్వం జ్యూరీ అవార్డు ప్రకటించింది.

ఆంధ్రప్రదేశ్‌లోని చేతి వృత్తుల కళా ప్రాముఖ్యత చాటుతూ, రాష్ట్ర వారసత్వ సంప్రదాయానికి ప్రతీకగా ఉన్న ఏటి కొప్పాక బొమ్మలతో రూపొందించి, ప్రదర్శించిన శకటానికి ఈ అవార్డు లభించింది. 30 ఏళ్ల తర్వాత దేశ రాజధానిలో జరిగే గణతంత్ర దినోత్సవాల్లో ప్రదర్శించే శకటానికి ఆవార్డు లభించిందని ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది.
Republic Day: కన్నుల పండువగా గణతంత్ర వేడుకలు.. నేటి హైలైట్స్ ఇవే..
Published date : 31 Jan 2025 09:32AM