BCCI Awards: సచిన్‌కు బీసీసీఐ 'జీవిత సాఫల్య' పురస్కారం.. మరో అవార్డుతో మెరిసిన బూమ్రా, మంధాన..

ముంబైలో ఫిబ్రవరి 1వ తేదీ జరిగిన బీసీసీఐ వార్షిక అవార్డుల కార్యక్రమంలో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) అధ్యక్షుడు జై షా చేతుల మీదుగా సచిన్ ఈ పురస్కారాన్ని అందుకున్నాడు. క్రికెట్‌లో దేశానికి అందించిన విశేష సేవలకు గుర్తింపుగా భారత తొలి కెప్టెన్ కల్నల్ నీకే నాయుడు పేరు మీదుగా 1994 నుంచి ఈ 'లైఫ్టైమ్ అచీవ్మెంట్' అవార్డును ప్రదానం చేస్తున్నారు.
అదే విధంగా.. గతేడాది అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన క్రికెటర్లకు ఈ సందర్భంగా పురస్కారాలు అందజేశారు. పురుషుల ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్ విభాగంలో పేస్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah)కు అవార్డు దక్కింది. అన్ని ఫార్మాట్లలోనూ గతేడాది అద్బుతమైన ప్రదర్శన కనబరిచిన బుమ్రాకు బీసీసీఐ ‘పాలీ ఉమ్రిగర్ బెస్ట్ క్రికెటర్’ అవార్డు అందజేసింది.
మహిళల క్రికెట్‌లో.. స్మృతి మంధానకు ‘పాలీ ఉమ్రిగర్ బెస్ట్ క్రికెటర్' దక్కింది. ఇక భారత లెజెండరీ స్పిన్నర్, ఇటీవలే రిటైర్మెంట్ ప్రకటించిన రవిచంద్రన్ అశ్విన్‌ను ప్రత్యేక పురస్కారంతో బీసీసీఐ సత్కరించింది. మూడు ఫార్మాట్లలో కలిపి 765 వికెట్లు తీసిన అశూ సేవలకు గుర్తింపుగా అవార్డు అందజేసింది.
ICC Awards: ఐసీసీ మెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా బుమ్రా.. తొలి భారత పేసర్‌గా రికార్డు
ఈ కార్యక్రమంలో మొత్తంగా 26 మంది క్రికెటర్లు పురస్కారాలు అందుకున్నారు.
బీసీసీఐ నమన్ అవార్డులు-2025: విజేతల పూర్తి జాబితా
1. జగ్మోహన్ దాల్మియా ట్రోఫీ: 2023-24 ఉత్తమ మహిళా క్రికెటర్ (జూనియర్ డొమెస్టిక్) [పతకం] - ఈశ్వరి అవసరే
2. జగ్మోహన్ దాల్మియా ట్రోఫీ: 2023-24 ఉత్తమ మహిళా క్రికెటర్ (సీనియర్ డొమెస్టిక్) (సీనియర్ మహిళల వన్డే) [పతకం] - ప్రియా మిశ్రా
3. జగ్మోహన్ దాల్మియా ట్రోఫీ: 2023-24లో విజయ్ మర్చంట్ ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ (అండర్-16) [పతకం] - హేమచుదేశన్ జగన్నాథన్
4. జగ్మోహన్ దాల్మియా ట్రోఫీ: 2023-24లో విజయ్ మర్చంట్ ట్రోఫీలో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడు (U-16) [పతకం] - లక్ష్య రాయచందనీ
5. M.A. చిదంబరం ట్రోఫీ: 2023-24లో కూచ్ బెహార్ ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్(U-19) [పతకం] - విష్ణు భరద్వాజ్
6. M.A. చిదంబరం ట్రోఫీ: 2023-24లో కూచ్ బెహార్ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ (U-19) [పతకం] - కావ్య టియోటియా
7. M.A. చిదంబరం ట్రోఫీ: 2023-24లో కల్నల్ CK నాయుడు ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసిన క్రికెటర్ (U-23) - ప్లేట్ గ్రూప్ [పతకం] - నీజెఖో రూపేయో
8. M.A. చిదంబరం ట్రోఫీ: 2023-24లో కల్నల్ CK నాయుడు ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ (U-23) - ఎలైట్ గ్రూప్ [పతకం] - పి. విద్యుత్
9. M.A. చిదంబరం ట్రోఫీ: 2023-24లో కల్నల్ CK నాయుడు ట్రోఫీలో అత్యధిక పరుగులు (U-23) - ప్లేట్ గ్రూప్ [పతకం] - హేమ్ చెత్రి
10. M.A. చిదంబరం ట్రోఫీ: 2023-24లో కల్నల్ CK నాయుడు ట్రోఫీలో అత్యధిక పరుగులు (U-23) - ఎలైట్ గ్రూప్ [పతకం] - అనీష్ కేవీ
11. మాధవరావు సింధియా అవార్డు: 2023-24లో రంజీ ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ - ప్లేట్ గ్రూప్ [పతకం] - మోహిత్ జంగ్రా
12. మాధవరావు సింధియా అవార్డు: 2023-24లో రంజీ ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ - ఎలైట్ గ్రూప్ [పతకం] - తనయ్ త్యాగరాజన్
13. మాధవరావు సింధియా అవార్డు: 2023-24లో రంజీ ట్రోఫీలో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడు - ప్లేట్ గ్రూప్ [పతకం] - అగ్ని చోప్రా
14. మాధవరావు సింధియా అవార్డ్: 2023-24లో రంజీ ట్రోఫీలో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడు - ఎలైట్ గ్రూప్ [పతకం] - రికీ భుయ్
15. దేశీయ పరిమిత ఓవర్ల పోటీలలో ఉత్తమ ఆల్ రౌండర్‌గా లాలా అమర్‌నాథ్ అవార్డు, 2023-24 [పతకం] - శశాంక్ సింగ్
16. రంజీ ట్రోఫీ 2023-24 లో ఉత్తమ ఆల్ రౌండర్‌గా లాలా అమర్‌నాథ్ అవార్డు [పతకం]- తనుష్ కోటియన్
17. దేశీయ క్రికెట్‌లో ఉత్తమ అంపైర్, 2023-24 [ట్రోఫీ] - అక్షయ్ టోట్రే
18. 2023-24 బీసీసీఐ దేశీయ టోర్నమెంట్‌లలో అత్యుత్తమ ప్రదర్శన - ముంబై క్రికెట్ అసోసియేషన్
19. 2023-24 మహిళల వన్డేలలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ [పతకం] - దీప్తి శర్మ
20. 2023-24 మహిళల వన్డేలలో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్ [పతకం] - స్మృతి మంధాన
21. ఉత్తమ అంతర్జాతీయ అరంగేట్రం - మహిళలు [ట్రోఫీ] - ఆశా శోభన
22. ఉత్తమ అంతర్జాతీయ అరంగేట్రం - పురుషులు [ట్రోఫీ] - సర్ఫరాజ్ ఖాన్
23. ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్ - మహిళలు [ట్రోఫీ] - స్మృతి మంధాన
24. పాలీ ఉమ్రిగర్ అవార్డు: ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్ - పురుషులు [ట్రోఫీ] - జస్‌ప్రీత్ బుమ్రా
25. బీసీసీఐ ప్రత్యేక అవార్డు [షీల్డ్] - రవిచంద్రన్ అశ్విన్
26. కల్నల్ CK నాయుడు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు [షీల్డ్] - సచిన్ టెండూల్కర్.
Arshdeep Singh: ‘టి20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’గా ఎంపికైన అర్ష్‌దీప్
Tags
- BCCI Awards
- Lifetime Award for Sachin Tendulkar
- BCCI Naman Awards
- CK Nayudu Lifetime Achievement Award
- Sachin Tendulkar awards
- Best International Cricketer
- ICC chairman Jay Shah
- Jasprit Bumrah
- Smriti Mandhana
- Best International Cricketer Awards
- Sachin Tendulkar
- Jagmohan Dalmiya Trophy
- C.K. Nayudu Lifetime Achievement Award
- M.A. Chidambaram Trophy
- Madhavrao Scindia Award
- Polly Umrigar Award
- Sarfaraz Khan
- Asha Sobhana
- BCCI Lifetime Achievement Award
- Sakshi Education News