Chandrika Tandon: భారత సంతతి గాయని చంద్రికకు గ్రామీ అవార్డు
Sakshi Education
ప్రపంచ సంగీత రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘గ్రామీ’ అవార్డును భారత సంతతికి చెందిన అమెరికన్ గాయని, వ్యాపారవేత్త చంద్రికా టాండన్ అందుకున్నారు.

చంద్రికా టాండన్ రూపొందించిన ‘త్రివేణి’ ఆల్బమ్ బెస్ట్ న్యూ ఏజ్ యాంబియంట్ ఆర్ చాంట్ ఆల్బమ్‌గా అవార్డు దక్కించుకుంది. ఆమెకు గతంలో కూడా గ్రామీ అవార్డ్ వరించింది. లాస్ ఏంజెలెస్‌లోని క్రిప్టో డాట్ కామ్ అరెనాలో ఫిబ్రవరి 3వ తేదీ గ్రామీ 67వ ఎడిషన్ ఉత్సవం జరిగింది.
చంద్రికా టాండన్ ప్రముఖ బిజినెస్ లీడర్, పెప్సికో సీఈవో ఇంద్రా నూయీకి స్వయానా తోబుట్టువు కావడం విశేషం. చెన్నైలోని తమిళ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిపెరిగిన చంద్రికా టాండన్ 2009లో తొలిసారిగా విడుదల చేసిన ‘సోల్ కాల్’ మ్యూజిక్ ఆల్బమ్ 2011లో గ్రామీ అవార్డును గెలుచుకున్నారు. చంద్రికా టాండన్, కెల్లర్‌మన్, మట్సుమొటోలతో కలిసి రూపొందించిన త్రివేణి ఆల్బమ్ 2024 ఆగస్ట్‌లో విడుదలైంది.
Padma Awards 2025: ‘పద్మ’ అవార్డులను ప్రకటించిన కేంద్రం.. ఈ ఏడాది ‘పద్మ’ అవార్డు గ్రహీతలు వీరే..!
Published date : 04 Feb 2025 03:34PM