Department of Health: కాంట్రాక్ట్ ఉద్యోగులు ఇక రెగ్యులర్
దీంతో జిల్లా వైద్యారోగ్య శాఖలో కాంట్రాక్ట్ విధానంలో వివిధ క్యాడర్లలో పనిచేస్తున్న 124 మంది ఉద్యోగుల సర్వీసులు రెగ్యులర్ అయ్యాయి. ఈ అంశంపై గత ఏడాది డిసెంబర్‌లో కేబినెట్‌లో తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి గురువారం జీఓ జారీ చేశారు. ప్రభుత్వ తాజా నిర్ణయంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
చదవండి: Management Trainee Jobs: ఇంజనీర్స్ ఇండియన్ లిమిటెడ్ లో 43 పోస్టులు.. నెలకు రూ. 60వేల వేతనం
జిల్లాలో వైద్యారోగ్య శాఖలో మొత్తం 238 మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల ధ్రువీకరణ పత్రాల స్వీకరణను చేపట్టగా, ఇందులో 177 మంది మాత్రమే పత్రాలను సక్రమంగా అప్‌లోడ్ చేశారు. వీరిలో హెల్త్ అసిస్టెంట్లు 107 మంది, ల్యాబ్ టెక్నీషియన్లు–05, ఫార్మసిస్టులు – 04 మందితో పాటు 8 మంది ఏఎన్‌ఎంలను రెగ్యులర్ చేస్తూ జీఓ జారీ అయ్యింది.
మరో 53 మంది పత్రాలను హోల్డ్‌లో ఉంచారు. సరైన పత్రాలు సమర్పించిన అనంతరం వీరి సర్వీసును కూడా రెగ్యులర్ చేసే అవకాశాలున్నాయని వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు.