PM Internship Scheme: నిరుద్యోగ యువతకు వరం పీఎంఐఎస్.. చివరి తేదీ ఇదే..
Sakshi Education
కరీంనగర్ అర్బన్: నిరుద్యోగ యువతకు ప్రధానమంత్రి ఇ–ఇంటర్న్‌షిప్ వరంగా మారింది.
ఇటీవల కేంద్ర ప్రభుత్వం సదరు విధానాన్ని ప్రకటించగా దరఖాస్తు చేసేందుకు నవంబర్ 15 చివరి తేదీ. 21–24 ఏళ్ల మధ్య వయసు గలవారు అర్హులు కాగా కుటుంబంలో ఎవరూ ప్రభుత్వ ఉద్యోగి ఉండకూడదని జిల్లా పరిశ్రమల కేంద్రం జీఎం తెలిపారు.
10వ తరగతి, 12వ తరగతి, ఐటీఐ, పాలిటెక్నిక్, డిప్లొమా, డిగ్రీ చేసినవారు అర్హులని వివరించారు. కుటుంబ సంవత్సర ఆదాయం రూ.8లక్షలలోపు ఉండాలని, కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా ఇంటర్న్‌షిప్‌కు అర్హులని పేర్కొన్నారు. వివరాలకు టోల్‌ఫ్రీ నంబర్ 1800116090ను సంప్రదించాలని కోరారు.
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |
Published date : 15 Nov 2024 05:03PM