శాంతినగర్: పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు, ఆంగ్లం బోధించేందుకు గాను గెస్ట్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తులు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపల్ డా.అరుణాబాయి సెప్టెంబర్ 5న ఒక ప్రకటనలో తెలిపారు.
అతిథి అధ్యాపకుల పోస్టులకు దరఖాస్తులు
పీజీలో ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం, ఇతరులు 55 శాతం ఉత్తీర్ణత కలిగి ఉండాలని, పీహెచ్‌డీ/నెట్/ సెట్ అర్హత కలిగిన వారికి పోస్టుల్లో ప్రాధాన్యత ఉంటుందన్నారు. సెప్టెంబర్ 11 సోమవారం సాయంత్రం 4.30 గంటలలోపు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. 12న కళాశాలలో ఇంటర్వ్యూలు ఉంటాయని పేర్కొన్నారు.