Skip to main content

Govt Junior College: అతిథి అధ్యాపక పోస్టులకు ఆహ్వానం

guest faculty jobs in govt junior college andhra pradesh

కోటవురట్ల : స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో అతిథి అధ్యాపకుల పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ప్రిన్సిపాల్‌ పి.కొండబాబు తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఎంపీహెచ్‌డబ్ల్యు(ఎఫ్‌), జీఎఫ్‌సీ పోస్టులకు సంబంధించి ఒక్కొక్కటి ఖాళీ ఉన్నాయని, ఆసక్తి ఉన్న వారు దరఖాస్తు చేయాలని సూచించారు. ఎంపీహెచ్‌డబ్ల్యు(ఎఫ్‌) పోస్టుకు బీఎస్‌సీ నర్సింగ్‌, జీఎఫ్‌సీ పోస్టుకు ఎంఏ ఎకనమిక్స్‌, ఎంఏ రూరల్‌ డెవలప్‌మెంట్‌ సబ్జెక్టుల్లో 50 శాతం పైబడి మార్కులు పొందిన వారు అర్హులుగా తెలిపారు. అసక్తి ఉన్న అభ్యర్థులు తమ అర్హత ధ్రువ పత్రాలతో ఆగస్టు 4వ తేదీ ఉదయం 10 గంటలకు కళాశాలకు హాజరు కావాలని సూచించారు. ఎంపికై న అభ్యర్థులకు గౌరవ వేతనంగా రూ.10 వేలు అందిస్తారని తెలిపారు.

చ‌ద‌వండి: JNTU Anantapur: సెప్టెంబర్‌ 20 నుంచి ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం


రాంబిల్లి: లాలంకోడూరు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో అతిథి అధ్యాపకుడు పోస్టు భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని ప్రిన్సిపాల్‌ నాయుడు తెలిపారు. ఎంఎస్సీ కెమిస్ట్రీ చదివి 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఽసెప్టెంబరు 5వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. నెలకు రూ.10వేలు వేతనం చెల్లించడం జరుగుతుందన్నారు. మరిన్ని వివరాలకు కళాశాల కార్యాలయంలో సంప్రదించాలని ప్రిన్సిపాల్‌ సూచించారు.

Published date : 01 Sep 2023 04:01PM

Photo Stories