Guest Faculty Jobs : గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు.. ఇంటర్వ్యూ తేదీ!
అనంతపురం: ఉమ్మడి జిల్లాలోని ఏపీ సాంఘిక సంక్షేమ (అంబేడ్కర్) గురుకుల పాఠశాలల్లో 2024–25 విద్యా సంవత్సరానికి ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను గెస్ట్ ఫ్యాకల్టీతో భర్తీ చేయనున్నట్లు గురుకుల పాఠశాలల జిల్లా కో-ఆర్డినేటర్ అంగడి మురళీకృష్ణ తెలిపారు. మంగళవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. టీజీటీ పోస్టుకు.. డిగ్రీ, బీఎడ్, టెట్, పీజీటీ పోస్టుకు.. పీజీ, బీఎడ్, టెట్, పీఈటీ, పీడీ పోస్టులకు.. బీపీడీ చేసిన వారు అర్హులని పేర్కొన్నారు. ఇంగ్లీష్ మీడియంలో టీచింగ్ అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఆసక్తి గలవారు అన్ని సర్టిఫికెట్లతో ఈనెల 26న కురుగుంట పాఠశాలలో జరిగే ఇంటర్వ్యూ, డెమోకు హాజరుకావాలని కోరారు. బాలుర పాఠశాలలకు పురుష అభ్యర్థులు, బాలికల పాఠశాలలకు మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులని స్పష్టం చేశారు.
Apprenticeship Fair: 25న అప్రెంటిస్‌షిప్ మేళా
ఉపాధ్యాయ ఖాళీలు ఇలా..
మలుగూరు (బాలుర) పాఠశాలలో.. టీజీటీ హిందీ, పీజీటీ ఇంగ్లిష్, పీఈటీ, తిమ్మాపురం (బాలికలు) పాఠశాలలో.. టీజీటీ సైన్స్, టీజీటీ గణితం, పీజీటీ గణితం, పీజీటీ జీవశాస్త్రం, పీడీ, కణేకల్లు (బాలుర) పాఠశాలలో.. జేఎల్ గణితం, నల్లమాడ (బాలికలు) పాఠశాలలో.. టీజీటీ ఫిజికల్ సైన్స్, టీజీటీ హిందీ, జేఎల్ ఇంగ్లీష్, జేఎల్ హిస్టరీ, పీఈటీ, బి.పప్పూరు (బాలురు) పాఠశాలలో.. టీజీటీ ఫిజికల్ సైన్స్, టీజీటీ హిందీ, అమరాపురం (బాలికలు) పాఠశాలలో.. టీజీటీ హిందీ, టీజీటీ సోషల్, పీజీటీ ఇంగ్లిష్, పీజీటీ గణితం, హిందూపురం (బాలికలు) పాఠశాలలో.. టీజీటీ ఫిజికల్ సైన్స్, రొళ్ల (బాలురు) పాఠశాలలో.. టీజీటీ ఫిజికల్ సైన్స్, హిందూపురం (బాలురు) పాఠశాలలో.. టీజీటీ ఫిజికల్ సైన్స్, టీజీటీ జీవశాస్త్రం, టీజీటీ హిందీ, పీజీటీ ఇంగ్లిష్.
Tags
- Teacher jobs
- Guest Faculty jobs
- Job Interviews
- Gurukul schools
- teacher posts at gurukul schools
- Applications
- July 26
- new academic year
- school teachers
- Subject Teachers
- certificate verification
- english medium
- english medium teaching
- Education News
- Anantapuram
- GurukulaSchools
- AngadiMuralikrishna
- APSocialWelfare
- AmbedkarGurukulaSchools
- VacantTeachingPosts
- GuestFaculty
- AcademicYear2024_25
- TeachingRecruitment
- EducationUpdates
- teacher jobpositions
- latest jobs in 2024
- sakshieducation latest job notifications in 2024
- guest facultyposts