Skip to main content

Guest Faculty Posts: డిగ్రీ కాలేజీల్లో గెస్ట్‌ లెక్చరర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

Guest Faculty Posts

ఏటూరునాగారం: మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఖాళీగా ఉన్న తెలుగు, రాజనీతి శాస్త్రం, కంప్యూటర్స్‌ అప్లికేషన్స్‌ సబ్జెక్టులలో బోధించేందుకు అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ చిన్న  ఒక ప్రకటనలో తెలిపారు.

పీజీలో జనరల్‌ కేటగిరి వారికి, ఓబీసీ కేటగిరి వారికి 55శాతం మార్కులు, ఎస్సీ, ఎస్టీలకు 50శాతం మార్కులు సాధించినవారు అర్హులని పేర్కొన్నారు. జూలై 2వ తేదీ వరకు అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చని సూచించారు.

Teacher Transfers: పూర్తయిన టీచర్ల పదోన్నతులు, బదిలీలు.. అడ్డంకిగా మారిన రేషనలైజేషన్‌ నిబంధనలు

పీహెచ్‌డీ, నెట్‌, సెట్‌ అభ్యర్థులకు ఎంపికలో ప్రాధాన్యత ఉంటుందని, ఎంపిక కోసం ఇంటర్వ్యూ, డెమో క్లాస్‌ నిర్వహించబడుతుందని వివరించారు. ఇంటర్వ్యూ, డెమో తేదీలు అభ్యర్థులకు ఫోన్ల ద్వారా తెలియజేయనున్నట్లు వెల్లడించారు. వివరాలకు సెల్‌ నంబర్‌ 9866560840లో సంప్రదించాలని తెలిపారు.
 

Published date : 02 Jul 2024 05:58PM

Photo Stories