Dr BR Ambedkar Gurukulam: గెస్ట్ ఫ్యాకల్టీలకు దరఖాస్తుల ఆహ్వానం
Sakshi Education
కంచరపాలెం(విశాఖ): విశాఖ, అనకాపల్లి జిల్లాల్లోని డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ గురుకులాల్లో గెస్ట్‌ఫ్యాక ల్టీగా పనిచేసేందుకు అర్హులైన మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ఉమ్మడి జిల్లాల సమన్వయకర్త ఎస్.రూపవతి ఓ ప్రకటనలో కోరారు.
గెస్ట్ ఫ్యాకల్టీలకు దరఖాస్తుల ఆహ్వానం
జే ఎల్–ఇంగ్లిష్, టీజీటీ–ఫిజికల్ సైన్స్, జేఎల్–జువాలజీ, టీజీటీ–బయలాజికల్ సైన్స్, పీజీటీ–సోషల్ సబ్జెక్టు పోస్టులను భర్తీ చేస్తామన్నారు. ఆసక్తి ఉన్న వారు తమ ఒరిజినల్, నకలు, ధ్రువీకరణపత్రాలతో 28వ తేదీ సోమవారం ఉదయం 10 గంటలకు కొమ్మాదిలోని డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ గురుకులం సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో నిర్వహించే డెమోకి హాజ రు కావాలని సూచించారు.
సంబంధిత సబ్టెక్ట్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్, బీఈడీ కలిగి ఉండాలి. టెట్ అర్హత సాధించిన వారికి ప్రాధాన్యమిస్తామన్నారు. మరిన్ని వివరాలకు 0891–2799641లో సంప్రదించవచ్చు.