Skip to main content

Govt Degree College: డిగ్రీ కాంట్రాక్ట్‌ అధ్యాపకులకు Good News

మద్దిలపాలెం: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ అధ్యాపకులను 2023–24 విద్యా సంవత్సరానికి రెన్యూవల్‌ చేస్తూ ప్రాంతీయ విద్యా సంయుక్త సంచాలకుడు ఆదేశాలు జారీ చేసినట్లు నోడల్‌ ఐడీ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఐ.విజయబాబు తెలిపారు.
degree contract faculty
degree contract faculty

2022–23 మార్చి 31వ తేదీ వరకు కాంట్రాక్ట్‌ అధ్యాపకులుగా పని చేసిన వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులన్నారు. పూర్తి చేసిన దరఖాస్తులను ఆయా డిగ్రీ కళాశాల్లో ఈ నెల 19వ తేదీ సాయంత్రం 5 గంటల్లో సమర్పించాలని సూచించారు. ఆ దరఖాస్తులను 21లోగా జిల్లా ఐడీ కళాశాల ప్రిన్సిపాల్‌కు అందజేయాలని.. జిల్లా సెలక్షన్‌ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 23న కౌన్సెలింగ్‌ నిర్వహిస్తామన్నారు. రెన్యువల్‌ అయిన కాంట్రాక్ట్‌ అధ్యాపకులు ఈ నెల 24న ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుందన్నారు.

Also read: ITI Job Mela 2023: August 18న వెంకటగిరిలో జాబ్‌ మేళా

Published date : 17 Aug 2023 06:09PM

Photo Stories