CBRT Exams: సీబీఆర్టీ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి
ఆగష్టు 1న కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో సంబంధిత శాఖల అధికారులతో అదనపు కలెక్టర్ సమన్వయ సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఈనెల 05 నుంచి 17వ తేదీ వరకు పరీక్షలు కొనసాగనున్నాయని యాదిరెడ్డి తెలిపారు. పరీక్షల నిర్వహణ కోసం జిల్లా కేంద్రంలోని అర్సపల్లి వద్ద గల ఏవీ ఎంటర్ ప్రైజెస్ (నాలెడ్జి పార్క్ ఇంటర్నేషనల్ స్కూల్), ఆర్మూర్ మండలం చేపూర్ వద్ద గల క్షత్రియ ఇంజనీరింగ్ కాలేజీలలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటుచేశామన్నారు. మూడు షిఫ్టు లలో పరీక్షలు కొనసాగుతాయని, మూడు షిఫ్టుల్లో పరీక్ష ఉంటుందన్నారు.
మొదటి షిఫ్ట్ పరీక్ష ఉద యం 8.30 నుంచే ప్రారంభమవుతుందని, నిర్ణీత సమయానికి గంటన్నర ముందుగానే అభ్యర్థులను లోనికి అనుమతిస్తామన్నారు. పరీక్ష సమయానికంటే 15 నిమిషాల ముందే కేంద్రాల గేట్లు మూసేస్తామన్నారు. అభ్యర్థులు హాల్ టికెట్‌తోపాటు తప్పనిసరిగా ఆధార్, పాన్‌కార్డు, ఓటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్ వంటి ఫొటో ఆధారిత గుర్తింపు కార్డులో ఏదైనా ఒక గుర్తింపు కార్డు తెచ్చుకోవాలని, సెల్‌ఫోన్, క్యాలిక్యులేటర్, స్మార్ట్ వాచ్, ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాలు తేకూడదని సూచించారు.
చదవండి: SFI: విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశాలు వెనక్కి తీసుకోవాలి
పరీక్షా కేంద్రాల్లోని గదుల్లో తగినంత వెళుతురు, సరిపడా లైటింగ్, తాగునీరు, టాయిలెట్, తదితర వసతులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రతి కేంద్రంలో ఏఎన్‌ఎంను నియమించాలని, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తూ, తగిన పోలీసు బందోబస్తుతో పాటు మహిళా పోలీసు సిబ్బంది ఉండేలా చూడాలని సంబంధిత శాఖల అధికారులకు సూ చించారు.
ముఖ్యంగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహిస్తున్నందున విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ట్రాన్స్ కో ఎస్‌ఈ రవీందర్‌ను అదనపు కలెక్టర్ యాదిరెడ్డి సూచించారు. సమావేశంలో డీఈఓ దుర్గాప్రసాద్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.