Moluguri Kiran Kumar: ఏడాదిలో మూడు ఉద్యోగాలకు ఎంపిక
ఇతనిది నిరుపేద కుటుంబం. ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే చదువుతూ.. పోటీ పరీక్షలు రాశాడు. ఈ ఏడాది జూలైలో టీఆర్‌ఈఐఆర్‌బీ ప్రకటించిన గురుకుల ఉపాధ్యాయ నియామక ఫలితాల్లో జోన్–3లో రెండో ర్యాంక్‌తో సోషల్ టీజీటీగా ఎంపికయ్యాడు.
ప్రస్తుతం వీణవంక గురుకులంలో ఉద్యోగం చేస్తున్నాడు. సెప్టెంబర్‌లో టీజీపీఎస్సీ ప్రకటించిన హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఫలితాల్లో స్టేట్ 357 ర్యాంక్, జోన్–3లో 33వ ర్యాంక్ సాధించాడు. ఇటీవల ప్రకటించిన డీఎస్సీ ఫలితాల్లో సోషల్ స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగం పొందాడు.
చదవండి: TG DSC 2024: కార్మిక కుటుంబాల ఇంట ప్రభుత్వ కొలువులు
75వ ర్యాంకుతో స్కూల్ అసిస్టెంట్‌గా..
చిగురుమామిడి: మండలంలోని గాగిరెడ్డిపల్లికి చెందిన మంద అనూషది నిరుపేద కుటుంబం. ఆమె డీఎస్సీలో 75వ ర్యాంకు సాధించి, స్కూల్ అసిస్టెంట్(మ్యాథ్స్)గా ఎంపికై ంది. భూమయ్య–మణెమ్మ దంపతులకు ముగ్గురు కూతుళ్లు. అనూష రెండో కుమార్తె. ఈమె ఒకటో తరగతి నుంచి ఏడోతరగతి వరకు గాగిరెడ్డిపల్లిలోని ప్రాథమికోన్నత పాఠశాలలో చదివింది.
చదవండి: Kothapally Sai: పోలీస్ జాబ్ వదిలి.. ఉపాధ్యాయ వృత్తిలోకి
ఎనిమిదో తరగతి నుంచి పదోతరగతి వరకు ఇందుర్తిలో, ఇంటర్మీడియట్ సాంఘిక సంక్షేమశాఖ ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్ ఎల్కతుర్తిలో చదువుకుంది. కరీంనగర్ ఉమెన్స్ కాలేజీలో డిగ్రీ, ఓ ప్రైవేటు కళాశాలలో ఎమ్మెస్సీ ఫిజిక్స్, హుస్నాబాద్‌లో బీఈడీ పూర్తి చేసింది.
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |