Bussapur Primary School: బడి బాగుపడ్డది!
ప్రభుత్వం రూ.10 లక్షల నిధులను మంజూరు చేయడంతో పాఠశాలలో కనీస వసతులు మెరుగుపడటంపై విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మంజూరైన నిధులతో పాఠశాలలో గత విద్యాసంవత్సరంలోనే పనులు ప్రారంభించారు. ప్రస్తుత విద్యాసంవత్సరం ప్రారంభానికి పూర్తి చేశారు.
చదవండి: English Medium: ఆంగ్లంలో సుశిక్షిత సైన్యం
చేపట్టిన పనులు ఇవే..
పాఠశాలలో మరుగుదొడ్లు, మూత్ర శాలలను నిర్మించారు. నీటి సవతిని ఏర్పాటు చేశారు. పాఠశాల గదులకు మరమ్మతులు చేపట్టారు. వంటశాలను నిర్మించారు. విద్యార్థులకు డెస్క్ బెంచీలను కొనుగోలు చేశారు. మండలంలో మన ఊరు– మన బడిలో ముందుగా పనులు పూర్తి చేసిన పాఠశాలగా బుస్సాపూర్ పాఠశాల నిలిచింది.
చదవండి: Open Tenth అభ్యర్థులు రీ వెరిఫికేషన్‌కు దరఖాస్తులు
ప్రస్తుతం ప్రాథమిక పాఠశాలలో 60 మంది విద్యార్థులు చదువుతున్నారు. కానీ విద్యార్థుల సంఖ్య తక్కువ ఉండటం పెద్ద లోటుగా ఉంది. విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ఉపాధ్యాయులు బడి బాటలో కృషి చేశారు.